తామరపూలు కొలను అందాలను పెంచుతాయి. తెలుపు, ఎరుపు రంగులలో కనులకువిందు చేస్తుంటాయి. అలాంటి తామరపూలనుండి తీసిన గింజలు మనిషి శరీరానికి అందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా చేకూర్చుతాయి. ఈ తామరగింజలను పచ్చివి లేదా ఎండిన గింజలతో వంటలు చేసి తింటారు. ఫూల్ మఖానాగా సూపర్ మార్కెట్లో దొరికే వీటి వంటలకు ఉత్తర భారతదేశంలో ప్రత్యేకత ఉంది. దేవుడి ప్రసాదానికై వీటితో చేసే కీర్ (పాయసం) రుచితో పాటు అనేక ఆరోగ్య లాభాలను కలిగి ఉంటుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి
ఈ ఫూల్ మఖానాని రోజూ పాలతో తీసుకోవడం ద్వారా అనేక లాభాలను పొందవచ్చు. ఒకగ్లాసు పాలలో నేతిలో వేయించిన గసగసాలు, అరకప్పు ఫూల్ మఖానాని వేసుకుని అవి మెత్తగా అయ్యేంతవరకూ మరిగించి అందులో చక్కెర బదులు పటికబెల్లం దంచి కలుపుకోవాలి. ఈ ఫూల్ మఖనినీ పౌడర్లా చేసుకుని కూడా కలుపుకోవచ్చు. ఈ పాలను రోజూ తాగడంవలన కాల్షియం, మెగ్నీషియం, జింక్ , కాపర్ పుష్కలంగా ఉంటుంది. వెంట్రుకల ఆరోగ్యం కోసం ఈ ఫూల్మఖనీ చాలా బాగా పనిచేస్తుంది.
ఇందులో యాంటీ ఏజెంట్ గుణాలు అధికంగా ఉండి శరీరంలో వృద్దాప్య లక్షణాలు త్వరగా రాకుండా చేస్తుంది. ముఖంపై ముడతలు రాకుండా చేరి ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తాయి. దీనిలో అధికంగా కాల్షియం దొరకడంవలన కీళ్ళనొప్పులు, ఒంటి నొప్పులు నుంచి రక్షించి ఎముకలు బలంగా ఉండేలా చేస్తుంది. కంటిచూపు తగ్గిన వారికి కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ పాలను గోరువెచ్చగా తాగడం మంచిది. రాత్రి సమయంలో తాగితే గసగసాలు వలన మంచినిద్ర పడుతుంది. మంచినిద్ర పట్టడంవలన అనేక మానసిక సమస్యలు తగ్గిపోతాయి.
వర్షాకాలంలో, చలికాలంలో వైరల్ ఫీవర్ల నుండి కాపాడుతుంది. డయాబెటిస్ రోగులు పటికబెల్లం లేకుండా తాగడంవలన చక్కెర స్థాయిలు అదుపులో ఉంచి ఇన్సులిన్ ఉత్పత్తి ని పెంచుతుంది. హై కొలస్ట్రాల్ ఉన్నవారు, గుండె జబ్బులు ఉన్నవారు కూడా ఈ పాలను తాగవచ్చు. రోజూ ఈ పాలను తాగడంవలన కాల్షియం మిగిలిన ఖనిజాలు లభించి నిస్సత్తువ, నీరసం తగ్గి ఉత్సాహంగా ఉంటారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ ఫూల్ మఖనీని పిల్లలు, పెద్దలు కూడా తీసుకోవచ్చు.
super good information