యుక్త వయసు లోకి వచ్చినప్పటినుండి ముఖంపై మొటిమలు రావడం మొదలవుతుంది. కొంతమందికి తమంతట తామే తగ్గిపోతే, కొంతమందికి మాత్రం నల్లటి మచ్చలతో అందవికారంగా తయారవుతుంది. ఇలాంటి వాళ్లకు మొటిమలు తగ్గించడానికి చాలా రకాల ప్రయత్నాలు చేసి ఉంటే ఈ ఒక్కటి కూడా పాటించి చూడండి. మొటిమలు, మచ్చలు తగ్గడంతో పాటు చర్మానికి మరిన్ని ప్రయోజనాలు అందించే ఈ టిప్ చాలా ఈజీగా మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే చేసుకోవచ్చు.
దానికి కావాల్సిన పదార్థాలు కూడా చాలా తక్కువ. జీలకర్ర ఆరోగ్యానికి మంచిదని మనందరికీ తెలిసిందే. ఇది చర్మ సౌందర్యానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. చర్మంపై వచ్చే మొటిమలు, మచ్చలు తగ్గించడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది. స్టవ్పై ఒక గ్లాసు నీళ్ళు పెట్టుకుని అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ నీళ్లు కనీసం మూడుస్పూన్లు నీళ్ళు అయ్యేంత వరకు నెమ్మదిగా మరిగించుకోవాలి. బాగా మరిగి మూడు స్పూన్లు అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
నీళ్లు బాగా చల్లారేంత వరకూ పక్కన పెట్టుకోవాలి. ఇవి బాగా చల్లారిపోయిన తరువాత వడగట్టుకుని ఇందులో ఒక స్పూన్ అలోవెరా జెల్ కలుపుకోవాలి. అలోవెరా జెల్ మొటిమలకు కారణం అయ్యే బ్యాక్టీరియాను చంపడంలో, నల్లటి మచ్చలను తొలగించడంలో చర్మానికి చాలా బాగా సహాయపడుతుంది. ఈ మిశ్రమంలో ఒక చిన్న కాటన్ బాల్ వేసుకొని మొటిమలు వచ్చినప్పటి నుండి ప్రతిరోజు రాత్రి మొటిమలు ఉన్నచోట తుడుస్తూ ఉండాలి. ఇలా రెండు, మూడు రోజులు చేయగానే మొటిమలు మాయం అవడం మీరే గమనిస్తారు.
అక్కడ మొటిమలు ఉండేవంటే నమ్మలేనంతగా మచ్చలను కూడా తగ్గిస్తాయి. అలోవెరా జెల్ చర్మానికి పడనివారు దానికి స్కిప్ చేసుకొని జీలకర్ర నీటిని మాత్రమే ఉపయోగించుకోవచ్చు. ఈ నీటిని నిల్వ చేసుకోవాలి అనుకుంటే మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ ఉపయోగించాలి. ఇంట్లో తయారు చేసుకున్న అలోవెరా జెల్ ఉపయోగించడం వల్ల ఈ మిశ్రమం త్వరగా పాడైపోతుంది. ఈ మిశ్రమాన్ని మూడు రోజుల వరకు ఫ్రిజ్లో స్టోర్ చేసుకోవచ్చు.