ఈ కాలంలో జుట్టు సమస్యలు అనేక మందిని బాధ పెడుతున్నాయి. నీటి, వాయు, ఆహార పదార్థాల కలుషితం మన ఆరోగ్యాన్ని దెబ్బతీసి మొదట మన జుట్టు, చర్మంపై ప్రభావం చూపుతుంది. మన ఆహారాలలో వచ్చే విపరీతమైన మార్పులు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇవి జుట్టు కణాలను దెబ్బతీసి జుట్టు రాలిపోయి, జుట్టు తెల్లగా మారడానికి, జుట్టు కళావిహీనంగా మారడానికి కారణమవుతుంది. ఈ సమస్య నుండి జుట్టుని కాపాడటానికి మనం అప్పుడప్పుడు కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. జుట్టు సమస్యలను తగ్గించి జుట్టు నల్లగా చేసే ఈ చిట్కా గురించి తెలుసుకుందాం.
మనం ఒక ఐరన్ పాన్ తీసుకొని అందులో ఒక గ్లాసు మంచి నీటిని వేసుకోవాలి. ఇందులో రెండు స్పూన్ల ఉసిరి పొడి వేసుకోవాలి. ఉసిరి పొడిలో ఉండే విటమిన్ సి జుట్టు సమస్యలు లేకుండా చేసి, జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. తెల్లజుట్టు సమస్యను ప్రారంభదశలోనే తగ్గిస్తుంది. తర్వాత రెండు స్పూన్ల హెన్నా పౌడర్ వేసుకోవాలి. జుట్టు మృదువుగా కండిషన్లో ఉండేలా చేస్తుంది. జుట్టు సమస్యలు తగ్గించడానికి కూడా హెన్నా పౌడర్ సహాయపడుతుంది. తర్వాత రెండు స్పూన్ల బృంగ్రాజ్ పౌడర్ వేసుకోవాలి. దీనినే గుంటగలగరాకు అంటారు. దీనిని కూడా వేసి బాగా కలపాలి. జుట్టు దృఢంగా పెరగడానికి సహాయపడుతుంది.
దీనిలో ఒక రెండు స్పూన్ల మందార పొడి కూడా వేయాలి. మందార పొడి జుట్టు సమస్యలకు ఆయుర్వేదంలో మంచి ఔషధ గుణాలు ఉన్న పదార్థాలు వీటన్నిటినీ బాగా కలిపి రాత్రంతా అలాగే వదిలేసి మరుసటి రోజు తలస్నానం చేసిన తలకు అప్లై చేయాలి. అలాగే ఆరిన తర్వాత మంచి హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇది జుట్టును నల్లగా చేసి జుట్టు సమస్యలను తగ్గిస్తుంది. నెలకు రెండు సార్లు లేదా వారానికి ఒకసారి ఉపయోగించడం వలన తెల్ల జుట్టు సమస్య పూర్తిగా నివారించబడుతుంది. కొన్ని వారాల తరువాత పూర్తిగా తెల్లజుట్టు సమస్య తగ్గిపోతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.