పిస్తా ఒక డ్రై ఫ్రూట్ గానే మనకు తెలుసు. కానీ ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటాయి మరియు ప్రోటీన్, ఫైబర్ యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం. పోషకాలను సమృద్ధిగా కలిగి ఉంటాయి మరియు బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. అలాంటి పిస్తా తో ఆరోగ్య ప్రయోజనాలు చూడండి మరి.
పోషకాలను సమృద్ధిగా కలిగి ఉంటుంది.
పిస్తా లో కేలరీలు, పిండి పదార్థాలు, ఫైబర్ ప్రోటీన్, కొవ్వు, పొటాషియం, భాస్వరం, విటమిన్ బి 6, థియామిన్, రాగి, మాంగనీస్, కలిగి ఉంటాయి. ముఖ్యంగా, పిస్తాపప్పులలో విటమిన్ బి 6 అధికంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచడానికి, మరియు హిమోగ్లోబిన్ ఏర్పడటానికి విటమిన్ బి6 ముఖ్యమైనది.
యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి
యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. రోజుకు ఒకటి లేదా రెండు పిస్తా పప్పులను తింటే ఎక్కువ స్థాయిలో లుటిన్ మరియు γ- టోకోఫెరోల్ పొందవచ్చు. లుటిన్ మరియు జియాక్సంతిన్ అధిక మొత్తంలో కలిగివుంటాయి, ఇవి రెండూ కంటి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్లు ఇంకా, పిస్తాపప్పులలోని రెండు విధాలైన యాంటీఆక్సిడెంట్స్, పాలీఫెనాల్స్ మరియు టోకోఫెరోల్స్ – క్యాన్సర్ మరియు గుండె జబ్బుల నుండి రక్షించడానికి సహాయపడతాయి
తక్కువ కేలరీలు ఎక్కువ ప్రోటీన్ కలిగి ఉంటాయి
పిస్తాపప్పులు అతి తక్కువ కేలరీలు కలిగి ఉంటాయి. వీటిలో ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఈ అమైనో ఆమ్లాలు శరీరానికి చాలా అవసరం. ఎందుకంటే శరీరం స్వతహాగా వీటిని తయారు చేసుకోలేదు.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది
పిస్తాపప్పులో ఫైబర్ మరియు ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎక్కువసేపు కడుపు నిండినట్టు అనుభూతి ఇస్తాయి. అందువల్ల ఆహారం ఎక్కువ తినలేము.
ఆరోగ్యకరమైన బాక్టీరియాను ప్రోత్సహిస్తుంది
పిస్తాపప్పులో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఫైబర్ జీర్ణవ్యవస్థ ఆలస్యంగా జరిగేందుకు తోడ్పడుతుంది. అలాగే బ్యాక్టీరియాను ఉత్పత్తి చేయడం ద్వారా జీర్ణక్రియను సులువుగా మారుస్తుంది. ఇది ప్రీబయోటిక్స్ వలె పనిచేస్తుంది.
కొలెస్ట్రాల్ మరియు రక్తపోటును తగ్గిస్తుంది
యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో పాటు, పిస్తా రక్త కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది మరియు రక్తపోటును మెరుగుపరుస్తుంది, తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది
రక్తనాళాల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది
ఎండోథెలియం రక్త నాళాల లోపలి పొర. ఇది సమర్థవంతంగా లేకపోతే హృదయ సంబంధ వ్యాధులు రావడానికి కారణం అవుతుంది. పిస్తాలో ఎల్-అర్జినిన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ గా మార్చబడుతుంది. అందువల్ల, పిస్తా రక్తనాళాల ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడతాయి
మిగతా వాటి కంటే ఎక్కువ కార్బ్ కంటెంట్ ఉన్నప్పటికీ, పిస్తాపప్పులు తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి, రక్తంలో ఎక్కువ చక్కెర కలిగించవు. ఫైబర్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు యాంటీఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్లు మరియు ఫినోలిక్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవన్నీ రక్తంలో చక్కెర నియంత్రణకు ఉపయోగపడతాయి
చివరగా….
పిస్తా పప్పులు తినడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి కాబట్టి తప్పనిసరిగా తినండి.