ముఖంపై కణాలు ఓపెన్ అవడం వలన దానిలోకి దుమ్ము, ధూళి చేరి వైట్హెడ్స్, బ్లాక్హెడ్స్ సమస్యలు ఏర్పడతాయి. ఇది చూడడానికి ముఖంపై ఇబ్బందిగా మారతాయి. అలాగే ఓపెన్ పోర్స్ సమస్య అధికంగా నూనెలు విడుదల చేయడం, మొటిమలు, నల్లటి మచ్చలు ఏర్పడడానికి కారణం అవుతుంది. దీని నివారణకి అనేక రకాల ప్రొడక్ట్స్ వాడటం వలన లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. ఉన్న సమస్యలతోపాటు కెమికల్స్ వలన చర్మం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది.
అందుకే చర్మాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. దానికి సహజమైన పదార్ధాలతో నివారణ చర్యలు తీసుకోవాలి. లేకపోతే చర్మం సాగిపోవడం వల్ల ముడతలు ఏర్పడి అసలు వయసు కంటే అధిక వయసు వారిలో కనిపిస్తారు.
కేవలం రెండే రెండు పదార్ధాలతో ఈ సమస్యను అధిగమించవచ్చు. దాని కోసం తీసుకోవాల్సిన పదార్థాలు ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక గిన్నెలో కేవలం గుడ్డులోని వైట్ పదార్థాన్ని మాత్రమే తీసుకోవాలి. గుడ్లు పోషకాహార శక్తి కేంద్రాలు మరియు శతాబ్దాలుగా సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగించబడుతున్నాయి.
మీకు పెద్దగా సాగిన చర్మరంద్రాలు లేదా మొటిమల బారిన పడే చర్మం ఉన్నట్లయితే, గుడ్డులోని తెల్లసొన రంధ్రాలను మూసివేయడానికి మరియు నూనె అధిక విడుదలని వదిలించుకోవడానికి సహాయపడుతుంది. మరియు మీ చర్మం జిడ్డుగా ఉంటే, గుడ్డులోని తెల్లసొన సెబమ్‌ను అధికంగా తయారు చేసే రంధ్రాలను మరియు వెంట్రుకల కుదుళ్లను తగ్గిస్తుంది. తర్వాత అందులో ఒక స్పూన్ ముల్తానీమట్టి కలపాలి. ఇది ముఖంపై చర్మాన్ని మచ్చలు, ముడతలు రహితంగా చేయడంతోపాటు చర్మాన్ని యవ్వనంగా, కాంతివంతంగా చేస్తుంది. ఇప్పుడు ఈ రెండు పదార్థాలను బాగా కలిపి ముఖానికి కింది నుంచి పైకి అప్లై చేయాలి.
ఒక అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో మసాజ్ చేస్తూ తీసేయాలి. తర్వాత ఒక ఐస్ క్యూబ్ తో మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మ రంధ్రాలు కుచించుకుంటాయి. ఇలా కనీసం వారానికి రెండు సార్లు చేయడం వలన చర్మంపై ఉన్న ఓపెన్ సమస్యను అధిగమించవచ్చు. అలాగే ఎప్పటికప్పుడు చర్మం పై శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. సీ టీ ఎం అంటే క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ చేయడం వలన చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంటుంది. ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు మేకప్ తీసేయాలి. చర్మాన్ని సిటిఎం చేయడం వలన అధిక నూనె విడుదలవడం, ఓపెన్ పోర్స్ సమస్యలను తగ్గించుకోవచ్చు.