palm jaggery health benefits

తాటిబెల్లం గూర్చి మీకెంత తెలుసో ఒకసారి ఇది చదివి క్లియర్ చేసుకోండి

పండుగలు, ప్రత్యేకదినాల్లో ప్రతి ఇంట్లో తీపి తప్పనిసరి. ఫాషన్ వంటలను మినహాయిస్తే సాంప్రదాయకరమైన తీపి వంటకాల్లో  బెల్లం తప్పనిసరిగా వాడతారు. అయితే ఆయుర్వేదలో పాత బెల్లం లేదా తాటి బెల్లం కు ఎంతో ప్రత్యేకమైన స్థానముంది. అసలు ఈ తాటిబెల్లం ఏమిటి అని సందేహం అందరికి వస్తుంది. అందుకే తాటిబెల్లం గూర్చి దాని అద్భుతమైన ప్రయోజనాలు గూర్చి మీకోసం ఈ వ్యాసం.

తాటిచెట్టు కాండం భాగంలో ఊరే నీటిని నీరా అనంతరం ఇది తియ్యగా ఉంటుంది. చాలా చోట్ల తాటిచెట్లకు కుండలు కట్టి ఉండటం మనం గమనిస్తుంటాం. ఈ నీరా ను  సేకరించేందుకు చేసిన ఏర్పాటు అది. ఇది తాజాగా ఉన్నపుడు తియ్యగా చక్కని పరిమళాన్ని కలిగి ఉంటుంది. దీన్ని పులియబెడితే స్వచ్ఛమైన తాటి కల్లు తయారవుతుంది. ఇలా పులియబెట్టకుండా  తాటిచెట్టు నుండి వచ్చిన ద్రవాన్ని బాగా వేడి చేసి తాటిబెల్లాన్ని తయారు చేస్తారు. ఇదే స్వచ్ఛమైన తాటిబెల్లం. ఇది బోలెడు ఆరోగ్యాన్ని ఇస్తుంది మరి ఆ ఆరోగ్య ప్రయోజనాలు చూసేద్దాం రండి.

◆ప్రస్తుత కాలంలో ఎంతోమందిని వేధిస్తున్న సమస్య మైగ్రేన్. దీనికి స్పష్టమైన మందు అంటూ లేదు. చిట్కాలు ఫాలో అవ్వడం తప్ప. అయితే ప్రతిరోజు ఉదయాన్నే ఒక స్పూన్ తాటిబెల్లాన్ని నీళ్ళలో కలుపుకుని తాగడం వల్ల ఈ మైగ్రేన్ సమస్య క్రమంగా తగ్గుతుందని ఆయుర్వేద పండితుల అభిప్రాయం. 

◆తాటి బెల్లంలో పొటాషియం అధికంగా ఉంటుంది. మన శరీరంలో ఉన్న కొవ్వు కరిగించడంలో మరియు బరువు తగ్గించడంలో ఈ పొటాషియం చాలా బాగా పని చేస్తుంది.

◆రక్తహీనత లోపం తో బాధపడుతున్న వాళ్ళు నేటి కాలంలో బోలెడు. ముఖ్యంగా పది మందిలో 7 లేక 8 మంది మహిళలు  రక్తహీనతతో బాధపడుతున్నారు. అయితే తాటిబెల్లంలో ఉన్న ఐరన్ హిమోగ్లోబిన్ పెరగడంలో అద్భుతంగా తోడ్పడుతుంది. అనిమియాకు చక్కని ఔషధం ఇది. అలాగే శరీరంలో రక్తాన్ని శుద్ధి చేస్తుంది మరియు రక్తనాళాల కణజాలాన్ని  ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.

◆ఒకప్పుడు భోజనం చేయగానే చాలా మంది చిన్న తాటి బెల్లం  ముక్కను నోట్లో వేసుకునేవారు. దీనివల్ల  తిన్న ఆహారం ఎలాంటి సమస్య లేకుండా జీర్ణమవుతుందని చెప్పేవారు. ప్రస్తుతం వేళకాని వేళలో భోజనం చేయడం వల్ల ఈ అజీర్తి విజృంభిస్తోంది. అందుకే బోజనం చేసిన తరువాత చిన్న తాటిబెల్లం ముక్క తింటే సమస్య పరిష్కారమవుతుంది.

◆కాఫీ ఎక్కువగా తాగే చాలామందిలో ఉండే సమస్య జీర్ణాశయం పనితీరు నెమ్మదించడం. ఈ సమస్యకు తాటిబెల్లం చెక్ పెడుతుంది. జీర్ణాశయాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.

◆చక్కెర బదులుగా తాటిబెల్లం తీసుకునేవారిలో బిపి, షుగర్,  ఆస్తమా, జీర్ణాశయ సంబంధ సమస్యలు దరిచేరవు.  శ్వాశకోశనాళం, మరియు పేగులలో చేరిన విషపదార్థాలను తొలగించడంతో తాటిబెల్లం గొప్పగా పని చేస్తుంది. 

చివరగా…….

తాటిబెల్లం ధర దృష్ట్యా చెక్కర కంటే మూడింతల ధర కలిగిన  చక్కెర వల్ల కలిగే అనర్థాలను దూరంగా ఉంచి ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. కాబట్టి మొదట ధరను చూసి వెనకడుగేసి తరువాత హాస్పిటల్స్ లో వేలు పోయడం కంటే మొదట దీన్ని వాడటం మొదలెడితే జీవితం ఆనందదాయకమే కదా!!

3 thoughts on “తాటిబెల్లం గూర్చి మీకెంత తెలుసో ఒకసారి ఇది చదివి క్లియర్ చేసుకోండి”

  1. స్వచ్ఛమైన తాటి బెల్లం ఎక్కడ దొరుకుతుందో తెలియజేయగలరు.

    Reply

Leave a Comment

error: Content is protected !!