new-precautions-during-virus-attack-at-home

కొత్తరకం క*రోనా ఇలా సోకుతుంది, కొత్త రకం క*రోనా లక్షణాలు తెలుసుకోండి | C0rona Symptoms

క*రోనా మహమ్మారి విపరీతంగా వ్యాప్తి చెందుతుంది. ఎంతో మంది దీని బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. కొంతమంది ప్రాణాలు కాపాడుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. క*రోనా వైరస్ లక్షణాలు క*రోనా వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది వివరంగా చెబుతాను . ఇలా తెలుసుకుని జాగ్రత్త పడాల్సిన అవసరం ఎప్పుడు వస్తుందో కూడా తెలుసుకుందాం .

కిందటి సంవత్సరం క*రోనా మన మీద దండయాత్ర చేసి చాలా ఇబ్బంది పెట్టింది. మళ్లీ ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఇబ్బంది పెడుతుంది. ఆరోగ్యశాఖ గైడ్లైన్స్ ప్రకారం గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందని రుజువయింది. 

అందుకే అందరికీ త్వరగా వ్యాప్తి చెందడం మొదలుపెట్టింది. అందుకే వైరస్ గురించి తెలుసుకుని జాగ్రత్తపడడం మంచిది. అందరి శరీరాలు ఒకేలా ఉండవు. ఒక్కొక్కరి రోగ నిరోధక శక్తి ఒకోలా ఉంటుంది. పని చేసే విధానం కూడా వేర్వేరుగా ఉంటుంది. కొంతమందికి క*రోనా వైరస్ సోకిన సోకినట్టు తెలియదు. కొంతమందికి వైరస్ సోకినా వాళ్ల పరిస్థితి ఘోరంగా మారుతుంది. కోలుకోవడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. దీని వెనుక ఉన్న కారణం ఏమిటంటే వాళ్లకు ఉండే రోగ నిరోధక శక్తి. ఈ వైరస్ రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వారిలో ఆక్సిజన్ లెవల్స్ తగ్గి పోయేలా చేస్తుంది. అందువల్లే చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు.

 కొంతమంది ఆకతాయిలు వైరస్ ను తక్కువ అంచనా వేసి కావాలని దాని బారిన పడుతున్నారు. ఏం చేయలేదు ఒకవేళ సోకినా నాలుగైదు రోజుల్లో తగ్గిపోతుంది అనుకొని ని నిర్లక్ష్యంగా తిరుగుతున్నారు. 34 సంవత్సరాల లోపు వారికి ఈ వైరస్ సోకితే ప్రాణాలు కోల్పోయే అవకాశం చాలా తక్కువ. కొత్త రకం వైరస్ సోకడం వలన మీరు చాలా రోజులు బాధ పడతారు. అందుకని ఈ జాగ్రత్తలు పాటించడం మంచిది. కొంతమందికి ఏమి కాదు గాని వారి వలన పక్కవారికి వచ్చే అవకాశం ఉంది.  ఒకవేళ వారికి ఇమ్యునిటి తక్కువ ఉంటే వారు ప్రాణాపాయ స్థితికి వెళ్లే అవకాశం ఉంది. తర్వాత బాధపడిన ప్రయోజనం ఉండదు. ఒకవేళ మీకు వైరస్ లేకపోయినా  మాస్క్ ధరించడం, డిస్టెన్స్ పాటించడం, అవసరం లేని పనులకు బయటకు వెళ్లడం మానేయాలి.

 ఈ వైరస్ వచ్చిందో లేదో ఎలాంటి లక్షణాలను బట్టి తెలుసుకోవాలి. ముందుగా జ్వరం రావడం, గొంతు నొప్పి, కఫం ఎక్కువగా పెరిగి పోవడం వంటి లక్షణాలు బయటపడితే మీకు క*రోనా వైరస్ సోకిందని 50 శాతం నిర్ధారించుకోవచ్చు. మొదటి రోజు కొంచెం నీరసంగా అనిపించడం రెండో రోజు జ్వరం ఎక్కువగా రావడం జరుగుతుంది. కొంతమందికి జ్వరం ఎక్కువగా రాదు శరీరంలో నీరసంగా అనిపిస్తుంది. ముందుకంటే మీ శరీరంలో నీరసంగా అనిపిస్తుంది. అలా అనిపిస్తే వెంటనే మీ శరీరంలో ఏదో తేడా వచ్చిందని భావించాలి. వెంటనే ఆవిరిపట్టడం, ఉప్పు నీటితో నోరు పుక్కిలించడం ద్వారా ఎక్కువగా ఉంటే ఇటువంటి పనులు తప్పకుండా చేయాలి.

 జ్వరానికి మందులు వేసుకోవాలి. జ్వరం రెండు నుంచి మూడు రోజుల్లో తగ్గకుండా వస్తూ ఉంటే వెంటనే మీరు క*రోనా వైరస్ టెస్ట్ చేయించుకోండి. కొంతమందికి వైరస్ తక్కువగా ఉండి వాసన పీల్చే శక్తి తగ్గిపోతుంది. మీకు గనక వాసన తగ్గిపోవడం, రుచి తగ్గిపోవడం గనుక ఉంటే వెంటనే పరీక్ష చేయించుకోండి. వైరస్ మీ ముక్కు ద్వారా సోకితే వైరస్ ముక్కుని బ్లాక్ చేస్తుంది. దీని వలన ఎటువంటి వాసన తెలియదు. ఒకవేళ మీకు ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్ష చేయించుకోండి.

కొంతమందికి జ్వరం లేకపోయినా నీరసం ఉంటే  వైరస్ శరీరంలో తక్కువగా ఉందని అర్థం. ఈ లక్షణాలలో ఏవైనా కనిపిస్తే వెంటనే ఐసోలేటెడ్ అయిపోండి. ఇంట్లో వారిని దూరంగా ఉండమని హెచ్చరించండి. రూమ్ లో సపరేట్ గా ఉండడం చేయండి. ఇంట్లో పెద్దవారు చిన్న పిల్లలు ఉంటే వారి దరిదాపుల్లో కూడా వెళ్ళకండి. వీలైనంత దూరంగా ఉంటే జాగ్రత్తలు తీసుకోండి. డాక్టర్ సలహాతో  మందులు వాడుతూ ఆరోగ్యంగా ఉండండి.

Leave a Comment

error: Content is protected !!