onion benefits and facts

ఉల్లిపాయ 🌰😱 తినే ప్రతిఒక్కరూ ఈ వీడియో తప్పకుండా చూడండి.. onion benefits and facts

బిర్యానీ తింటే పక్కనే ఉల్లిపాయ ఉండాల్సిందే చాలామందికి. అందులోనూ పచ్చి ఉల్లి చేసే మేలు చాలా ఎక్కువ. అందుకే ఉల్లికి భారతీయ వంటల్లో ఉల్లికి ప్రత్యేక స్థానం ఉంటుంది. పచ్చి ఉల్లిపాయను తినేవారు ఈ కింది సమాచారం తెలుసుకోండి. ఉల్లిని కోసినపుడు అందులోనుండి కొన్ని ఎంజైమ్స్తో పాటు ఘాటైన సల్ఫర్ కూడా బయటకు వస్తుంది. అందుకే కళ్ళు మండుతాయి. ఉల్లిపాయను శతాబ్దాల క్రితం నుండి వాడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, బీహార్ ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తారు. పచ్చిఉల్లిపాయలు తినొచ్చా అంటే ఎటువంటి సందేహం లేకుండా తినొచ్చు. పచ్చి ఉల్లిపాయను తినడం వలన జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి..

ఎర్ర ఉల్లిపాయలు తినడంవలన మన శరీరంలో మంచి కొవ్వులు ఏర్పడతాయి. ఇందులో ఉండే సల్ఫర్, పొటాషియం, విటమిన్ బి, సి, పీచుపదార్థాలు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. నిద్రలేమి, కాన్సర్ నిరోధిస్తుంది. ఉల్లి కీళ్ళకు గుండెకు మేలు చేస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఉల్లిపాయను అనేకరకాల మందుల తయారీకి వాడుతున్నారు. ఉల్లి రసంలో తేనె కలిపి తీసుకుంటే జలుబు‌,దగ్గు  తగ్గుతాయి. ఎందుకంటే బ్యాక్టీరియా వలన కలిగే ఇన్ఫెక్షన్లు, డయేరియా నుండి కాపాడతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ ను అడ్డుకుంటాయి.  యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అనేకరకాల వ్యాధుల నుండి రక్షిస్తాయి. రోజు ఉల్లిని తింటే ఎముకల బలహీనతను అధిగమించవచ్చు. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు జుట్టు సమస్యలు తగ్గిస్తాయి. ఉల్లిరసాన్ని  వారానికి రెండు సార్లు తలకు పట్టిస్తూ ఉంటే చుండ్రు, జుట్టు రాలే సమస్యలకు చెక్ చెప్పొచ్చు. మృదువుగా మారడంతో పాటు ఉల్లిరసం రాయడంవలన జుట్టు మాడుకు రక్తప్రసరణ మెరుగుపడుతుంది. 

మధుమేహం ఉన్నవారు ఉల్లిని తినడం వలన ఇన్సులిన్ ఉత్పత్తి ని మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే చక్కెర నిల్వలను అదుపులో ఉంచుతుంది. జ్ఞాపకశక్తి పెరగాలన్నా,గుండె జబ్బులు నిరోధించాలన్నా ఉల్లిపాయను క్రమంతప్పకుండా తీసుకోవాలి. రక్తనాళాల్లో చేరిన కొవ్వు రక్తప్రవాహానికి అడ్డంగా ఉండి గుండెజబ్బులకు కారణమవుతుంది. ఉల్లి రక్తాన్ని పలుచగా చేసి స్వేచ్ఛగా ప్రవహించేలా చేస్తుంది. గుండెపోటు ను దూరం చేస్తుంది.

కిడ్నీలో రాళ్ళతో బాదపడేవారు పెరుగులో ఉల్లి ముక్కలను కలిపి తినడంవలన కిడ్నీలలో రాళ్ళు కరిగిపోతాయి. మూత్రాశయ ఇన్ఫెక్షన్లు ఉన్నవారు ఉల్లిని తినడంవలన త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఉల్లిని ముక్కలుగా తరిగి నీటిలో మరిగించి ఆనీటిని రోజంతా తాగుతూ ఉండడంవలన మంచి ఫలితం ఉంటుంది. కానీ రోజుకు ఆరేడుగ్రాములకు మించి ఉల్లినీరు తాగకూడదు. ఇదండీ కోయగానే కన్నీళ్లు పెట్టించే ఉల్లి చేసే మేలు. 

Leave a Comment

error: Content is protected !!