ప్రస్తుతం ఏ చిన్న నొప్పి, నలత కలిగినా ప్రజలు ఇదేమైనా కరోనా లక్షణమా?? అని భయపడిపోతున్నారు. ప్రతి ఇద్దరిలో ఒకరికి పాజిటివ్ తెలుతున్న క్లిష్ట పరిస్థితులలో అంతా గందరగోళంలో ఉన్నారు. కరోనా వచ్చిన వారిలో కొన్ని లక్షణాలు తేలికపాటివి మరియు ఇంట్లో చికిత్స చేయగలిగినప్పటికీ, కొన్ని ప్రాణాంతక పరిణామాలను కలిగిస్తాయి వెంటనే వైద్యం అందించాల్సిన ప్రమాదకరమైన కరోనా లక్షణాలు ఇవే మీలో మరియు మీ కుటుంబ సభ్యులలో ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం చిన్న సమస్య అనుకుని నిర్లక్ష్యం చేయకండి.
ఊపిరిపీల్చుకోవడంలో ఇబ్బంది
కోవిడ్ లక్షణాలు క్షీణిస్తున్నాయా అనేదానికి ఉత్తమమైన కొలత శ్వాస ఆడకపోవడం మరియు సాధారణ రోజువారీ కార్యకలాపాలు, వాషింగ్, డ్రెస్సింగ్, వంట, మెట్లు ఎక్కడం ఇలా ప్రతీది పరిగణలోకి తీసుకోవచ్చు. ఏ పని చేస్తున్న విపరీతమైన ఆయాసం, అలసట, తొందరగా చెమటలు పట్టిపోవడం, వీటికి తోడు తలనొప్పి, నోరు తడి ఆరిపోవడం, ముక్కులు పొడిగా అవ్వడం మొదలైనవి అన్ని కూడా మన శ్వాశ వ్యవస్థ సమర్థవంతంగా లేదని ఇచ్చే సంకేతాలు. శ్వాశ సరిగా లేక ఆక్సిజన్ లెవల్ పడిపోవడం కరోనా బాధితులలో చాలా ప్రమాదకరమైన లక్షణం. ఊపిరి తీసుకోవడంలో ఏమాత్రం అడ్డంకి అనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. అలాగే కరోనా కాదని తేలిన పక్షంలో తగినంత ఆక్సిజన్ లెవల్స్ పొందడం కోసం బోర్లా పడుకోవడం, అష్టాంగ మకర ఆసనం, ప్రాణాయామం వంటివి ఎంతగానో ఉపకరిస్తాయి.
మైకము లేదా ఆకస్మిక అపస్మారక స్థితి:
కరోనా యొక్క అంతర్లీన లక్షణాల కారణంగా ఒకరు మైకముగా లేదా అపస్మారక స్థితిలో ఉన్నట్లు భావిస్తే, ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నట్టే. శ్వాశ సరిగా అందకపోవడం, ఊపిరితిత్తులలో విపరీతమైన మంట, మగత కమ్ముకుంటూ కళ్ళు మూతలు పడుతూ ఉంటే అది చాలా తీవ్ర ప్రమాదకర పరిస్థితి అని చెప్పవచ్చు. దీనికి ఎలాంటి ఇంటి వైద్యం పనికి రాదు. ఎంత తొందరగా వైద్యులను సంప్రదిస్తే అంత ఉత్తమం.
పై రెండు లక్షణాలు ప్రాణాంతకమైనవి వైద్యులను తప్పక సంప్రదించవలసినది ఇవి కాకుండా సాధారణంగా చాలామందిలో కొన్ని లక్షణాలు ఓకేవిధంగా ఉంటున్నాయి
– జ్వరం
– పొడి దగ్గు
– గొంతు మంట
– జలుబు, తుమ్ములు
– అలసట
– వాసన మరియు రుచి కోల్పోవడం మొదలైనవి.
చివరగా…….
పైన చెప్పుకున్నవాటిలో సాధారణ లక్షణాలు పట్ల ఇంట్లోనే తగిన జాగ్రత్తలు పాటిస్తూ వైద్యులు సూచించే మందులు వాడితే ఎలాంటి సమస్య లేకుండా కరోనా వచ్చిన దారినే తోకముడిచి వెళ్ళిపోతుంది. కానీ ప్రమాద లక్షణాల పట్ల మాత్రం ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా ఎంత త్వరగా వైద్యున్ని సంప్రదిస్తే ప్రాణం అంత పదిలం.