Onion-Benefits-for-Men-You-Should-Know-facts

పచ్చిఉల్లిపాయ తినే ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన వీడియో..లేదంటే చాలా నష్టపోతారు..

ఉల్లిచేసే మేలు తల్లికూడా చేయదంటారు. ఎందుకంటే వంటలో రుచిని పెంచడమే కాకుండా ఉల్లిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు అలాంటివి. పూర్వంనుండి ఉల్లిపాయను ఆహారంలో ఉపయోగిస్తున్నారు. మన భారతదేశంలో ఉల్లిలేనిదే వంటపూర్తికాదు. అంతేకాకుండా చాలామంది పచ్చి ఉల్లిపాయను తినేస్తారు. మరికొంత మంది బిర్యానీ వాటిలో నంచుకుంటూ తింటారు. అసలు పచ్చి ఉల్లిపాయను అలా తినొచ్చా లేదా అనేది తెలుసుకుందాం. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి

ఉల్లిపాయలు కోసినపుడు కొన్ని ఎంజైములు తో పాటు ఘాటైన సల్ఫర్ గ్యాస్ కూడా వెలువడుతుంది.ఆ గ్యాస్ వలనే మనకి కళ్ళు మండుతాయి. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచే ఉల్లివాడకం ఉందట మనదేశంలో. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్ ఇంకా కొన్ని రాష్ట్రాలలో ఉల్లిని పండిస్తారు. పచ్చి ఉల్లిపాయను ఎటువంటి అనుమానం లేకుండా హాయిగా తినొచ్చు. ఎందుకంటే ఉల్లిపాయను పచ్చిగా తింటే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. పింక్ కలర్లో ఉండే ఉల్లిపాయను తింటే మంచికొవ్వును పెరిగేందుకు సహాయపడుతుంది. ఉల్లిపాయలో అధికమొత్తంలో సల్ఫర్, పొటాషియం, విటమిన్ ఇ‌, విటమిన్ సి, పీచుపదార్థాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. పచ్చిఉల్లిపాయలు తింటే నిద్రలేమి కూడా దూరమవుతుంది. అలాగే కాన్సర్ ను సైతం నిరోధిస్తుంది. కీళ్ళనొప్పులు, గుండె, రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. 

జలుబు దగ్గు గొంతునొప్పి లాంటి ఇన్ఫెక్షన్లకు ఉల్లిరసంలో చెంచా తేనె కలిపి తాగడం వలన త్వరగా తగ్గుతాయి. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, డయెరియాను తగ్గిస్తాయి. ప్రీరాడికల్స్ నివారించే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఎముకలు బలహీనత, జుట్టు సమస్యలు తగ్గించడానికి ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్ యాంటీ ఫంగల్ గుణాలు పనిచేస్తాయి. ఉల్లిరసాన్ని వారానికి రెండుసార్లు తలకు రాస్తే చుండ్రు, జుట్టు రాలే సమస్యలు తగ్గిపోతాయి. మధుమేహం ఉన్నవారిలో ఇందులో ఉండే సల్పర్ ఇన్సులిన్ పెంచితే క్రోమియం చక్కెర స్థాయి అదుపు చేస్తుంది.జ్ఞాపకశక్తి ని పెంచడానికి, గుండె సంబంధ వ్యాధులు రాకుండా చేయడానికి సహాయపడుతుంది. 

రక్తం పరహలచగా ఉండేటట్లు చేసి కణాల కదలికను సులభం చేస్తోంది. గుండె జబ్బులు, రక్తపోటు ఉండదు.మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారికి పెరుగులో ఉల్లిపాయను ముక్కలుగా చేసుకొని తినాలి.ఇలా చేయడంవలన మూత్రపిండాల్లో రాళ్ళు బయటకు వెళ్ళిపోతాయి. మూత్రంలో ఇన్ఫెక్షన్లు ఉన్నవారు నీటిలో ఉల్లిముక్కలు వేసి మరిగించి ఆ నీటిని తాగాలి. ఆరెడు గ్రాములకు మించి తాగకూడదు. స్త్రీ లలో ఇన్ఫెర్టిలిటీ, పురుషులలో శృంగార సమస్యలు తగ్గడానికే సహాయపడుతుంది. అలాగే వీర్యవృద్దికి దోహదపడుతుంది. ఉల్లిరసంలో అల్లంరసం కలిపి తాగడంవలన సంతానసమస్యలు దూరమవుతాయి. ఉల్లిరసంలో ఆలివ్ ఆయిల్ కలిపి రాస్తే మొటిమలు తగ్గుతాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఉల్లిపాయను తల్లితో పోల్చడంలో తప్పులేదుకదా.

1 thought on “పచ్చిఉల్లిపాయ తినే ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన వీడియో..లేదంటే చాలా నష్టపోతారు..”

Leave a Comment

error: Content is protected !!