మనం తినే చాలా ఆహారాలు తెలియకుండానే కలిపి తినేస్తూ ఉంటాం. కానీ వాటి వలన కాలక్రమంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కొన్ని రకాల ఆహారాలు కలిపి తినడం వలన అవి విషపూరితం అయ్యే అవకాశం ఉంది. అలా తినకూడని కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అరటి పండ్లు మనకు ఎక్కువగా దొరికే ఆహారాలలో ఒకటి. అలాగే జామకాయ కూడా ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటుంటారు. కానీ ఈ రెండు కలిపి తినడం వలన గ్యాస్, తల నొప్పి, ఆపాన వాయువు, కడుపు నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇవి అజీర్తి సమస్యలకు కూడా కారణమవుతూ ఉంటాయి.
అలాగే పనస పండు, పాలు కూడా కలిపి తినకూడదు. ఇలా తినడం వలన చర్మ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. బొప్పాయి పండు నిమ్మరసం కలిపి తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్యకు కారణమవుతుంది. ఇది హిమోగ్లోబిన్ శాతాన్ని తగ్గించే అవకాశం ఉంది. అలాగే నిమ్మకాయ, పాలు కలిపి తీసుకోకూడదు. నిమ్మకాయలో ఉండే సిట్రస్, పాలు విరిగి పోయేలా చేస్తుంది. ఇవి రెండూ ఒకే సారి తీసుకోవడం వల్ల కడుపులో ఉండే జీర్ణరసాలతో కలిసి ఎక్కువ యాసిడ్స్ విడుదల చేస్తాయి. దీనివలన ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది.
రాత్రి సమయంలో ఉసిరి పచ్చడి, నిమ్మకాయ పచ్చడి తినకూడదు. రాత్రిపూట శరీరంలో వాతం ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో పచ్చళ్ళు తింటే మెదడులోని సూక్ష్మాతి సూక్ష్మమైన నాడులు పగిలిపోయే అవకాశం ఉంది. దీని వలన పక్షవాతం కూడా రావచ్చు. పుచ్చకాయ, కర్బూజా కలిపి తినకూడదు. ఇవి కలిపి తినడం వల్ల అజీర్తి సమస్యలు వస్తాయి. ఆరెంజ్ మరియు క్యారెట్ కలిపి తినకూడదు. దీనివలన గుండెల్లో మంట కిడ్నీ సమస్యలు వస్తాయి. అలాగే నారింజ మరియు పాలు కలిపి తీసుకోకూడదు. ఇవి రెండు ఒకసారి తీసుకోవడం వలన జీర్ణ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
కొంతమంది చెర్రీస్ ఆరెంజ్ పాలు కలిపి షేక్స్ చేస్తూ ఉంటారు. ఇవి తీసుకోవడం వలన కడుపులో ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది. వెంటనే తెలియకపోయినా కాలక్రమంలో వీటి యొక్క ఫలితాలు బయటపడొచ్చు. పైనాపిల్లో ఉండే బ్రొమిన్ అనే పదార్థం శరీరంలో గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలకు కారణం అవుతుంది. పైనాపిల్, అరటిపండు కూడా కలిపి తీసుకోకూడదు. ఇవి రెండూ త్వరగా జీర్ణం అవ్వక ప్రమాదకరమైన టాక్సిన్స్ విడుదల చేస్తాయి. ఈ సమస్య పిల్లల్లో అధికంగా ఉంటుంది. కూరగాయలు పండ్లు కలిపి తీసుకోకూడదు. పండ్లు అధికంగా చక్కెరలను కలిగి ఉంటాయి. ఇవి త్వరగా జీర్ణం కావడం కష్టం. పండ్లు ఎక్కువ సేపు జీర్ణం కాకపోవడం వల్ల కూరగాయలతో పులిసి కడుపు నొప్పికి కారణమవుతాయి.
very good information thank you so much