oily skin removal home remedies

ముఖం పై జిడ్డు మొత్తం పోగొట్టి మెరిసిపోయేలా చేసే అద్భుతమైన ప్యాక్

 ఒకొక్కరి శరీరతత్వం ఒక్కో రకంగా ఉంటుంది. కొందరికి శరీరానికి పడేవి  కొందరికి పడవు. కొందరు డ్రై స్కిన్, కొందరు సెన్సిటివ్ స్కిన్, కొందరు ఆయిలీ స్కిన్ కలిగి ఉంటారు.అందరికి ఒకే రకమైన చిట్కాలు పనిచేయవు. వాళ్ళ స్కిన్ టైపు బట్టి ప్యాక్స్ కూడా వేసుకోవాలి.  ఆయిలీ స్కిన్ ఉన్నవారికి ముఖం కడుక్కున్న వెంటనే కూడా  జిడ్డు కారి పోతూ ఉంటుంది.  ఆయిల్ స్కిన్ ఉన్నవారు ఏదైనా ఫంక్షన్ కి  లేదా పార్టీకి వెళ్ళాలి  అనుకొన్నప్పుడు రెడీ అయిన వెంటనే ముఖం  జిడ్డు అయిపోతుంది.

      ఇలా జిడ్డు చర్మం  వల్ల వారికి ఏదైనా ఫంక్షన్ కి పార్టీ కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. పాలితిన్ నన్ను అర్థం చేసుకోవడానికి పార్లర్  చుట్టూ తిరిగి రకరకాల క్రీములను అప్లై చేస్తూ ఉంటారు. ఆ క్రీములలో కెమికల్స్ ఉండటం వలన జిడ్డు తగ్గకపోగా కొత్త సమస్యలు వస్తాయి. ఈ ప్యాక్ ఉపయోగించినట్లయితే ముఖం పై ఉండే జిడ్డు మొత్తం పోయి అందంగా మెరిసిపోతారు.  ఈ ప్యాక్ ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక చెంచా కాఫీ పౌడర్ వేసుకోవాలి. 

       తర్వాత దానిలో రెండు చెంచాల తేనె వేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక చెంచా నిమ్మరసం కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మీద అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత 5  నిముషాల పాటు ఉండనివ్వాలి.  అయిదు నిముషాల తర్వాత 5 నుండి 10 నిముషాల పాటు సర్కులర్ మోషన్ లో  మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన బ్లడ్ సర్క్యూలేషన్ బాగా జరిగి ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది. తర్వాత గోరు వెచ్చటి నీళ్లతో ముఖం కడిగేసుకోవాలి. 

          ఇలా చేయడం వలన ముఖం పై జిడ్డు మొత్తం పోయి ముఖం ప్రెష్ గా, అందంగా, కాంతివంతంగా కనిపిస్తుంది. ఈ ప్యాక్ ఉపయోగించడం వలన ముఖం పై ఉండే జిడ్డు, మురికి, సన్ టాన్  మొత్తం పోయి ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. జిడ్డు చర్మంతో బాధపడేవారు ఒకసారి ఈ ప్యాక్ ట్రై చేసి చూడండి. రిజల్ట్ చూసి ఆశ్చర్యపోతారు. పార్లర్కి వెళ్లి వేలకు వేలు ఖర్చుపెట్టి డబ్బు మరియు సమయం వృధా చేయడం కంటే ఈజీగా ఇంట్లోనే మీ ముఖాన్ని అందంగా, కాంతివంతంగా మార్చుకోవచ్చు.

Leave a Comment

error: Content is protected !!