హలో ఫ్రెండ్స్.. ఉల్లిగడ్డ కోసేటప్పుడు కంట నీరు పెట్టిస్తుంది కానీ “ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు” అనే సామెత వినే ఉంటాము. ఆరోగ్యానికి ఉల్లిగడ్డ ఎంత మంచిదో చెప్పకనే చెబుతుంది ఈ సామెత. ఉల్లిగడ్డ కు కోసినప్పుడు చాలా మందికి కళ్ళనుండి కన్నీరు వస్తుంది. అసలు కన్నీళ్లు ఎందుకు వస్తాయి తెలుసా? ఇవి కోసినపుడు వాటిలో ఉండే ఎంజైమ్స్ విడుదలవుతాయి వాటితో పాటుగా ఘాటైన సల్ఫర్ గ్యాస్ కూడా బయటకు వస్తుంది ఈ గ్యాస్ మన కళ్ళకు చిరాకు కలిగించి కన్నీరు పెట్టిస్తుంది. ఉల్లిపాయ తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఉల్లిపాయలు రోజు ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకోవడం వలన నమ్మలేని ఫలితాలను పొందవచ్చు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయలు కూర లో కలపడం వలన కూరకు అదనపు రుచి వస్తుంది. అలాగే పచ్చివి తిన్నా ఆరోగ్యానికి మంచిదే. ఇది మన జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగే ఉల్లిపాయను తినడం వలన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ నిల్వ ఉండటంతో తోడ్పడుతుంది. ఉల్లిపాయలో సల్ఫర్ పోటాషియం విటమిన్ బి విటమిన్ సి పీచు పదార్థాలు అధికంగా మోతాదులో ఉంటాయి. నిద్రలేమితో బాధపడేవారు ఉల్లిపాయ తీసుకోవడం ద్వారా చక్కగా నిద్ర పోవచ్చు. క్యాన్సర్ను నిరోధించే గుణాలు కూడా ఉల్లిపాయలో ఉన్నాయి.
ఉల్లిపాయ చర్మసౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి కూడా సహాయపడతాయి. ఆలివ్ ఆయిల్ ఉల్లి రసాన్ని సమపాళ్లలో కలపాలి అంటే ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి రసాన్ని సమానంగా కలుపుకొని ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించడం ద్వారా మొటిమలు మచ్చలు పూర్తిగా తొలగిపోతాయి. మొటిమలను తగ్గించడంలోనూ ఉల్లిపాయ ఎంతగానో తోడ్పడుతుంది.
ఈ రోజుల్లో చాలా మంది క్యాల్షియం లోపంతో బాధపడుతున్నారు. ఉల్లిపాయ రోజు ఆహారంలో తీసుకోవడం ద్వారా ఎముకల బలహీనత అధిగమించవచ్చు. డయాబెటిస్తో బాధపడేవారు రోజు ఒక పచ్చి ఉల్లిపాయ తినడం ద్వారా వాళ్ళ శరీరంలో ఉండే ఇన్సులిన్ ఉత్పత్తి అభివృద్ధి చెందుతుంది. అందులోని క్రోమియం కారణంగా రక్తంలో చక్కెర నిల్వలు నియంత్రణలో ఉంటాయి.
జ్ఞాపక శక్తిని పెంచడానికి గుండె జబ్బులను దూరం చేయడానికి ఉల్లిపాయ ఎంతగానో సహాయపడుతుంది. ఉల్లిపాయ మన శరీరంలో ఉండే ఇన్ఫెక్షన్లను అరికడుతుంది. కిడ్నీ సమస్యలకు కిడ్నీ లో ఉండే రాళ్ల సమస్యకు ఉల్లిపాయ ఔషధంలా పనిచేస్తుంది. ఉల్లిపాయలు సన్నగా తరిగి పెరుగులో కలిపి రోజు ఉదయం వేళలో ఆహారంలో తీసుకుంటే కిడ్నీలో ఏర్పడిన రాళ్ళు కరిగిపోతాయి.
మగవాళ్ళు ఉల్లిపాయ రసాన్ని తేనెలో కలిపి తీసుకుంటే వీర్యకణాల సంఖ్య పెరుగుతుంది. ఉల్లి రసం తేనె కలిపి తీసుకుంటే జ్వరం జలుబు దగ్గు గొంతు నొప్పి తొందరగా తగ్గిపోతుంది. ఉల్లిపాయలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ గుణాలు అధికంగా ఉంటాయి. కావున జుట్టుకు సంబంధించిన సమస్యలు దూరం చేయడానికి ఉల్లిపాయ ఎంతగానో సహాయపడుతుంది. ఉల్లిపాయ రసాన్ని తలకు పట్టించడం ద్వారా జుట్టు రాలడం తో పాటు చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. అలాగే జుట్టుకు మంచి షైనింగ్ కూడా ఇస్తుంది.
ఉల్లిపాయ తలలో రక్తప్రసరణను పెంచుతుంది దీనివల్ల మన తలలో రాలిపోయిన జుట్టు కూడా మళ్ళీ తిరిగి పెరగడానికి సహాయం చేస్తుంది. తెలుసుకున్నారుగా ఉల్లిపాయతో ఎన్ని లాభాలు ఉన్నాయో మీరు కూడా రోజు ఉల్లిపాయని ఆహారంగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఎన్నో అనారోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు ఇలాంటి ఆరోగ్యకరమైన విషయాలను తెలుసుకోవడానికి మా పేజీ లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.
గమనిక : ఈ వెబ్ సైట్ లో పెడుతున్న వివరాలన్నీ పాఠకుల ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా పాఠకుల అవగాహన పెంచడానికి మాత్రమే ..ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు