శరీరంలో కఫం చేరితే శ్వాస సంబంధ సమస్యలు అనేకం మొదలవుతాయి. వీటిని తగ్గించుకోవడానికి అనేక రకాల మందులు ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే చలికాలంలో ఈ సమస్యలు మరీ ఎక్కువగా ఉంటాయి.ముఖ్యంగా ఆస్తమా సమస్యలు ఉన్నవారు, చిన్న పిల్లల్లో కూడా జలుబు, దగ్గు వంటి సమస్యలు మొదలవుతాయి. వీటిని తగ్గించుకోవడానికి ఇప్పుడు చెప్పబోయే పదార్థాలతో చేసిన కషాయం చాలా మంచి ఫలితాలను అందిస్తుంది. కఫాన్ని కరిగించి సమస్యలను తగ్గిస్తుంది. చాతిలో చేరిన నిమ్ము, కఫంని బయటకు పంపించేస్తుంది. దీని కోసం మనం ఒక రెండు చెంచాలు ధనియాలను తీసుకొని కొద్దిగా వేయించుకోవాలి.
ఇలా వేయించుకున్న ధనియాలను దంచుకోవాలి. అందులో పైన చెక్కు తీసి శుభ్రంగా కడిగిన అల్లం ముక్క వేసుకోవాలి. ఈ రెండింటిని బాగా దంచాలి. ఈ రెండింటి నుండి రసాన్ని వడకట్టి ఒక చెంచా తేనే కలిపి స్టవ్పై వేడిచేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఉదయాన్నే తీసుకోవాలి. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నవారు ఉదయం సాయంత్రం తీసుకోవచ్చు. ఇలా ఈ కషాయాన్ని రెండు మూడు రోజుల పాటు తీసుకోవడం వలన శరీరంలో కఫం కరిగిపోయి గ్యాస్, మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. తేనె అనేక రకాల ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. తక్షణ శక్తిని అందిస్తుంది.
ధనియాలు రసం చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది మరియు శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను ప్రోత్సహిస్తుంది. వీటిలో రాగి, జింక్, ఇనుము మరియు ఇతర ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి, ఇవి RBCని పెంచుతాయి మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ధనియాలు గింజలు కూడా జీవక్రియను పెంచడంలో సహాయపడతాయి. అల్లం శ్వాస నాళాన్ని శుభ్రం చేసి కఫాన్ని కరిగిస్తుంది. తాజా అల్లం తినడం లేదా వేడి నీటిలో కొంత అల్లం రసం పానీయంగా జోడించడం వల్ల శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కారణంగా సంభవించే శ్వాస ఆడకపోవడాన్ని తగ్గించవచ్చు. అలాగే అనేక రకాల జీర్ణ సంబంధ వ్యాధులను కూడా తగ్గిస్తుంది శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ తగ్గిపోవడం వలన ఎన్నో రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. వాటినుండి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఇటువంటి సహజ కషాయాలు ఎంతో బాగా పనిచేస్తాయి.