Nerve Weakness Reduces Facial paralysis Diabetes

నర నరాల్లో బలం చేకూరుతుంది…. పక్షవాతం వచ్చినవారికి త్వరగా నయం కావడానికి డైట్….. ముఖపక్షవాతం తగ్గిపోతుంది……

శరీరానికి గనక పక్షవాతం వస్తే ఇంకా జీవితంలో చాలా మంది నార్మల్ కాలేరు. అన్నిటికంటే అతి  ఇబ్బందికరమైన జబ్బు పక్షవాతం. పక్షవాతం వలె ఫేషియల్ పెరాలసిస్ ఒక్క ముఖానికి మాత్రమే వస్తుంది. దీనిని బెల్స్ పాలసీ అంటారు. ఇది ఈ మధ్యకాలం ఎక్కువ అవుతుంది. ఈ ఫేషియల్ పెరాలసిస్ రావడానికి కారణం ఏమిటి అంటే ఆ ప్రదేశంలోని రక్తం సరఫరా చేసే నరాల కణాలు స్వేల్ అవ్వడం వల్ల గాని ఈ కండరాలకు సంబంధించిన కంట్రోల్ మెదడులో ఏ భాగంలో ఉంటుందో ఆ భాగంలో బ్రెయిన్ సెల్స్ కానీ నరల సెల్స్ స్వేల్ అవ్వడం వలన సంకేతాలు సరిగ్గా అందవు.

               దీనివలన ముఖం అంతా ఒక పక్కకు లాగేస్తుంది. ఇది ఎందుకు వస్తాయి అంటే ఆన్ కంట్రోల్ డయాబెటిస్ వలన, అన్ కంట్రోల్ బిపి వలన ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కండరాలకు రక్త ప్రసరణ చేసే రక్తనాళాల్లో రక్తం సరిగ్గా సరఫరా కాకపోవడం వలన బీపీ ఎక్కువ అవుతుంది. దీనివలన ఆ భాగాల్లో రక్తం తక్కువ అయిపోయి అక్కడ స్వేల్లీంగ్ మొదలవుతుంది. ఇంకొక కారణం తీసుకుంటే మానసిక ఒత్తిడి. మెదడులో స్ట్రెస్ ఎక్కువ అయినప్పుడు అక్కడ రక్తనాళాల్లో పనితీరు దెబ్బతింటుంది దీనివలన స్వేల్లింగ్ ఏర్పడుతుంది.

           కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ పక్షవాతం రావడానికి కారణం. కొంతమందికి మాత్రమే ఈ నరం పూర్తిగా దెబ్బతింటుంది. కొంతమందికి మరలా రిపేర్ అవుతుంది. కాబట్టి ఫేషియల్ పెరాలసిస్ వస్తే నెల రెండు నెలల్లోనే తిరిగి నార్మల్ అయిపోతుంది. దీనికోసం ముందుగా బీపిని, షుగర్ ని కంట్రోల్లో ఉంచుకోవాలి. మానసిక ఒత్తిడి తగ్గడానికి మెడిటేషన్ వంటివి చేయాలి. ఈ సమస్యకు మందులు మాత్రం తప్పకుండా వాడవల్సిందే. దీనితోపాటు జ్యూస్ ఫాస్టింగ్ చేయాలి. ఇలా పదిహేను రోజులపాటు చేయడం చాలా మంచిది.

                    ఉదయం లేవగానే ఒక గ్లాస్ మంచినీళ్లు తాగాలి. ఆ తర్వాత 8 గంటల సమయంలో ఒకసారి,11గం, 2గం, 5 గం, 7 గం ఇలా రోజుకి ఐదుసార్లు జ్యూస్ తాగాలి. దీనిలో కావాలంటే తేనె కలుపుకోండి తప్ప పంచదార గాని పాలు గాని ఏమి కలపకుండా ప్యూర్ జ్యూస్ మాత్రమే తాగాలి. వీటి వలన ఇన్ల్ఫమేషన్ తగ్గి, స్వేల్లీంగ్ బాగా తగ్గుతుంది. కండరాలు కూడా చాలా ఫ్రీ అవుతాయి. వీటితో పాటు వ్యాయామాలు చేస్తూ రాత్రి సమయంలో నూనెతో కాసేపు మర్దన చేయాలి తద్వారా ముఖ పెరాలసిస్ నుంచి త్వరగా విడుదల పొందవచ్చు.‌.‌

Leave a Comment

error: Content is protected !!