Never loose your patience in adverse conditions

ఎట్టి పరిస్థితుల్లోనూఈ నాలుగు విషయాలు ఎవరికీ చెప్పకండి. చెపితే నష్టపోతారు

చాణిక్య నీతి గురించి మనం చాలా వింటూ ఉంటాం. కష్ట సమయాల్లో ఎలాంటి నియమాలు పాటించాలో చాణుక్యుడు చెప్పినట్టుగా  చాలా విషయాలు ప్రచారంలో ఉంటాయి. ఎటువంటి విషయాలు ఎవరితో పంచుకోకూడదో  తెలియక కొంతమంది అందరితో మనవాళ్ళేగా అని చెప్పి ఆ తర్వాత చాలా ఇబ్బంది పడుతుంటారు. అనేక అవమానాలపాలవుతుంటారు. అలాంటి వారిని ఉద్దేశించి తత్వవేత్త, ఉపాధ్యాయుడైన చాణిక్యుడు చెప్పిన కొన్ని నియమాలు  మన జీవితంలో చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 మనం చాలా విషయాలు బంధువులు, స్నేహితులతో పంచుకుంటూ ఉంటాం. కానీ తర్వాత పరిణామాల గురించి ఆలోచించం. కానీ కొన్ని వ్యక్తిగత విషయాల గురించి అందరితోనూ పంచుకోకూడదు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మనం ఆర్థిక సమస్యలు అనుభవిస్తూ ఆర్థికంగా చితికిపోయినప్పుడు మన బందువులు అయినవారితో మన బాధలు, కష్టాలు చెప్పుకుంటాం. వారు సహాయం చేయకపోగా బయటకు వెళ్లి మన గురించి తక్కువ చేసి హేళనగా మాట్లాడుతుంటారు.

తర్వాత వ్యక్తిగత సమస్యల గురించి కూడా అందరితో చెప్పకూడదు. గతంలో జరిగిపోయిన చేదు జ్ఞాపకాలు, మన వలన జరిగిన పొరపాట్లు, మన ఆరోగ్య సమస్యలు గురించి, మన ప్రవర్తన గురించి, మన రహస్యాలు గురించి ఎవరికీ ఎక్కువగా చెప్పకూడదు. అలా చెప్పడం వలన అందరూ మన గురించి చిన్నతనంగా చూస్తారు. ఇప్పుడు స్నేహితులుగా ఉన్నవారు తర్వాత పరిస్థితులు వలన  శత్రువులుగా మారవచ్చు. మన గురించి వారికి తెలిసిన రహస్యాల గురించి మనల్ని  తక్కువ చేసి అపహాస్యం చేయవచ్చు లేదా అందరిలోనూ మనల్ని తక్కువ చేయవచ్చు.

తరువాత విషయం కుటుంబ సమస్యలు  గురించి ఎవరికీ చెప్పకూడదు. భార్య భర్తల మధ్య గొడవలు లేదా సమస్యలు ఉన్నప్పుడు కూడా వాటి గురించి బయట వారితో చెప్పకూడదు. వీటి గురించి భార్యాభర్తలిద్దరూ మాత్రమే కూర్చొని మాట్లాడుకోవడం మంచిది. అలా మాట్లాడుకోవడం వల్ల అపార్థాలు తొలగి సమస్యలు తీరుతాయి తప్ప బయట వారితో చెప్పడం వల్ల మన అనుకున్న భార్యను  బయట వారి ముందు తక్కువ చేస్తుంటాం.

ఇక నాలుగో విషయం అవమానాలు. కొన్నిసార్లు మన పొరపాటు ఉన్నా లేకపోయినా మనం అవమానాలపాలు అవుతుంటాం. వాటి గురించి ఎవరితోనూ చెప్పుకోకూడదు. అలా చెప్పడం వలన మనల్ని మనముందు ఓదార్చడం మంచి వాక్యాలు చెప్పడం చేస్తారు. కానీ పక్కకు వెళ్లి మన గురించి తప్పుగా మాట్లాడుతారు. రకరకాల కథలు అల్లి మన గురించి ప్రచారం చేస్తారు. అందుకే ఇలాంటి విషయాలు ఇంట్లో వారితో తప్ప ఎవరితోనూ చెప్పకూడదు. మనం మనసు తేలిక అవుతుందని మనసులో విషయాలు బంధువులు, స్నేహితులతో పంచుకుంటాము. కానీ దానికి సరైన వ్యక్తితో పంచుకోకపోతే అనేక ఇబ్బందుల పాలవుతారు అనేది చాణిక్యుని యొక్క సూచన.

1 thought on “ఎట్టి పరిస్థితుల్లోనూఈ నాలుగు విషయాలు ఎవరికీ చెప్పకండి. చెపితే నష్టపోతారు”

Leave a Comment

error: Content is protected !!