జుట్టు రాలడం అనేది ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరిలో ఎక్కువగా చూస్తున్న సమస్య. దీనికి ఒక చిన్న చిట్కాతో నెల రోజుల్లోనే జుట్టు ఒత్తుగా, బలంగా పెరగడాన్ని మనం గమనించవచ్చు. దాని కోసం మనం వందలు, వేలు ఖర్చుపెట్టి ఎటువంటి ప్రొడక్ట్స్ కోనవలసిన అవసరం లేదు.ఆయుర్వేద ప్రోడక్ట్స్ కోసం తిరగవలసిన అవసరం లేదు. మన ఇంట్లోనే ఉండే కొన్ని పదార్థాలు ఉపయోగించి తయారు చేసుకోవాలి. దాని కోసం మనం తీసుకోవాల్సినవి కరివేపాకు.
కర్వేపాకు జుట్టు పెరుగుదలకు చాలా బాగా సహాయపడుతుంది. బయట నుంచే కాకుండా ఆహారంగా తీసుకోవడం వలన కూడా జుట్టు పెరుగుదలకు కరివేపాకు చాలా బాగా ఉపయోగపడుతుంది.తరుచు కరివేపాకు ఆహారంలో భాగంగా చేసుకోవాలి. కరివేపాకును కడిగి నీడలో ఆరబెట్టి నూనె లాంటివేమీ లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న కరివేపాకును తీసి పక్కన పెట్టుకోవాలి.
తర్వాత ఒక రెండు స్పూన్ల మెంతులను నూనె లేకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి. మెంతులు బాగా వేగిన తర్వాత ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత కరివేపాకు, మెంతులను మెత్తని పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక పాన్ పెట్టి దాంట్లో 200ml కొబ్బరి నూనె వేసుకోవాలి. కొబ్బరి నూనె ఆర్గానిక్ లేదా గానుగ నూనె అయితే మంచిది.
దీనిలో ఇప్పుడు తయారుచేసి పెట్టుకున్న కరివేపాకు, మెంతులు పొడులను వేసుకోవాలి. ఇది బాగా మరిగి నురగ తగ్గేంత వరకు సిమ్లో ఉంచాలి. తర్వాత ఈ నూనెను మూడు, నాలుగు గంటలు పక్కన వదిలేయాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ నూనెను ఏదైనా గాజు సీసాలో నిల్వ చేసుకోవచ్చు. నూనె మీ జుట్టుకు సరిపోయేంత మొత్తంలో ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
గోరువెచ్చగా చేసుకుని చేయిపెట్టగలగేలా ఉన్నప్పుడు తలకి నెమ్మదిగా మసాజ్ చేస్తూ పట్టించాలి. ఇలా వారానికి కనీసం రెండు మూడుసార్లు పెట్టడం వలన తలలో ఉండే చుండ్రు, దురద వంటి సమస్యలు తగ్గడంతో పాటు జుట్టు బలంగా, దృఢంగా తయారవుతుంది. మృదువైన జుట్టుకు మెంతులు సహాయపడతాయి.ఒత్తుగా, పొడవుగా పెరగడానికి ఈ నూనె చాలా బాగా సహాయపడుతుంది.