ఎవరు అయితే ఎక్కువగా వంగి కూర్చోడం వంకరటింకరగా కూర్చోవడం ఎక్కువ సమయం కూర్చోవడం వంటివి చేస్తారో వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తుంది. బంగారం పని చేసేవారు, మిషన్ కుట్టే వారు, నీడపట్టున ఎక్కువ సమయం కూర్చుని పనిచేసేవారు ఎక్కువగా బ్యాక్ పెయిన్ తో బాధపడుతూ ఉంటారు. వెన్నుముక పూసకి పూసకి మధ్య డిస్క్లు ఉంటాయి. సమయం వంగి పనిచేయడం వలన ఎదర భాగంలో మాత్రం ఎక్కువ ఒత్తిడి పడుతుంది.
మళ్లీ వెనక్కు వచ్చే పనులు, వ్యాయామం చేయడం వలన సరి అవుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో సమయం లేక మళ్ళీ దాన్ని వెనక్కి తెచ్చుకునే పనులు వ్యాయామం ఎవరు చేయరు. అందువలన జీవనశైలి మొత్తం ముందుకు వంగే కూర్చుంటాము. ఎక్కువగా కూర్చోవడం వల్ల వెన్నుపూస మీద ఎక్కువ ఒత్తిడి పడి వెన్నెముక కండరాలు మొత్తం టైట్ గా పట్టేస్తాయి. కొంతమంది వంకరటింకరగా కూర్చోవడం వలన జారీపడటం వల్ల వెన్నెముకలోని డిస్క్ పలుచగా అయిపోతుంది. కొంతమందికి ఎక్కువ ఒత్తిడి వల్ల ముందుకు వెళ్లడం జరుగుతుంది.
డిస్క్ వెళ్లి నరాల వ్యవస్థ మీద ఒత్తిడి పడటం వలన డిస్క్ పగిలిపోయే లోపల ఉన్న గుజ్జు బయటకు వచ్చేస్తుంది. వెన్నుపాము నొక్కడం వలన వెన్నుపాముకు సంబంధించిన నరాలు వాటికి సంబంధించిన అవయవాలు కాళ్లు చేతులు వంటివి సరిగ్గా పని చేయవు. కొందరికి తుంటిలో ఇబ్బంది, నడుములో ఇబ్బంది వంటి సమస్యలు వస్తుంటాయి. ఈ రకమైన ఇబ్బంది పడుకునే విధానం కూర్చునే విధానం పని చేసే విధానం సరిగా లేదు అని సంకేతాలు ఇస్తోంది. ఇటువంటి సమస్యలు తగ్గించుకోవాలంటే కూర్చునే విధానం లేదా పడుకునే విధానంలో మార్పులు చేసుకోవాలి.
కూర్చుని పనిచేసే వాళ్ళు కుర్చీలో కూర్చొని 90 డిగ్రీస్లో ఉండేలాగా దానికి సరిపోయేలా కంప్యూటర్ను సెట్ చేసి పెట్టుకోవాలి. బండిమీద వెళ్లే వాళ్ళు కూడా స్ట్రైట్గా మిలటరీ వాళ్ళలా కూర్చున్నట్టుగా కూర్చోవాలి. బస్సు, ట్రైన్లో ప్రయాణాల్లో, ఇంట్లో సోఫాలో కూర్చునేటప్పుడు కూడా స్ట్రైట్ గా కూర్చోవాలి. నడుం నొప్పి ఉన్నప్పుడు బరువులు ఎత్తడం, దించడం వంటివి చేయకూడదు. కింద కూర్చోవడం, ముందుకు వంగడం వంటివి కొద్దిరోజులపాటు పూర్తిగా మానేయాలి.
ముందుకు వంగి చేసే వ్యాయామాలు, సూర్యనమస్కారాలు వంటివి చేయకూడదు. పది పదిహేను నిమిషాల మందంగా ఉండే స్పాంజ్ పరుపుల మీద పడుకోకూడదు. ఒకటి రెండు ఇంచుల మందం పరుపుల మీద మాత్రమే పడుకోవాల. ఫ్లాట్ గా పడుకొని మోకాళ్ళ కింద దిండు పెట్టుకొని పడుకోవడం వల్ల నడుము నొప్పి తగ్గుతుంది. 90% సర్జరీ అవసరం లేకుండానే ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వలన నడుము నొప్పి తగ్గుతుంది. రెస్ట్ తీసుకోవడం వలన సమస్య తగ్గుతుంది. ఫిజియోథెరపీ తీసుకోవడం వల్ల, కొన్ని బ్యాక్ బెండింగ్ ఆసనాలు వేయడం వలన ఈ సమస్య తగ్గుతుంది. బ్యాక్ పెయిన్ తో బాధపడేవారు ఇప్పుడు మార్కెట్లో మసాజ్ చేసుకునేవి దొరుకుతున్నాయి. కొంచెం బియ్యపిండి మీద వేసి దానితో మసాజ్ చేయడం వలన రేపు ఉంటుంది. వేడి నీటితో కాపడం పెట్టడం, వేడినీటితో స్నానం చేయడం వంటివి చేయడం వలన ఉపశమనం లభిస్తుంది.