Permanent Remedy for Upper Lip Unwanted Hair

పై పెదవిపై అవాంచిత రోమాలకు శాశ్వత పరిష్కారం

ముఖం ఎంత అందంగా ఉన్నా  పై పెదవి పై ఉండే అవాంఛిత రోమాలు చూడటానికి ఎబ్బెట్టుగా కనిపిస్తుంటాయి. వీటిని నివారించడానికి  త్రెడ్డింగ్ లేదా వ్యాక్సింగ్ లాంటివి చేస్తూ ఉంటాం. కానీ వీటివల్ల కాలక్రమంలో నల్లటి మచ్చలు ముఖంపై ఏర్పడతాయి. అందుకే దీనికి సహజ పదార్థాలు వాడడం వలన శాశ్వతంగా పై పెదవిపై వెంట్రుకలను నివారించవచ్చు. 

దీని కోసం మనం తీసుకోవాల్సిన పదార్థాలు. 

మొదటి చిట్కా కోసం పసుపు, పాలు, శెనగపిండి ఒక్కో చెంచా చొప్పున తీసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిపి పై పెదవి పై రాసి ఆరిన తరువాత నలుస్తూ తీసేయాలి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల పై పెదవిపై ఉన్న వెంట్రుకలు రాలిపోయి కొత్తగా రాకుండా ఉంటాయి.

 రెండవ చిట్కా కోసం కార్న్ఫ్లోర్, ఎగ్ వైట్, షుగర్ ఇవన్నీ కలిపి అప్పర్ లిప్ మీద అప్లై చేయాలి. ఇది ఆరిన తరువాత పీల్ ఆఫ్ మాస్క్ లా తీసేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వలన పై పెదవిపై ఉన్న వెంట్రుకలు దానితో పాటు వచ్చేస్తాయి. దీనిని కనీసం పదిహేను రోజులకు ఒకసారి చేయడం వలన శాశ్వతంగా వెంట్రుకలను నివారించుకోవచ్చు.

 మూడవ చిట్కా కోసం నిమ్మరసం, పసుపు, పంచదార కలిపి పై పెదవి పై అప్లై చేయాలి. ఇది ఆరిన తరువాత మామూలు నీటితో కడిగేయాలి. ఇది క్రమం తప్పకుండా వాడటం వల్ల కొద్ది రోజుల్లో వెంట్రుకలు వచ్చే సమస్య తగ్గిపోతుంది.

 నాలుగవ చిట్కా కోసం ఒక స్పూన్ పసుపు, నీళ్లు తీసుకోవాలి. ఈ రెండింటి మిశ్రమాన్ని రాయడం వలన పసుపు అవాంఛిత రోమాలను నివారిస్తుంది. పైగా అక్కడ ఏర్పడిన నల్లటి మచ్చలను తగ్గిస్తుంది. 

ఐదవ చిట్కా కోసం నిమ్మరసంలో ఒక స్పూన్ తేనె కలిపి అవాంఛిత రోమాలు ఉన్న చోట అప్లై చేయాలి. 

ఆరవ చిట్కా బంగాళదుంప జ్యూస్ అవాంఛిత రోమాలు ఉన్న చోట అప్లై చేయడం వలన ఇది సహజ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేసి వెంట్రుకలను చర్మంలో కలిసిపోయేలా మారుస్తుంది. ఇది క్రమం తప్పకుండా వాడటం వలన జుట్టు కొత్తగా మంచి వెంట్రుకలు కూడా స్కిన్ కలర్ లోకి మారి బయటకు కనిపించవు. 

ఇక తర్వాత చిట్కా కోసం పెసరపప్పు పేస్ట్, ఒక స్పూన్ పాలు కలిపి వెంట్రుకలు ఉన్న చోట అప్లై చేయాలి. ఇందులో ఏదో ఒక చిట్కాను క్రమం తప్పకుండా వాడటం వలన అవాంచితరోమాలు నుండి ఉపశమనం లభిస్తుంది. ఎటువంటి దుష్ప్రభావాలు లేని మంచి ఫలితాలను చూడవచ్చు.

Leave a Comment

error: Content is protected !!