Permanent Solution for Knee Pains Reduces Pains Easily

మోకాళ్ళ నొప్పులను శాశ్వతంగా తగ్గించుకోవచ్చు…….

మోకాళ్ళ నొప్పులు పూర్వం రోజుల్లో 60, 70 వయసు పైబడిన వారికి వస్తూ ఉండేవి కానీ ఈరోజుల్లో అలాంటి మోకాళ్ళ నొప్పులు 30, 40 వయసు వారికే వచ్చేస్తున్నాయి. మరి ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి శాశ్వత పరిష్కారంగా ముందుగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ఎందుకు అంటే మనం వంటల్లో వేసుకునే ఉప్పు ప్రధానంగా మోకాళ్ళ నొప్పులు రావడానికి ప్రధాన కారణం. ఎందుకు అంటే కీళ్లు గుల్ల బారడానికి, కీళ్ల మధ్య జిగురు తగ్గిపోవడానికి ఈ ఉప్పు కారణం. మనం తిన్న ఆహారంలోని టేస్ట్ కోసం వేసుకున్న ఉప్పు అంతా లోపలికి వెళ్లి మూత్రం ద్వారా నాలుగు, మూడు గ్రాములు బయటకు వెళుతుంది.

మనం తినేది 10 గ్రాములు నుండి 20 గ్రాములు ఉప్పు తింటాం. ఈ మిగిలిపోయిన ఉప్పంతా శరీరంలో పేరుకుపోయి సోడియం బై కార్బోనేట్ క్రిస్టల్స్ ల మారి మోకాళ్ళలో పేరుకుంటుంది. ఇలా అధికంగా పేర్కొన్న ఉప్పు వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ప్రధానంగా కీళ్ల నొప్పులకు మొదటి శత్రువు ఈ ఉప్పు . ఉప్పు మనితే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఒక మూడు నాలుగు నెలలు ఉప్పును వాడకుండా ఉన్న వంటలను తింటే ఫలితం మీకే తెలుస్తుంది. సాధారణంగా ఉప్పులేని ఆహారం తినడం చాలా కష్టం. కానీ మధ్యాహ్న భోజనం గా ఆకుకూరలను తీసుకుని, ఏదో ఒక కూరగాయలను, రకరకాల ఫ్రైస్ చేసుకోవచ్చు.

వీటిలో మల్టీ గ్రైన్ ఆటతో చేసిన పుల్కాలను చాలా టేస్టీగా ఉంటాయి. సాయంత్రం పూట కొబ్బరి నీళ్లు గాని, పళ్ళ రసాలు గాని, చెరుకు రసం గాని తీసుకోవచ్చు. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి డిన్నర్ ఓన్లీ ఫ్రూట్స్, ఉడికిన ఆహారం అస్సలు వద్దు పండ్లు మాత్రమే నాలుగైదు రకాలు తీసుకోవాలి. ఇలా తినడం వల్ల బరువు కూడా తగ్గుతారు. ఉదయం పూట అల్పాహారంగా రెండు, మూడు రకాల మొలకలను ఆహారంగా తీసుకోవాలి. ఈ మొలకలను ఖర్జూరం, కిస్మిస్ , దానిమ్మ గింజలు, ఆపిల్ ముక్కలతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా ఉదయం సాయంత్రం ఉడికించిన ఆహారం తీసుకోవడం వల్ల ఉప్పు శరీరంలోకి వెళ్లదు.

కాబట్టి మోకాలు నొప్పులు తగ్గే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే బరువు కూడా చాలా తేలిగ్గా తగ్గుతారు. ఇలా ఆహారపు అలవాట్లు పాటించడం వల్ల మోకాళ్ళ నొప్పులు అనేవి నాలుగైదు నెలల్లో తగ్గిపోతుంది

Leave a Comment

error: Content is protected !!