పల్లేరు కాయలుముళ్ళతో ఉండే ఈచిన్న కాయలు పల్లెలు సముద్రతీర ప్రాంతాల్లో, ఇసుక నేలల్లో అధికంగా ఉండి కాళ్ళకు గుచ్చుకుని ఇబ్బందిపెడుతుంటాయి. ఈ పల్లేరుకాయలు ఉపయోగాలు తెలిస్తే మాత్రం ఆశ్చర్య పోతారు. ఈ పల్లేరుకాయలను దంచి అశ్వగంధ పాలలో మరిగించి తాగడంవలన అలసట, ఒత్తిడి, డయాబెటిస్, అధికబరువు సమస్యలు తగ్గిస్తుంది. ఈ కాయలను దంచి పొడి చేసి అందులో వావిలాకు పొడి కలిపి తాగడంవలన పురషులలో లైంగిక శక్తి పెరుగుతుంది. స్త్రీలలో బహిష్టు, గర్బాశయ దోషాలు తొలగిపోతాయి.
ఆరోగ్యకరమైన సంతానం పుడుతుంది. ఈ పల్లేరుకాయలు కషాయం రోజూ తాగితే పైత్యంవలన వచ్చే తలనొప్పి తగ్గుతుంది. పల్లేరుపువ్వుల పేస్ట్ చేసుకుని కషాయంలా చేసుకుని తాగితే దగ్గు,క్షయ వంటి వ్యాధులు తగ్గుతాయి. పల్లేరుకాయలు పాలలో తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి. మొక్క వేళ్ళతో సహ దంచి పాలలో నానబెట్టి తర్వాత నీళ్ళు కలిపి వడకట్టి చూర్ణంలో తేనె కలిపి తాగితే ఆయాసం, ఉబ్బసం తగ్గుతాయి.
పల్లేరు కాయలు పొడిచేసి అందులో వావిలాకు పొడి కలిపి రోజుకు రెండు చెంచాలు తీసుకుంటే కాలేయం శుభ్రపడి అనేక రకాల వ్యాధులను తగ్గిస్తుంది. శరీరంలో వేడిని తగ్గించి చలవచేస్తుంది. డయేరియా వలన విరోచనాలు ఉన్నవారికి పెద్దపల్లేరు కాయలు కషాయం చేసి తాగితే విరోచనాలు తగ్గుతాయి.
క్రమంతప్పకుండా తీసుకుంటుంటే హార్మోన్ల ఉత్పత్తి ని పెంచుతాయి. మూత్రంలో నొప్పి, మంట వంటి మూత్ర వ్యాధులను తగ్గిస్తుంది.
గుండెసంబంధ వ్యాధులు రాకుండా చేస్తుంది. కళ్ళకు చలవచేసి కంటివ్యాధుల బారినపడకుండా కాపాడుతుంది. స్ర్తీల కుసుమ రోగాలు తగ్గాలంటే ముఫ్ఫై గ్రాముల పల్లేరు ఆకులు, పదిమిరియాలు దంచి రెండు భాగాలు చేసి రోజులో ఉదయం, సాయంత్రం రెండు పూటలా వేసుకుంటూ తెల్లవెల్లుల్లి రెబ్బలు రెండు సేవిస్తే కుసుమ రోగాలు తగ్గిపోతాయి. యాంటీ బాక్టీరియల్, యాంటి ఇన్ప్లమేటరీ గుణాల వలన నొప్పులు, వాపులు తగ్గుతాయి.
ఒళ్ళు మంటలు తగ్గించి సెగ వ్యాధులు రాకుండా చేస్తుంది. రక్తంలో చెడుకొలెస్ర్టాల్ కరిగించి అధికబరువు సమస్య లేకుండా చేస్తుంది. చిగుళ్ల సమస్యలు, పళ్ళ సున్నితత్వాన్ని తగ్గించి పంటి సమస్యలు రాకుండా చేస్తుంది. శ్వాస సంబంధ వ్యాధులైన జలుబు, దగ్గు రాకుండా చేస్తుంది. శరీరంలో వాత,పిత్త, కఫ దోషాలను తొలగించి ఆరోగ్యం గా ఉండేలా చేస్తుంది. రక్తశుద్ధి చేస్తాయి. రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ కరిగించి అధికబరువు సమస్య తగ్గిస్తుంది.
మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి