packed milk or loose milk which is better

పాకెట్ పాలు, విడిగా దొరికే పాలు ఏవి మంచివి?? అందరూ తప్పక తెలుసుకోవాల్సిన విషయమిది.

ఉదయాన్నే కాఫీ, టీ, పిల్లలకు బూస్ట్ లు బోర్న్ విటా లు ఇలా ఏది తాగలన్నా మనకు పాలు తప్పనిసరి.  పాలు తాగని మనిషి ఉంటారేమో కానీ పాలు లేని ఇల్లు మాత్రం ఉండదు. అయితే గ్రామాలు అంతరిస్తూ పట్టణాల రంగు పూసుకుని డవలప్ అయ్యేకొద్ది పాడి కూడా తగ్గిపోతూ వస్తోంది. గ్రామాల్లోనే నేరుగా పశువులు పెంచుతున్న వాళ్ళు వచ్చి పాలు అమ్మే కాలం పోయి, పాలన్ని సేకరించి అమ్ముతున్న పాల భూత్ లేదా పాల డైరీ దగ్గరకెళ్లి కొనడం చూస్తూనే ఉన్నాం. అయితే పట్టణాలు ఓ మోస్తరు  పట్నపు రంగు అద్దుకున్న పల్లెల్లో అయితే పాకెట్ లు తప్ప విడిగా పాలు దొరకడం చాలా అరుదు అయిపోయింది. ఇంటిదగ్గరకు వచ్చి పోసేవారు ఉన్నా  ఉద్యోగాల పేరుతో ఇంటిపట్టున ఉండి సమయానికి పాలు పోయించుకోలేకపోవడం కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. అయితే ఇపుడు మన సమస్య అంతా పాకెట్ లో లభించే పాలు మంచివా?? విడిగా అమ్మే పాలు మంచివా అనేది. ఒకసారి ఈ మంచి చెడుల కథా కమామీషు చూద్దాం.

పాకెట్ పాలు.

పాకెట్ పాలు కొనే వారిలో ఎంత మంది ఈ పాలను ఎలా తయారుచేస్తారు, ఎలా నిల్వ ఉండేలా చేస్తారు అనేది గమనిస్తారు అని ఆలోచిస్తే అది దాదాపు సున్నా శాతం.  బ్రాండ్ ను బట్టి పాల క్వాలిటీ నమ్మేస్తున్నారు కొనేస్తున్నారు కానీ ఒక పూట లేదా ఒక రోజుకె చెడిపోయే పాలను ఏ బ్రాండ్ అయినా పాకెట్ లలో ఎలా నిల్వ చేస్తున్నారు?? వాడే రసాయనాలు ఏమిటి అనేది ఎవరూ తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. పాకెట్ లో లభించే ప్రతి బ్రాండ్ కూడా పాలను పాశ్చరైజేషన్ పద్దతి ద్వారా పాకెట్ లలో నిల్వచేస్తారు. ఇలా బ్రాండ్ గా వచ్చే ప్రతి సంస్థకు ఆవు మరియు గేదెల పెంపకం ఉంటుంది. ఇది వేల పశుసంపదను కలిగి ఉంటుంది. పాల ఉత్పత్తి కోసం నాణ్యమైన దాణా వేయడం  మాత్రమే చాలా మందికి తెల్సు కానీ హార్మోన్లను ఇంజెక్ట్ చేయడం ద్వారా కూడా పాల ఉత్పత్తిని పెంచే బ్రాండ్ లు ఉన్నాయ్. అయితే ఇలా పాకెట్ లో నిల్వచేసిన పాలను వారం పైన ఎక్సపైర్ డేట్ ఇస్తూ అమ్మడం వాటిని కొని వాడటం వల్ల పాలలో ఉండాల్సిన పోషకాలు అన్ని అందుతాయనే నమ్మకం లేదు.

విడిగా దొరికే పాలు.

గ్రామీణ ప్రాంతాల్లో విడిగా దొరికే పాలు ఎక్కువ. ఇంటి దగ్గరకు వచ్చి పోసి వెళ్లేవారు, అయితే ప్రతి గ్రామంలో సహకార డైరీ లు ఏర్పాటు అయ్యాక పాలను సేకరించి డైరీ లు పాలను అమ్మడం మొదలు పెట్టాయి. అయితే ఇందులో వచ్చిన చిక్కు నీళ్లు కలపడం. కొందరు నీళ్లను కలుపుతుంటారు. దీనివల్ల పాలలో చిక్కదనం తగ్గుతుంది మరియు దాన్ని పెరుగుగా తోడు వేసినప్పుడు పెరుగు కూడా కాస్త పలుచగా అవుతుంది. వీటిలో కొవ్వు శాతం తక్కువ ఉంటుంది. చిక్కని పాలలో కొవ్వు శాతం ఎక్కువ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో పశువులను కేవలం పాల కోసం పెంచడం తక్కువే, వ్యవసాయం కోసం పెంచుతూ పాల దిగుబడిని కూడా ఒక ఆప్షన్ గా పెట్టుకుంటారు. కాబట్టి హార్మోన్ ఇంజెక్ట్ చేయడం అనే ప్రక్రియ చాలా వరకు తక్కువని చెప్పవచ్చు. మన చుట్టూ పక్కల పశువులను పెంచుతూ పాలను అమ్మే వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడి నిస్సందేహంగా పాలను కొనుగోలు చేయవచ్చు.

చివరగా……

పైన చెప్పుకున్న విశ్లేషనను బట్టి చూస్తే పాకెట్ పాలతో వచ్చే డేంజర్ విడి పాలతో ఉండదు. అయితే విడి పాలను కూడా మనకు బాగా తెల్సిన వారి నుండి కొనుగోలు చేయడం ఉత్తమం.  ఏది ఏమైనా ఇప్పట్లో ఏ పద్దతిలో అయినా కల్తీ లేకుండా దొరకడం అనేది అసంభవమే. 

 నీటిలాంటి ద్రావణం ఒక స్పూన్ వేసి అందులో ఒక గ్లాస్ నీళ్లు పోయాగానే తెల్లని పాలు తయారైపోవడం ఈమధ్య వైరల్ అయిన ఈ వీడియో అందరిని భయానికి గురి చేసిన విషయం మర్చిపోగలమా.  తెల్సిన వారి వద్ద తీసుకోవడం లేదా చక్కని బ్రాండ్ ఎంపిక తో కాస్తో కూస్తో జాగ్రత్త చర్య అని మాత్రం చెప్పగలం.

Leave a Comment

error: Content is protected !!