Pichi pachakura ayurvedam

ఈ మొక్క ఎక్కడైనా కనిపిస్తే వెంటనే ఇంటికి తెచ్చుకోండి ఎందుకంటే

హలో ఫ్రెండ్స్ …ఈరోజు మనం తెలిసిపోయే మొక్కను మీరు కొనాలన్నా మీకు ఎక్కడా దొరకదు. పల్లెటూర్లలో పొలాల్లో మాత్రమే దొరుకుతుంది. ఇళ్ల మధ్యలో వందల సంఖ్యలో ఇవి మొలుస్తాయి. వీటిని నాటవలసిన అవసరంలేదు. గాలి ద్వారా విత్తనాలు వ్యాపించి ఎక్కడైనా వందల సంఖ్యలో వస్తాయి. ఇవి మన ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే ఎవ్వరు వదలరు.

మన పూర్వీకులు ఈ మొక్కతో ఎన్నో రకాలుగా కూరవండుకుని తినబట్టే వారు అంత ఆరోగ్యంగా ఉన్నారు. ఈ మొక్కను అందరు చూసిన ఈ ముక్క మనకు ఉపయోగపడుతుందని చాలా మందికి తెలియదు. చాలామంది దీనిని పనికిరాని కలుపుమొక్క గా భావిస్తారు ఈ మొక్క పేరు కోడిజుట్టు ఆకు చిలక తోటకూర పిచ్చి తోటకూర వివిధ ప్రాంతాలను బట్టి వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు. ఈ మొక్క అమరాంథేసి కుటుంబానికి చెందినది. ఈ మొక్కలు మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఎక్కడైనా విరివిగా లభిస్తాయి. ఈ మొక్క యొక్క ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఈ క్రింది వీడియో ద్వారా తెలుసుకోండి.

ఈ మొక్కలో ఫైబర్ కార్బోహైడ్రేట్స్ క్యాల్షియం పాస్పరస్ సోడియం పొటాషియం విటమిన్ రైబోఫ్లేవిన్ థయామిన్ విటమిన్ సి ఇవన్నీ ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఈ మొక్క చలువను కలిగిస్తుంది ఒంట్లో అధిక వేడితో బాధపడేవారు తరచు దీన్ని ఏదోవిధంగా తినడం వల్ల వేడిని బయటకు పంపుతుంది. దీనిని కేరళ ప్రాంతంలో ఆకుకూరగా బాగా తింటారు వీటి ఆకులను మొలలు తగ్గించడానికి ఔషధంగా వాడుతారు. పూర్వం మొలలు ఇబ్బంది పెడుతుంటే వీటి ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి దంచి పేస్టులా చేసి ఇ ఈ మెత్తటి పేస్ట్ ను రాత్రి పడుకునే ముందు మొలల పై అప్లై చేసి ఉదయం కడిగేవారు . ఇలా చేస్తూ ఉంటే మొలల సమస్య పోయేది.

డయేరియా అంటే వాంతులు విరేచనాలు అవుతుంటే ఈ మొక్క మొత్తం భాగాన్ని సేకరించి శుభ్రంగా కడిగి నీటిలో వేసి కషాయంలా కాచి దీన్ని గ్లాస్ మోతాదులో తాగుతూ ఉంటే వాంతులు-విరేచనాలు తగ్గుతాయి. అంతే కాదు మన రక్త శుద్ధి కూడా జరుగుతుంది. రక్తంలో ఉండే మలినాలు కొలెస్ట్రాల్ తగ్గించి రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చూస్తుంది.

మూత్రం పోసేటప్పుడు మంటగా అనిపిస్తే దీని వేళ్లను సేకరించి శుభ్రంగా కడిగి దంచి రసం తీసి రెండు స్పూన్ల మోతాదులో తీసుకుంటే మంట తగ్గుతుంది. వీటి విత్తనాలు కంటిచూపును ఆశ్చర్యపరిచే విధంగా పెంచుతాయి ఈ విత్తనాలు లభించే కాలంలో సేకరించి ఎండబెట్టి ఈ విత్తనాలతో సమభాగంగా బాగా ఎండిన అంజీర పండు మరియు పటిక బెల్లాన్ని కలిపి దంచి పొడిచేసి సీసాలో భద్రపరుచుకుని 15 గ్రాముల పొడిని కప్పు నీటిలో కలుపుకొని రోజుకు రెండు సార్లు రెండు వారాలు తాగితే కంటి చూపు పెరుగుతుంది.

ట్రైబల్ ఏరియా లో లో వీటి ఆకుల పేస్ట్ను విరిగిన ఎముకలు అతికించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ఆకులను కూరగా వండుకొని తినడం వల్ల మలబద్దక సమస్య తగ్గిస్తుంది జీర్ణశక్తిని పెంచుతుంది. మన శరీరంపై ఏమైనా కురుపులు వస్తే ఈ ఆకుల పేస్టు అప్లై చేస్తే సులువుగా తగ్గిపోతాయి. ఇలాంటి మరిన్ని ఆరోగ్య కరమైన విషయాలు తెలుసుకోవడానికి మా పేజీని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.

Leave a Comment

error: Content is protected !!