మలద్వారం లోపల ఉండే రక్తనాళాలు మల విసర్జన చేసినప్పుడు గట్టిగా బిగబట్టడం వలన బయటకు వస్తాయి వీటినే పైల్స్ అంటారు. హెమరాయిడ్స్ లేదా ఫైల్స్ అనేది సర్వసాధారణమైన అనారోగ్య విషయం. దీనికి కారణం ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లు వలన అనేక రకాల అనారోగ్యాల బారిన పడుతున్నారు. అది ఒత్తిడి, బ్యాక్ పెయిన్, తలనొప్పి సాధారణ సమస్యలతో పాటు పైల్స్ కూడా సాధారణ సమస్యగా మారిపోయింది.
ఇది వంశపారంపర్యంగా వస్తున్న వ్యాధి అయినప్పటికీ జీవనశైలిలో మార్పుల వలన ఏర్పడుతుంది. ఒకే చోట ఎక్కువ కూర్చుని పనిచేసే వారికి ఈ సమస్య ఉంటుంది. మానసిక వత్తిడి, మద్యం సేవించడం, నీళ్లు తక్కువగా తాగడం, మాంసాహారం ఎక్కువగా తినడం, జంక్ఫుడ్ ఎక్కువగా తినడం, మలబద్ధకం సమస్య ఉన్నవారిలో కూడా ఫైల్స్ వస్తాయి. గట్టిగా తగ్గి వారిలో కూడా పైల్స్ వ్యాధి ఉండే అవకాశం ఉంటుంది. మలద్వారంలో ఉండే సున్నితమైన రక్తనాళాలలో ఒత్తిడి ఏర్పడటం వలన అవి పిలకల్లా ఏర్పడతాయి. అవి మూత్ర ద్వారంలో అడ్డంగా ఉండి విసర్జన సమయంలో నొప్పిని కలిగిస్తాయి. మొలల వ్యాధి వచ్చినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మల విసర్జన సాఫీగా జరుగదు. నొప్పి, మంట ఉంటాయి. అప్పుడప్పుడు రక్తం పడుతుంది మలవిసర్జన తర్వాత కూడా గంట రెండు గంటల వరకు నొప్పి, మంట ఉంటుంది. మొదటి దశలో విసర్జన సమయంలో బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్లిపోతాయి.
రెండవ దశలో చేసే సమయంలో బయటకు వస్తాయి. వాటిని గట్టిగా గెంతితేనే లోపలికి వెళ్తాయి. మూడో దశలో మొలలు బయట ఉండిపోతాయి. వీటిని భరించడం చాలా కష్టం. వ్యాధి తీవ్రంగా ఉండటం వలన రక్తం ఎక్కువగా పోతుంది. రక్తం పోవడం వల్ల నీరసం, అలసట గా ఉంటుంది.రక్తహీనత వంటి సమస్యలు కూడా వస్తాయి. ఈ వ్యాధి అన్ని వయస్సుల వారికి వచ్చే అవకాశం ఉంటుంది. ముల్లంగి రసం తీసుకోవడం వల్ల పైల్స్ వ్యాధి తగ్గే అవకాశం ఉంటుంది. పావు కప్పు నుంచి స్టార్ట్ చేసి రోజుకు అరకప్పు చొప్పున పెంచుకుంటూ పోవాలి.
దానిమ్మ తొక్కలను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని రోజు కొంచెం కొంచం గా తాగుతూ ఉండాలి దీనివలన కూడా పైల్స్ తగ్గుతాయి. అల్లం తేనె నిమ్మరసం కలిపిన నీటిని ప్రతి రోజు తాగడం వలన పైల్స్ వ్యాధి తగ్గుతుంది. అంజీరను రాత్రి నానబెట్టి ఉదయాన్నే వాటిని తిని ఆ నీటిని త్రాగడం వలన కూడా మలబద్దకం సమస్య, మొలల వ్యాధి కూడా తగ్గుతుంది. ఉల్లిపాయ తినడం లేదా రసం తాగడం వల్ల రక్తం కారడం తగ్గి మొలల వ్యాధి తగ్గుతుంది. టాయిలెట్ సీట్ కూర్చున్న విధానం సరిగా ఉండాలి.
మలబద్ధకం తగ్గడానికి రక్తప్రసరణ బాగా జరగడానికి వ్యాయామం తప్పనిసరిగా అవసరం. వ్యాయామం చేయని బరువులు మోయడం వల్ల కూడా హెమరాయిడ్స్ వస్తుంది కాబట్టి సాధారణ వ్యాయామాలు వాకింగ్ వంటివి చేయడం మంచిది. పసుపు కలిపి తాగడం వల్ల మొలల వ్యాధి తగ్గుతుంది. అరటి పండ్లను ఎక్కువగా తినడం వల్ల కూడా మొలల వ్యాధి తగ్గుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు సోయాబీన్స్ వంటివి తీసుకోవడం వలన మలబద్ధకం సమస్యను తగ్గించుకోవచ్చు.