night cream for oily skin

రాత్రి పడుకునే ముందు ఇది అప్లై చేయండి, మీ స్కిన్ తెల్లగా మారడం చూసి మీరే షాక్ అవుతారు

చాలామంది తమకు ఉండే మొటిమలు మచ్చలు రావడం వచ్చిన మచ్చలు,  డార్క్ సర్కిల్స్, పిగ్మెంటేషన్ వంటి సమస్యలతో ఇబ్బంది పడతారు. వాటిని తగ్గించుకోవడం కోసం పార్లర్కు వెళ్లి లేదా మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్  కోసం వేలకు వేలు ఖర్చు పెడతారు. కానీ  వాటిని ఉపయోగించడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇంట్లో ఉన్న వాటితో మీ  ముఖం పై నల్లని మచ్చలు, మొటిమలు, మొటిమల వల్ల మచ్చలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. 

      దీనికోసం ముందుగా బంగాళదుంప తీసుకోవాలి. బంగాళదుంప  నేచురల్ బ్లీచింగ్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది ముఖం పై నల్లని మచ్చలు, మొటిమలు, మొటిమల వల్ల వచ్చే మచ్చలు తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. సన్ టాన్  రిమూవ్ చేయడంలో  కూడా చాలా బాగా సహాయపడుతుంది. బంగాళదుంప తొక్క చెక్కుకొని గ్రేటర్ సహాయంతో మెత్తగా తురుముకోవాలి. దీనినుండి  జ్యూస్ వడకట్టుకుని పక్కన పెట్టుకోవాలి. బంగాళదుంప జ్యూస్ వద్దు అనుకున్నవాళ్ళు క్యారెట్ జ్యూస్ లేదా  బీట్ రూట్ జ్యూస్ ఉపయోగించుకోవచ్చు. తర్వాత దీనిలో  ఒక చెంచా బాదం నూనె వేసుకోవాలి. 

     బాదం నూనె ముఖం పై నల్లని మచ్చలు డాక్టర్ కి తగ్గించి ముఖానికి  స్మూత్ గా చేయడంలో సహాయపడుతుంది. తర్వాత దీనిలో రెండు విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసుకోవాలి. విటమిన్ ఇ ఆయిల్ చర్మంపై ఉండే ముడతలు, నల్లని మచ్చలు, పిగ్మెంటేషన్, సన్ టాన్ వంటి  సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది. తర్వాత దీనిలో  ఒక చెంచా అలోవెరా జెల్ వేసుకోవాలి. ముఖం స్మూత్ గా చేయడంలో అలోవెరా జెల్  సహాయపడుతుంది. వీటన్నింటినీ బాగా కలుపుకుని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 

       తరువాత రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని దీనిని అప్లై చేసుకోవాలి. ఇది పేస్ సీరంలాగా చాలా బాగా సహాయపడుతుంది. ప్రతిరోజు ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల ముఖంపై వచ్చే నల్ల మచ్చలు పిగ్మెంటేషన్ 1 వల్ల వచ్చిన మచ్చలు ఉంటే సమస్యలు తగ్గి ముఖం తెల్లగా మెరిసిపోతుంది. మనం  మార్కెట్లో సీరం కొనాలంటే 5ml -10ml కూడా వేలకు వేలు ఖర్చవుతుంది.  ఎటువంటి ఖర్చు లేకుండా నేచురల్గా ఇంట్లో ఉన్న వాటితోనే పేస్ సీరం  తయారు చేసుకొని ఉపయోగించవచ్చు. దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనిలో బంగాళాదుంప ఉపయోగించడం వలన ఇది నాచురల్ బ్లీచింగ్ గుణాలు కలిగి ఉంటుంది. 

Leave a Comment

error: Content is protected !!