పిసిఒడి, పిసిఓఎస్ అనేవి ఈ మధ్యకాలంలో స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్యలు. సంతానం కలగకపోవడానికి, అధిక బరువుకు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్కు కారణమవుతున్నాయి. వీటిని మనం ఎన్ని మందులు వాడినా సరైన జీవనశైలి మార్పులు లేకపోతే ఎప్పటికీ తగ్గించుకోలేం.
మనం నిర్లక్ష్యం చేసే కొద్దీ ఇది జీవితకాల సమస్యగా, ఇతర అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. అందుకే పీసీఓస్, పిసిఓడి వచ్చిన వెంటనే సరైన జీవన శైలి మార్పులకు మారాలి. మొదట ఇప్పుడు చెప్పబోయే రెండు కషాయాలను తాగడంతోపాటు, వ్యాయామం, ఆహారంలో తినకూడని, తినవలసిన ఆహారాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.
కషాయాల కోసం మన ఇంట్లో ఉండే మూడు పదార్థాలను ఉపయోగించబోతున్నాం. అవి పావు లీటర్ అంటే 250గ్రాముల నీళ్లు తీసుకోవాలి. వీటిని గిన్నెలో పోసుకొని అందులో ఒక స్పూన్ సోంపు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు తీసుకోవాలి. ఇవన్నీ బాగా మరిగేంతవరకు ఉంచి నీళ్లు 200 గ్రాములు అవ్వాలి.
అప్పుడు స్టౌవ్ ఆపేసి ఈ నీటిని వడకట్టుకోవాలి. ఇందులో అర చెక్క నిమ్మరసం పిండుకోవాలి. అందులోనే ఒక స్పూన్ తేనె కలుపుకోవాలి. ఒక స్పూన్ బెల్లం వేసుకోవాలి.
తర్వాత ఒక కషాయం కోసం ఇంట్లో తయారు చేసుకున్న ఆర్గానిక్ పసుపు తీసుకోవాలి. దీనిని ఒక స్పూన్ గోరువెచ్చని నీటిలో వేసుకుని, అందులో తయారుచేసి పెట్టుకున్న శొంటి పొడి, దాల్చిన చెక్క పొడి కలుపుకోవాలి. దీనిని పది నిమిషాలు సేపు పక్కన పెట్టి తరువాత అరచెక్క నిమ్మరసం కలుపుకోవాలి. ఇందులో కూడా ఒక స్పూన్ బెల్లం కలుపుకోవాలి.
ఈ కషాయాలను ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే పరగడుపున తాగాలి. వేడిగా సిప్ చేస్తూ టీలా తాగాలి. ఇందులో వాడిన పదార్థాలు అన్నీ సహజమైనవి. ఆరోగ్యకరమైనవి. ఆయుర్వేదపరంగా ఎన్నో ఔషధగుణాలు కలిగినవి.
వీటిని క్రమంతప్పకుండా నెలరోజులు తీసుకోవడం వలన అధిక బరువు, పీసీఓడీ, పీసీఓస్ తగ్గడంతో పాటు వాటివలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అధిక బ్లీడింగ్, తక్కువ బ్లీడింగ్ మరియు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ విషయంలో అద్బుతమైన ఫలితాలు చూడవచ్చు.