Nutrition In Ridge Gourd Beerakaya Health Benefits

బీరకాయ ఇలా వాడితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

కూరగాయలలో బీరకాయకున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. నేతి బీరకాయ అంటూ అందరూ ఇష్టంగా పిలుచుకునే బీరకాయ కూర కమ్మగా ఉంటుంది. బీరకాయ పొట్టుతో కూడా పచ్చడి చేసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. తిన్న ఆహారాన్ని తొందరగా అరిగేలా చేసే బీదకాయతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయ్. బిరాబిరా బీర…… కాయతో కలిగే ప్రయోజనాలు చూడాల్సిందే.

 ◆బీరకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది మరియు విటమిన్-సి, జింక్, ఐరన్, రిబోఫ్లేవిన్, మెగ్నీషియం, థియామిన్ మరియు ఇతర ఖనిజాలు బీరకాయలో  సమృద్ధిగా ఉంటాయి

 ◆ ఇందులో సంతృప్త కొవ్వు, కొలెస్ట్రాల్ మరియు కేలరీలు తక్కువగా ఉంటాయి, ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి.

 ◆ తాజా బీరకాయలో మంచి సెల్యులోజ్ మరియు అధిక నీటి శాతం ఉంటుంది, ఇది మలబద్దకం నుండి ఉపశమనం పొందటానికి సహాయపడుతుంది.

 ◆ ఇందులో పెప్టైడ్స్ మరియు ఆల్కలాయిడ్స్ వంటి ఇన్సులిన్ ఉంటుంది, ఇది రక్తం మరియు మూత్రంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది.

 ◆బీరకాయలో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది, ఇది కంటి ఆరోగ్యానికి కంటి చూపును మెరుగు పరచడానికి అద్భుతంగా దోహాధం చేస్తుంది.

 ◆మన శరీరంలో కలుషితమైన రక్తాన్ని శుద్ధి చేయడంలో బీరకాయ ప్రభావవంతంగా పనిచేస్తుంది.  ఇది కాలేయ ఆరోగ్యాన్ని రక్షిస్తుంది మరియు కాలేయ సమస్యలను తగ్గిస్తుంది. మద్యపానం తీసుకున్నవారిని  మత్తు నుండి బయటకు తీసుకురావడానికి బీరకాయ మంచి ఎంపిక. అలాగే మద్యపాన ప్రభావంలో  నష్టపోకుండా కాలేయాన్ని రక్షిస్తుంది.

 ◆ కామెర్లు నయం చేయడానికి మరియు ఇన్ఫెక్షన్ ల  నుండి కాపాడి శరీర  రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి బీరకాయ రసం ఉపయోగిస్తే గొప్ప ఫలితం ఉంటుంది..

  ◆ఇది చర్మ సంరక్షణకు మంచిది, ఎందుకంటే రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు ఇందులో ఉన్నాయి, అలాగే  మొటిమలు మరియు మచ్చలను తొలగించి చర్మాన్ని  క్లియర్ చేయడంలో బీరకాయ మంచి ఫలితాలను ఇస్తుంది..

 ◆బీరకాయ ఆమ్లత్వంను తగ్గించడం తో పాటు  పాటు పూతలు మరియు అల్సర్ల నివారణకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఇది శరీరాన్ని చలువ చేసి వేడిని తగ్గిస్తుంది.  మూత్రవిసర్జన సమయంలో మూత్రంలో మంట, నొప్పి వంటి సమస్యలను సులువుగా తగ్గిస్తుంది.

చివరగా…..

తీగ జాతికి చెందిన బీరకాయ తో బోలెడు వంటలు చేసుకుని తినడం వల్ల పైన చెప్పుకున్న సమస్యలు మాత్రమే కాకుండా కొలెస్ట్రాల్, ఎసిడిటీ, పేగు సంబంధ సమస్యలు మొదలైనవి అన్ని క్రమంగా తగ్గిపోతాయి.

Leave a Comment

error: Content is protected !!