nerve weakness natural remedies

నరాల బలహీనత,నరాల్లో వాపులు-నొప్పి,కళ్ళుతిరగడం,రక్తం గడ్డకట్టడం,ఎముకల బలహీనత,గుండె పోటు జీవితంలో రావు

మన శరీరంలో నరాలు చాలా ముఖ్యమైనవి. ఇవి మన శరీరంలో రక్తాన్ని ఒకచోట నుండి ఒకచోటకి సరఫరా చేస్తాయి. ఒక్కోసారి నరాలు బలహీనపడితే మనం అనేక రుగ్మతలకు కారణమవుతాయి. నరాలలో నొప్పి కలుగుతుంది. దీనినే నెర్వ్ పెయిన్ అంటారు. నరాలు ఎందుకు బలహీనపడతాయి. నరాలలో అడ్డంకులు ఏర్పడితే ఇంటిచిట్కాలతో ఎలా సరిచేసుకోవచ్చో తెలుసుకుందాం. డయాబెటిస్ వలన కూడా నరాలు బలహీనపడొచ్చు. రక్తపోటు వలన కానీ ఫ్యాట్ ఎక్కువ పేరుకున్నామన రోగనిరోధక వలన కానీ అంటే రోగనిరోధక శక్తి పొరపాటున నరాల వ్యవస్థను నాశనంచేస్తుంది. 

అలాగే ఇన్ఫెక్షన్లు, బాక్టీరియా వలన ఏర్పడే నష్టం నేరుగా నరాలపై ప్రభావం చూపుతుంది. ఇంకొకటి హార్మోనల్ ఇన్బాలన్స్. హర్మోనల్ సమతుల్యత లేకపోయినా నరాలవ్యవస్థ దెబ్బతింటుంది. మూత్రపిండాలు, లివర్ సంబంధ వ్యాధుల వలన కూడా నరాలు దెబ్బతింటాయి. శరీరంలో టాక్సిన్లు పేరుకుపోయినా కూడా నరాలపై ప్రభావం ఉంటుంది. న్యూట్రీషన్ లోపం లేదా ధూమపానం ఎక్కువగా చేయడంవలన కూడా నరాలు దెబ్బతింటాయి. కాన్సర్తో బాధపడుతున్న కూడా నరాలు దెబ్బతినొచ్చు.యాక్సిడెంట్ లేదా గాయాల వలన కూడా ఆ ప్రదేశంలో నరాలు పాడవుతాయి.

 నరాలు దెబ్బతిన్నాయని మనకి తెలిసే లక్షణాలివే. ఏదైనా ప్రదేశంలో నొప్పులు లేదా వాపులు ఉంటే ఇది కూడా లక్షణం కావచ్చు. కళ్ళుతిరగడం, నీరసంగా అనిపించడం కూడా నరాల బలహీనత సమస్యే. రక్తప్రసరణ సరిగ్గా జరగకపోతే తలతిరగడం నీరసం ఉంటాయి. నరాలు దెబ్బతిన్న చోట నొప్పులు, వాపులు ఉంటాయి. నరాల బలహీనతతో బాధపడేవారికి వేడిగా ఉంటుంది. చమటలు ఎక్కువగా పట్టడం ఉక్కపోత ఉంటాయి. నరావ.వ్యవస్థ దెబ్బతింటే బి.పీ ఎక్కువవుతుంది. దీనివలన మలబద్దకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి.

 జ్ఞాపకశక్తి తగ్గడం జరుగుతుంది. రాత్రిపూట నిద్రపట్టకపోవడం, రక్తహీనత ఏర్పడటం, గుండె వేగం పెరగడం, నరాల బలహీనతకు లక్షణంగా చెప్పవచ్చు. కొన్ని జాగ్రత్తలతో నరాల బలహీనతను అధిగమించవచ్చు. నరాల బలహీనతతో బాధపడుతుంటే అక్కడ నొక్కడం, పట్టి ఉంచడం చేయకూడదు. ఐస్తో కాపడం పెట్టొచ్చు. దీనివలన ఉపశమనం లభిస్తుంది. ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. రెగ్యులర్ గా వ్యాయామం చేయాలి. యోగా అలవాటు చేసుకోవాలి. బస్ర్తీక ప్రాణాయామం చేయాలి. 

దానివలన నరాల వ్యవస్థ పటిష్టం గా మారుతుంది. అనులోమ్ విలోమ్ ప్రాణాయామం కూడా చేయచ్చు. ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని అందులో దాల్చిన చెక్క లేదా దాల్చిన చెక్క పొడి వేసుకోవాలి. అందులో నల్లయాలకులు తీసుకోవాలి. ఒక యాలకును దంచి  వేసుకోవాలి. తర్వాత గ్లాసు నీళ్ళు అరగ్లాసు అయ్యేంతవరకూ మరిగించి వడకట్టుకోవాలి. తర్వాత ఇందులో బెల్లం వేసుకోవాలి. 

ఒక స్పూన్ బెల్లంపొడి కలుపుకోవాలి. నలుపు లేదా బ్రౌన్ కలర్లో ఉన్ళ బెల్లాన్ని కలుపుకోవాలి. ఆర్గానిక్ బెల్లం అయితే మంచిది. ఇది రోజూ తీసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది. ఈ కషాయాన్ని రాత్రి పడుకునే ముందు తీసుకోవాలి. దీనివలన తక్షణశక్తి అంది నరాల బలహీనత , గుండెదడ శ్వాస సంబంధ వ్యాధులు తగ్గుతాయి. అవిశెగింజలు కూడా ఆహారంలో భాగం చేసుకోవడం వలన ఉపశమనం పొందవచ్చు.

మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి

2 thoughts on “నరాల బలహీనత,నరాల్లో వాపులు-నొప్పి,కళ్ళుతిరగడం,రక్తం గడ్డకట్టడం,ఎముకల బలహీనత,గుండె పోటు జీవితంలో రావు”

  1. నరాల కు సంబంధించి.. న… మేసేజ్… చాలా అవసరం…

    Reply
  2. Sir. Na Peru Prashanth age 24 , Naku chinnapudu chala sarlu talaku gayalu ayyayi & accident kuda jarigindi. Present Naku, paina unna symptoms anni unnaye yedaina, treatment,or salahalu cheppagalarani korutunna

    Reply

Leave a Comment

error: Content is protected !!