థైరాయిడ్ పీసీఓడీ కి తీసుకోవాల్సిన డైట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయాన్నే డీటాక్సీఫికేషన్ డ్రింక్ తీసుకోవాలి. దీనికోసం జీలకర్ర, సోంపు, ధనియాలను మరిగించిన నీటిలో తేనె కలిపి తాగొచ్చు. తర్వాత ఏవైనా రెండు రకాల కూరగాయలను స్మూతీలా చేసుకుని వడకట్టకుండా అందులో స్పూన్ నిమ్మరసం కలిపి తాగొచ్చు. తియ్యగా ఉండాలి లేదు నుకుంటే ఒక కారెట్,బీట్రూట్, ఒక పూర్తి యాపిల్ తీసుకుని స్మూతీలా తాగవచ్చు.
అప్పటికి ఆకలి వేస్తుంటే పండ్లు ఏవైనా సీజనల్ ఫ్రూట్ ఒకటి తినొచ్చు. ఆపిల్ ,జామ, మామిడి లాంటివి ఏవైనా బరువు పెరగని వాటినే తినాలి. అలా కాకుండా బ్రేక్ఫాస్ట్ తినాలి అనుకుంటే పెసర అట్లు, రాగిజావ మజ్జిగ తో తీసుకోవాలి. లేదా మజ్జిగను కొత్తిమీర, అల్లం, నిమ్మరసం వేసి తీసుకోవచ్చు.
మధ్యాహ్నం లంచ్ కోసం 1:1రేషియోలో పెసరపప్పు, బియ్యం కలిపి కావాలంటే కూరగాయలతో కిచిడీ చేసుకోవాలి. ఇక సాయంత్రం స్నాక్స్ ఏవైనా తీసుకోవచ్చు. దానికోసం మొలకెత్తిన పెసలు, బొబ్బర్లు, శనగలు తీసుకోవాలి. లేదా పండ్లు ఏవైనా తినవచ్చు.
ఇక రాత్రి డిన్నర్ 7గంటలలోపు చేసేయాలి. రాత్రి భోజనంలోకి శనగపిండి అట్లు రెండు, లేదా రెండు చపాతీ కూరకోసం కూరగాయల, పన్నీర్ లేదా సోయాచంక్స్ వంటివి ఉపయోగించొచ్చు. వీటివలన ప్రొటీన్ పుష్కలంగా లభిస్తుంది. వీటన్నింటితో పాటు ముప్పై నుండి నలభై ఐదు నిమిషాలు వ్యాయామం చేయాలి. శరీరానికి చెమట పట్టాలి.
వీలైనంత మసాలా, కారాలు జంక్ఫుడ్ వంటివి దూరం పెట్టాలి. ఆయిల్లోని వేయించినవి, ఫ్రైలు దూరంగా ఉంచి శరీరానికి కావలసిన నీటిని కూడా తాగాలి. వీటివలన థైరాయిడ్ ,పీసీఓడీ, డెలివరీ తర్వాత పెరిగిన బరువు తగ్గడంతో పాటు మనం తీసుకునే మంచి ఆహారం చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
జుట్టు సమస్యలు తొలగి ఆరోగ్యం గా ఉండే జుట్టు మీ సొంతమవుతుంది. ఈ ఛాలెంజ్ నెలరోజుల పాటు తీసుకుని ఫలితాలు మీరే చూడండి. ప్రకృతి ఇచ్చిన వనరులతో ప్రయత్నిస్తే విజయం తప్పక సాధిస్తారు. మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ లేదా మందులు వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్ నుండి రక్షించుకోవచ్చు.