మగవాళ్ళు పొరపాటున కూడా ఈ నాలుగు విషయాలు ఎవరికీ చెప్పకూడదు చెప్తే అతని పతనం ప్రారంభం అవుతుందని చాణిక్యుడు వివరించాడు. చాణక్యుడు రాజనీతి శాస్త్రంతో పాటు ఆర్థిక శాస్త్రం భౌతిక శాస్త్రం మరియు మనస్తత్వ శాస్త్రంలో కూడా నిపుణత కనబరిచాడు. చాణిక్యుడు ఎన్నో విషయాల గురించి చక్కగా వివరించాడు. మానవుడు జీవితంలో ముందుకు పోవాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు తోటివారితో మరియు ఇతరులతో ఎలా వ్యవహరించాలి సమాజంలో మనం ఎలా నడుచుకోవాలి అనే అంశాలపై ఎంతో పరిశోధించి వివరించిన ఈయన జ్ఞానం అపారం.
చాణిక్యుడు మనకు ఎన్నో నీతి బోధలు చేశాడు అవన్నీ మనకు నిత్య జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడతాయి. చాణిక్యుడు తన జీవితంలో ఏ విషయాలను ఇతరులతో చెబితే తమకు కీడు జరుగుతుందో చాలా చక్కగా వివరించాడు చాణిక్యుడు చెప్పిన నాలుగు ముఖ్యమైన ఎవరితో చెప్పకూడని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నాలుగు విషయాలను మనిషి ఎల్లప్పుడూ కూడా చాలా గోప్యంగా ఉంచాలి. ఎవరైతే ఈ రహస్యాలను ఇతరులతో చెబుతారు అలాంటి వారు జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారాని చాణిక్యుడు వివరించాడు.
ఇందులో మొట్టమొదటిది
ఆర్థిక పరమైన సమస్యలు మన నిత్య జీవితంలో ఆర్థిక సమస్యలు ఎదురవడం సర్వసాధారణం. ప్రస్తుతం ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవారు కూడా ఒకసారి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న వారే. ఇలా ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు మరియు డబ్బులు వ్యాపారంలో పోగొట్టుకోవడం లేదా వేరే విధంగా డబ్బులు పోగొట్టుకోవడం ఇలాంటి సమస్యల గురించి ఎవరికీ చెప్పకూడదు. కాబట్టి ఆర్థిక సమస్యలు ఉన్నా నష్టపోయిన ఇలాంటి విషయాలు ఎవరికీ చెప్పకూడదు ఒకవేళ ఎదుటివారితో ఈ విషయాలు చెబితే వారు మన పై సానుభూతి వ్యక్తం చేస్తారు బాధ పడినట్లు నటిస్తారు. ఇలాంటి డబ్బులు లేని వారితో దూరంగా ఉండాలని నిర్ణయించుకునే ప్రమాదం కూడా ఉంటుంది. పైగా ఇలాంటి సమయంలో ధన సహాయం ఎవరు చేయరు కాబట్టి మనము అందరితో ఈ విషయాన్ని చెప్పకూడదు.
రెండవది..
మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు మరియు బాధలో ఉన్న ఈ విషయాన్ని ఎవరితో చెప్పకూడదు. ఒకవేళ ఈ విషయాలు చెబితే భవిష్యత్తులో మీ ఆరోగ్య సమస్యలను చూపిస్తూ అందరిలో అవమానించే అవకాశం ఉంటుంది. పైగా మీకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి చాలా మందితో చెబుతారు కొన్ని సందర్భాలలో ఈ విషయాలను చూపించి కించపరుస్తూరు. దీనివల్ల సమాజంలో మీ గౌరవ మర్యాదలు పోతాయి పైగా మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెలిసిన లేదా లేదా ఏదైనా సమస్యతో బాధపడుతున్నారని తెలిసినా ఎదుటి వారు సంతోషిస్తారు. కాబట్టి ఇలాంటి విషయాలు ఎవరితో పెంచుకోకూడదు.
మూడవది
మీ భార్య గురించి నిజమైన వ్యక్తి తన భార్య యొక్క రహస్యాలను గోప్యంగా ఉంచుతాడు. ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఉన్నా వాటిని సమాజానికి తెలియని ఇవ్వడం, భార్యతో గొడవ మరియు ఆమె ప్రవర్తన గురించి బయట వ్యక్తుల దగ్గర పొరపాటున కూడా చెప్పడు. ఇలా పొరపాటున ఇతరులతో ఈ విషయాన్ని చెబితే మిమ్మల్ని చులకనగా చూస్తారు మీ భార్య రహస్యాలు మరియు వివాహ బంధంలోని ముఖ్యమైన విషయాలను తెలుసుకొని భవిష్యత్తులో మీ బంధం విడిపోవడానికి ఇతరులు కారణమవుతారు. కాబట్టి భార్యాభర్తల మధ్య ఉండే రహస్యాలు గొడవలు ఎవరితో చెప్పకూడదు.
నాలుగవది
మీకు జీవితంలో అవమానం జరిగితే దానిని ఎవరితో పెంచుకోకూడదు. ఒకవేళ మీ బాసు దగ్గర లేదా అపరిచిత వ్యక్తుల దగ్గర లేదా ప్రయాణాలలో మీకు అవమానం జరిగితే ఆ విషయాన్ని ఇతరులకు చెప్పటం వలన మీరు ఇతరుల దృష్టిలో చులకన అవుతారు. ఆ విషయాన్ని అందరితో చెప్పి మీతో గౌరవం లేకుండా ప్రవర్తిస్తారు. వారికి మీ గురించి ఇంకా చెడ్డగా చెబుతారు.
చివరిగా..
ఈ నాలుగు విషయాలు ఎవరితో పంచుకోకుండా ఐదో విషయం మాత్రం ప్రతి ఒక్కరూ జీవితంలో గుర్తించుకోవాలి. డబ్బులు లేని మగవాన్ని వేశ్య వదిలేస్తుంది. ఓడిపోయిన రాజును ప్రజలు వదిలేస్తారు. పండు ఇవ్వని చెట్లను పక్షులు వదిలేస్తాయి. కాబట్టి విలువ ఉన్నంతవరకే ప్రపంచం గుర్తు పెట్టుకుంటుంది. విలువ లేని వ్యక్తిని అందరూ వదిలేస్తారు ఇది మనుషుల మనస్తత్వం అని చాణిక్యుడు వివరించాడు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులలో మీ సమస్యలను ఇతరులకు చెప్పడం చేయకూడదు. సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా హుందాగా ఉండగలిగితే మీకు సంఘంలో మంచి పేరు కలుగుతుంది చాణిక్య నీతి. ఈ ఆర్టికల్ మీకు నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ కు షేర్ చేయడం మర్చిపోకండి.