బట్టల విషయంలో ఒక్కొక్కరు ఒకో రకంగా చేస్తూ ఉంటారు. మనం బట్టలను కొన్నపుడు చాలా కొత్తగా ఉంటాయి. అవి వాడేకొద్దీ పాతబడిపోతాయి. ప్రతి ఒకరి ఇంట్లో పాత బట్టలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ బట్టలను మనం ఏం చేయాలి ఎవరికి ఇవ్వాలి ఎలా చేయడం వల్ల మనకు మంచి జరుగుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం అందరం బట్టల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
మాసిన బట్టలు ఎక్కువగా అయ్యేంత వరకు ఇంట్లో మూటలు కట్టి వారానికి ఒకసారి ఉతకడం చేస్తారు. అలా మాసిన బట్టలు ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మి దేవి వెళ్ళిపోయి దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అందుకే ఎక్కువగా మాసిన బట్టలు ఇంట్లో ఉంచుకోకూడదు. మాసిన బట్టలు మంగళవారం, శుక్రవారం ఉతకకూడదు. బట్టలను ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్ర సమయాన ఉతకకూడదు. సూర్యరశ్మి పడే సమయంలో మాత్రమే ఉతకాలి.
ఎందుకంటే బట్టలు సూర్యరశ్మి తగిలకపోతే ముక్కు వాసన వస్తాయి ఇంట్లో అలా ఉంచకూడదు. ఒకరి బట్టలను ఇంకొకరు వేసుకోకూడదు. ఇంట్లో బట్టలను ముక్కు వాసన వచ్చేంతవరకు ఉంచకూడదు అలా ఉంచడం వల్ల దరిద్ర దేవత తిష్ట వేసుకుని ఉంటుంది. ఒకరి బట్టలు ఇంకొకరు వేసుకోవడం వల్ల వారికి ఉండే చర్మ సమస్యలు ఏమైనా వీరికి కూడా వచ్చే అవకాశం ఉంటుందని మన పెద్దలు ఇలాంటి నియమం పెట్టారు. ఒకసారి వేసుకున్న బట్టలు ఉతకకుండా మళ్లీ వేసుకోకూడదు.
కొంతమంది ఒకసారి వేసుకున్న బట్టలు రెండు మూడు రోజులు వేసుకుంటారు. అలా వేసుకోకూడదు. పాత బట్టలను ఒకరికి ఇవ్వడం వలన వారికి ఉపయోగపడతాయి. కానీ పాత బట్టలను ఇచ్చినప్పుడు దాన్ని దానం చేసినట్లు అనుకోకూడదు. కొత్త బట్టలు ఇచ్చినట్లయితే అది దానం అవుతుంది. ఎవరికైనా బట్టలు లేవు లేక ఇబ్బందుల్లో ఉన్నారు అని జాలిపడి పాత బట్టలు ఇచ్చినట్లయితే అది సహాయం అవుతుంది. ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మిదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది.
ఆడవారు ఉదయాన్నే లేచి స్నానం కార్యక్రమాలు పూర్తి చేసుకొని, పూజా, వంట పూర్తి చేసుకుని పిల్లలు భర్త ని బయటకు పంపించిన తర్వాత ఇల్లు మొత్తం సువాసనభరితంగా ఉండేలాగా హారతి, సామ్రాణి వేసి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి గుమ్మానికి పసుపు, కుంకుమ పెట్టి ఎప్పుడు పూలు పెట్టి ఉంచడం వల్ల ఆ ఇంట్లో నుండి లక్ష్మి దేవి వెళ్ళమన్న వెళ్ళదు.