pimples removal cream

ఈ ఒకటి రాస్తే చాలు మచ్చలు,మొటిమలు మాయం

  బయట ఉన్న  కాలుష్యం  దుమ్ము ధూళి వలన చాలా మందికి మొటిమలు, మచ్చలు ఎక్కువగా వస్తున్నాయి. మొటిమలు ఎక్కువగా ఆయిల్ స్కిన్ ఉన్నవారికి వస్తాయి. ఆయిల్ స్కిన్ ఉన్నవారు విటమిన్ సి ఉన్న ఫేస్ ప్యాక్ లను ఉపయోగించడం వల్ల తగ్గుతుంది.  ఆయిల్ స్కిన్ ఉన్నవారు ఫేస్ వాష్ లను కూడా  విటమిన్ సి ఉన్న వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖం పై ఉండే దుమ్ము, ధూళి, ఇన్ఫెక్షన్స్ వంటి వాటిని విటమిన్ సి  తగ్గించడానికి బాగా సహాయపడుతుంది.

మొటిమలు రావడం కూడా తగ్గుతాయి. ఈ మొటిమలను తగ్గించుకోవడానికి రకరకాల క్రీములు, లోషన్స్ అప్లై చేస్తూ ఉంటాయి. వాటివలన ప్రయోజనం ఉన్నప్పటికీ చాలా స్లో గా ఉంటుంది. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈజీ చిట్కాలతో మొటిమలను చాలా తక్కువ ఖర్చుతో తగ్గించుకోవచ్చు. పార్లర్కి వెళ్తే వేలకు వేలు ఖర్చు అవుతుంది. పైగా ఫలితం కూడా చాలా స్లో గా ఉంటుంది.  మొదటి చిట్కా ఇంట్లో జండూ బామ్ లేదా మెంతో ప్లస్ బామ్ కానీ శాస్త్రీ బామ్ కానీ తీసుకుని ఏదైనా పేస్ వాష్ తో ముఖం కడుక్కుని మొటిమలు  ఉన్న చోట పడుకునే ముందు అప్లై  చేయాలి. 
    ఉదయానికి మొటిమలు తగ్గిపోతాయి. కోల్గేట్ పేస్ట్ ను అప్లై చేయడం వలన  కూడా మొటిమలు  తగ్గుతాయి.  కోల్గేట్ పేస్ట్ తీసుకుని రాత్రి పడుకునే ముందు ముఖానికి అప్లై చేయడం వల్ల రెండు రోజులకు మొటిమలు తగ్గిపోతాయి.  మొటిమల వలన వచ్చే మచ్చలు తగ్గడానికి   స్టవ్ మీద గిన్నె పెట్టుకుని  ఒక గ్లాస్ నీళ్లు  వేసుకోవాలి.  దానిలో ఒక చెంచా జీలకర్ర వేసి గ్లాసు నీళ్ళు అరగ్లాసు అయ్యేవరకు మరిగించుకోవాలి. తర్వాత నీటిని వడగట్టుకొని  ఒక  ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసి  ఫ్రిడ్జ్ లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. 
       వీటిని మొటిమల  మచ్చలపై అప్లై చేసినట్లయితే మొటిమల వలన వచ్చిన మచ్చలు తగ్గిపోతాయి. ఈ నీటిని స్ప్రే  బాటిల్ లో వేసుకుని టోనర్ గా కూడా ఉపయోగించవచ్చు.  రెండు చెంచాలు శనగపిండిలో ఈ నీటిని వేసి కలుపుకొని ఫేస్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు.  ఈ చిట్కాలతో ఈజీగా ఇంట్లోనే ఖర్చులేకుండా మొటిమలు మరియు  మొటిమల వల్ల వచ్చే మచ్చలను కూడా తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాలను వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు ఉపయోగించవచ్చు. ఆడవారు, మగవారు కూడా ఈ చిట్కాలు పనిచేస్తాయి.

Leave a Comment

error: Content is protected !!