సాదారణంగా గ్రామీణ ప్రాంతాల్లో తాటిచెట్లు విరివిగా పెరుగుతూ ఉంటాయి. తాటి కాయలు, అందులోని తాటి ముంజలు గురించి మనకు తెలిసినదే, వాటిలో ఎన్ని పోషకాలు శరీరానికి అద్భుత పలితాన్ని ఇస్తాయి. అయితే తాటి చెట్టు నుండి లభించే మరొక అద్భుత ఔషధ మూలం తాటి కల్లు. చాలామంది కల్లు అనే మాట వినగానే దాన్ని మద్యపానం ఖాతాలో వేసి గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు తాగే చవక పానీయం అనుకుంటారు. కానీ ఇందులో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, విటమిన్ సి, అమైనో ఆమ్లాలు, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, విటమిన్ బి వంటి పోషకాలు ఉన్నాయి. ఈ తాటి కల్లు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది అదేమిటో మీరే చూడండి.
కంటి దృష్టిని మెరుగుపరుస్తుంది
తాటి కల్లు తాగే చాలా మందికి తెలుసు కంటి ఆరోగ్యానికి మంచి చేస్తుందని. ఇందులో విటమిన్ సి మరియు బి వంటి విటమిన్లు ఉండటం వల్ల కంటి రక్త నాళాలను కంటిశుక్లం, మాక్యులార్ డీజెనరేషన్ వంటి కంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది, విటమిన్ బి 1 మరియు బి 12 రెటీనాకు సంబంధించిన వాస్కులర్ సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాయి. ఇందులోని పొటాషియం కంటిని ఆరోగ్యంగా మరియు తేమగా ఉంచడంలో సహాయపడుతుంది, ఎందుకంటే దాని లోపం వల్ల కళ్లు పొడిబారడం, కంటి మెలికలు లేదా కంటి కండరాల బలహీనతకు కారణమవుతుంది.
శరీర నిర్మాణానికి దోహాధం చేస్తుంది
ప్రోటీన్ అనేది శరీరానికి అవసరమైన పోషకం, తాటి కల్లులో చాలా అమైనో ఆమ్లాలు ఉన్నాయి, అందువల్ల, ఇది శరీర కణాలను నిర్మించడంలో మరియు మెరుగుపరచడంలో సహాయపడుతుంది, శరీర అవయవాల పనితీరుకు కీలకమైన పోషకాలను శరీరంలో నిల్వ చేయడానికి సహాయపడుతుంది. కణజాలం, ఎముకలు మరియు కండరాల నిర్మాణాల మరమ్మత్తులో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది.
జుట్టు మరియు చర్మాన్ని మెరుగుపరుస్తుంది
ఇది ఊహించిన దానికంటే ఎక్కువ ప్రయోజనాలు చేకూరుస్తుంది, విటమిన్లు, జింక్, మెగ్నీషియం మొదలైనవి చర్మం, జుట్టు మరియు గోర్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. శరీరంలోని చనిపోయిన కణాలను తొలగించి, దాని స్థానంలో కొత్త శరీర కణాల ప్రోత్సాహానికి సహాయపడుతుంది, తద్వారా చర్మానికి మృదువైన మరియు మంచి రూపాన్ని ఇస్తుంది.
చర్మ సమస్యలకు చక్కని ఔషధం
చాలాచోట్ల, ముఖ్యంగా చిన్న పిల్లలలో, దద్దుర్లు, తామర మొదలైన చర్మ వ్యాధులు వచ్చినపుడు చికిత్సలో తాటి కల్లు ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఇది శరీరంలో వేడిని తగ్గించి చలువ చేస్తుంది, దీనివల్ల జ్వరంతో కూడిన సమస్యలలో, అమ్మవారు లాంటి చర్మ వ్యాధులలో చక్కని ఔషధంగా పనిచేస్తుంది.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
దీనిలో ఉండే పొటాషియం కంటెంట్ హృదయ సంబంధ వ్యాధులను ఎదుర్కోవడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఇది నరాలు మరియు కండరాలు బాగా పనిచేయడానికి సహాయపడుతుంది మరియు గుండె కొట్టుకునే రేటును సాధారణీకరించడంలో సహాయపడుతుంది, రక్తపోటును తగ్గించడానికి దోహదం చేస్తుంది.
క్యాన్సర్‌తో పోరాడుతుంది
యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో కూడిన ఆహారం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది, ఎందుకంటే ఇవి శరీరంలో ఆక్సీకరణ ప్రక్రియలను నివారించడంలో సహాయపడతాయి, తాటి కల్లులో యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి, ఇవి ఫ్రీ రాడికల్స్ శరీరంలోని కణాలకు హాని కలిగించకుండా నిరోధించడానికి మరియు క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడతాయి. ఇటువంటి యాంటీఆక్సిడెంట్లకు ఉదాహరణ విటమిన్ బి 2 (రిబోఫ్లేవిన్).
చివరగా……
తాటి కల్లు గ్రామీణ ప్రాంతాల్లో దొరికే అద్భుత ఔషధం మిరేమైన అటువైపు వెళితే ఒకసారి రుచిచూడండి, ఆరోగ్యాన్ని మీ వెంట తెచ్చేసుకోండి.