ఈకాలంలో చిన్నవయసులోనే శరీరంలో కాళ్లు, చేతులు నొప్పులు రావడం, జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఎక్కువగా వేధిస్తుంటాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే కొన్ని రోజులకు నడవడం కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంట్లో సాధారణ పనులు చేసుకోవడానికి కూడా ఒకరిపై ఆధారపడ వలసి వస్తుంది.
అందుకే ఈ నొప్పులు ప్రారంభ దశలో ఉన్నప్పుడే తగిన చర్యలు తీసుకోవాలి. ఈ నొప్పులకు సాధారణంగా అధిక బరువు, థైరాయిడ్, బలహీనత, కాల్షియం లోపం, ఎక్కువగా నిలబడటం లేదా ఎక్కువగా ఒకే చోట కూర్చోవడం కారణంగా ఉంటాయి.
అందుకే వీటికి మూలకారణాలను తెలుసుకుని వాటిని తగ్గించుకోవడంతో పాటు ఒక చిట్కా చాలా బాగా ఉపశమనం కలిగిస్తుంది. దానికోసం మనం తీసుకోవాల్సిన పదార్థాలు: జిల్లేడు ఆకులు రెండు, కలబంద కొమ్మ 1, ఆముదం , నువ్వుల నూనె, వేప నూనె, ఆవ నూనె, ఆర్గానిక్ పసుపు తీసుకోవాలి. తర్వాత అలోవెరా కొమ్మకి చుట్టూ ఉండే ముళ్ళను కత్తిరించి లోపల ఉండే గుజ్జు విడిగా తీసుకోవాలి. ఒకసారి నీటితో కడిగి మిక్సీలో మెత్తగా చేసుకోవాలి.
తరువాత కలబంద గుజ్జులో అరచెంచా పసుపు వేసి కలుపుకోవాలి . తీసుకున్న ఆముదం, నువ్వుల నూనె, వేప నూనె, ఆవనూనె ఒక గిన్నెలో వేసుకొని దానిని ఈ కలబంద గుజ్జులో కలుపుకోవాలి. కలబంద మిశ్రమం బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
తర్వాత తీసుకున్న జిల్లేడు ఆకులకు మిగతా నూనె రెండువైపులా రాసుకోవాలి. స్టౌ పై ఒక ఇనుప పెనం పెట్టి దాని మీద ఈ ఆకులను వేడి చేసుకోవాలి. తయారుచేసి పెట్టుకున్న కలబంధ మిశ్రమాన్ని ఎక్కడైతే నొప్పిగా ఉందో అక్కడ రాయాలి.
ఐదు నుండి పది నిమిషాలు మసాజ్ చేయాలి. వేడి వేడిగా ఉన్న ఆకులను మనిషి భరించగలిగిన అంత వేడి తో నొప్పి ఉన్నచోట వేసి ఏదైనా గుడ్డతో కట్టుకట్టాలి. ఇలా చేయడం వలన నొప్పులు చాలా త్వరగా తగ్గిపోతాయి. ఇది పనిచేసినట్టు చాలామంది చెబుతున్నారు. అందుకే నొప్పులు ప్రారంభదశలో ఉన్న వారు ఒకసారి ఈ చిట్కాను పాటించి చూడండి.