pandamic vaccination latest news

మొదటి డోస్ కోవీషీల్డ్ వేసుకున్నవారు సెకండ్ డోస్ కోవాక్సిన్ వేసుకోవచ్చా.

కరోనా రెండు సంవత్సరాలు కాలంగా మన జీవితాల్ని అతలాకుతలం చేసేసింది. విపరీతంగా పెరిగిపోయిన కరోనా కేసులు, మరణాలు మనల్ని భయభ్రాంతులకు గురి చేశాయి. ఇలాంటి సమయంలో వ్యాక్సిన్ వచ్చి కొంత ఊరటనిచ్చింది. ఈ మధ్యకాలంలో కేసులు మళ్ళీ జనాలకు బయటికి వెళ్లేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. అలాగని విచ్చలవిడిగా తిరిగితే మళ్లీ కరోనా కేసులు పెరగడం ఖాయం. నిన్న మొన్నటి వరకు చాలా మంది వ్యాక్సిన్ అంటే భయపడి దానిపై చాలా అపోహలతో వ్యాక్సిన్ వేయించుకోవడానికి కూడా వెనుకంజ వేశారు.

 కానీ చాలామంది వాక్సిన్ వేసుకొని క్షేమంగా ఉండడంతో ఇప్పుడు అందరూ వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇలాంటి సమయంలో కొంతమందికి అనుమానం మొదటి డోస్ వ్యాక్సిన్గా కోవ్యాక్సిన్ వేయించుకొని తర్వాత డోస్ కోవీషీల్డ్ వేసుకోవచ్చా అని అడుగుతున్నారు. రెండో డోస్ కోసం వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడమే దీనికి కారణం లేదా పొరపాటున ఫస్ట్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ వేయించుకుని తర్వాత కోవాక్సిన్ వేసుకుంటే ఏమైనా అవుతుందా అనే అనుమానం కూడా  ఉంది. 

అయితే దీని వలన ఏమీ అవకపోయినా అలా సెకండ్ వ్యాక్సిన్ పొరపాటున వేయించుకున్నప్పుడు దానిని మొదటి డోస్గా భావించి మళ్లీ అదే వ్యాక్సిన్ సెకండ్ డోస్ వేసుకోవాల్సిందే. కొంతమందికి కరోనా వచ్చి తగ్గిన వారు వ్యాక్సిన్ వేయించుకోవచ్చా అని అడుగుతున్నారు. అలాంటి వారు రెండు, మూడు నెలల వరకు చేయించుకోవాల్సిన అవసరం లేదు. వారిలో ఇప్పటికే తయారైన యాంటీబాడీస్ డబ్ల్యూహెచ్ఓ ఆదేశం ప్రకారం ఆరు నెలల వరకు వీరు వ్యాక్సిన్ వేసుకోవలసిన అవసరం లేదు. 

వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత కరోనా రాదు అని చాలామంది అపోహ పడుతున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత 60-70% వరకు కరోనా రాకుండా అడ్డుకుందని నిరూపితమైంది. వాక్సిన్ వేయించుకున్న వారిలో ఆ తరువాత కూడా కరోనా నిబంధనలను పాటించి తీరాలి. కరోనా వచ్చిన తర్వాత వాక్సిన్ వలన ప్రమాద తీవ్రత తగ్గుతుంది. సామాజిక దూరం, శానిటైజేషన్తో పాటు వాక్సిన్ కూడా మనల్ని కరోనాకి దూరంగా ఉంచుతుంది.

Leave a Comment

error: Content is protected !!