onion benefits for health

పచ్చి ఉల్లి డైలీ తింటే…….. ఎగిరిగంతేసే బెనిఫిట్స్ మీకు అందుతాయి…

ఈరోజుల్లో తెల్లటి పిండి, తెల్లటి బియ్యం, తెల్లటి రవ్వ, మైదా, బొంబాయి రవ్వ, ఉప్పుడు రవ్వ ఇలా పాలిష్ పట్టినవి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అలాగే వీటితో తయారుచేసిన ప్రొడక్ట్స్ ఎక్కువగా తీసుకోవడం వలన శరీరంలోకి పీచుపదార్థాలు సరిగ్గా వెళ్ళకపోవడం వలన మోషన్ సరిగ్గా కాక మలం పేగులలో నిల్వ ఉండి ఇన్ఫెక్షన్ ఏర్పడి గుడ్ బ్యాక్టీరియాని తగ్గించి బ్యాడ్ బ్యాక్టీరియా బాగా పెరిగిపోయి మలప్రేగుకు సంబంధించిన క్యాన్సర్ విపరీతంగా ఎక్కువైపోతుంది. పది పదిహేను సంవత్సరాల నుంచి మనకు కూడా వస్తుంది.

                            మోషన్ కి రెండు రోజులకు ఒకసారి వెళ్ళిన పర్వలేదనే స్థితి మనకి ఏర్పడుతుంది. మల పేగుకు సంబంధించిన క్యాన్సర్ రాకుండా తగ్గించుకోవడానికి ఏమైనా ఉంటాయా అని ఆలోచిస్తే పెద్ద ఉల్లి బాగా ఉపయోగపడుతుంది. ఈ ఉల్లి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇందులో ఉండే కెమికల్ కాంపౌండ్ ఆనియెనిన్ ఏ, ఫైసీటిన్, కోసిటిన్ ఈ మూడు రకాల కెమికల్ కాంపౌండ్స్ ఉల్లిపాయలో ఉండటం వలన ఉల్లిపాయలు వాడటం ద్వారా పేగుల్లో ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గించడానికి ఉల్లిపాయ బాగా పనికొస్తుంది.

                             పేగుల్లో ఇన్ఫ్లమేషన్ ఏర్పడినప్పుడు అందులో ఉండే కణజాలం మొత్తం డామేజ్, అందులో ఉండే డి.ఎన్.ఎ. డ్యామేజ్ అయ్యి క్యాన్సర్ కణాలుగా ఏర్పడతాయి. అలాంటి స్థితి నుంచి తప్పించడానికి పెద్ద ఉల్లిపాయను రోజుకి 50 గ్రాములు చోప్పున వాడితే చాలు. దీనిపైన ఇటలీ వారు 13,333 మంది పై పరిశోధనలు చేశారు. ఇలా పెద్ద ఉల్లిపాయను వీరి మీద ఉపయోగించడం ద్వారా నాలుగైదు నెలల లోపు ఈ మాల ప్రేగులో వచ్చే క్యాన్సర్ అనేది 52- 60% క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. కాబట్టి మీ పెద్ద ఉల్లిపాయలను ఉపయోగించుకోవడం మంచిది.

                           మనకు పెద్దవారు ఏనాటి నుంచో పెద్ద ఉల్లిపాయలు ఉపయోగించడం అలవాటు చేశారు. అలాంటి ఉల్లిపాయని ఇప్పుడు ఈ రోజుల్లో లాభం లేకుండా వండుకునే పద్ధతి మనకు అలవాటు అయింది. బాగా మరిగిన నూనెలో ఉల్లిపాయలను వేయించడం ద్వారా ఆ లాభాలు కోల్పోతాయి. కాబట్టి నూనె కొంచెం వేడి తగ్గిన తర్వాత ఉల్లిపాయలు వేసి వేయించుకోవడం ద్వారా కొంచెం ఫలితం ఉంటుంది. లేకుంటే పచ్చి ఉల్లిపాయలు గాని, పెరుగు చట్నీలు గాని తింటే ఇలాంటి వాటి ద్వారా బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు మోషన్ సరిగ్గా అవ్వలేదు అనుకునేవారికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది అని నిరూపించబడింది…

Leave a Comment

error: Content is protected !!