oninon peel oil for hair growth

ఉల్లి తొక్కలు పారేస్తున్నారా. ఒకసారి ఇది చూడండి. ఇంకెప్పుడు పారెయరు

ఉల్లి ఆరోగ్యానికి తల్లి వంటిది అని చెబుతూ ఉంటారు. ఉల్లిని రకరకాల వంటల్లో రుచి మరియు గ్రేవీ కోసం వాడతారు. అలాగే ఉల్లి తొక్కలను మాత్రం బయట పారేస్తూ ఉంటారు. కానీ వీటితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందులో ఒకటి జుట్టు రాలే సమస్యను నివారించడంలో ఉల్లి తొక్కలు చాలా బాగా పనిచేస్తాయి. దాని కోసం మనం ఉల్లి తొక్కలను సేకరించి పెట్టుకోవాలి. వాటిని ఒకసారి నీటిలో కడిగి తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో వేసుకోవాలి. ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసి అవి మునిగేవరకూ నీటిని వేసుకోవాలి. 

ఈ నీటిని బాగా మరిగించాలి. నీళ్ళు బాగా మరిగి రంగు మారేంతవరకు అలాగే ఉండనివ్వాలి. తరువాత దీనిపై ఒక మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మరిగించాలి. కొంతసేపటికి స్టవ్ ఆపేసి నీటిని వడకట్టుకోవాలి. ఈ నీరు మంచి బ్రౌన్ కలర్లోకి వస్తాయి. తర్వాత ఈ నీటిని తలకు స్ప్రే చెయ్యాలి లేదా కుదుళ్ళకు వేళ్ళతో పట్టించి పదినిమిషాలు పాటు మసాజ్ చేయడం వలన జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.రక్తప్రసరణ మెరుగుపడి జుట్టు బలంగా, ధృడంగా తయారవుతుంది. 

ఉల్లిపాయలు సల్ఫర్‌తో నిండి ఉంటాయి, ఇవి సమర్థవంతమైన జుట్టు పెరుగుదలకు మరియు జుట్టు రాలడాన్ని ఆపుతాయి.  ఈ నీరు శీఘ్ర హెయిర్ టోనర్గా పనిచేస్తుంది. ఇందులో వాడిన కరివేపాకు జుట్టు కుదుళ్ళను బలంగా చేయడానికి, నల్లగా ఉండేందుకు సహకరిస్తుంది. ఈ నీరు ఎండినట్టు ఉన్న జుట్టుకు జీవాన్ని ఇచ్చి తిరిగి మెరిస్తూ ఉండేలా చేస్తుంది. ఉల్లి నీటీని మీ జుట్టుకు వారానికి రెండు సార్లు తప్పకుండా  ఉపయోగించండి మరియు మీ జుట్టు పెరుగుదలలో అద్బుతమైన మార్పును చూడండి. ఈ నీటిని వారంరోజులు వరకూ ఫ్రిజ్లో స్టోర్ చేసుకోవచ్చు.

అనేక అధ్యయనాలు ఉల్లిపాయ తొక్కలలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్ ఎ, సి, ఇ మరియు గుండెకు అనుకూలమైన ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు.  రోగనిరోధక శక్తిని పెంచడానికి మరియు గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి మరియు రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడానికి ఉల్లిపాయ తొక్కలు ప్రయోజనకరంగా ఉంటాయని చెప్పబడింది.

Leave a Comment

error: Content is protected !!