పండు వలవగానే ఎర్రని ముత్యాల్లా నిగనిగలాడే విత్తనాలను చూస్తే అదొక హాయి. మెల్లిమెల్లిగా వాటిని తినేస్తుంటే తీపి, పులుపు, వగరు ఇలా రుచుల సమ్మేళనంతో కనువిందే నోటికి. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న దానిమ్మను ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. హిమోగ్లోబిన్ వృద్ధి చెంది అనిమియా లాంటి జబ్బులు దూరం కావాలన్నా, శరీరంలో చక్కెర స్థాయిలు తగ్గించి మధుమేహాన్ని అదుపులో ఉంచాలన్నా దానిమ్మను మించిన పండు లేదంటే అతిశయోక్తి కాదు. అయితే చాలా మందికి పండు వలిచి విత్తనాలను తినేయడం తెల్సు. కానీ దానిమ్మ తొక్కలో కూడా అద్భుతమైన ఔషధాలు ఉన్నాయని తెలియదు. అలాంటి వారి కోసమే ఈ వ్యాసం కూడా. చదివారంటే ఎపుడూ తొక్కను కూడా పడేయరు ఇది పక్కా
◆విటమిన్-ఎ, విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ కణాలు, కాల్షియం, ఐరన్, విటమిన్ బి6, మెగ్నీషియం దానిమ్మ తొక్కలో పుష్కలంగా ఉంటాయి. దీన్ని ఉపయోగించి బోలెడు ఆరోగ్య చిట్కాలు, బ్యూటీ టిప్స్ ను ఫాలో అయ్యి మంచి ఫలితాలను పొందవచ్చు. అవేంటో ఒక్కసారి చూద్దాం రండి.
◆దీన్ని ఎండించి దంచి జల్లించి మెత్తని పొడి తయారు చేసుకొని టైట్ కంటైనర్ లో నిల్వచేసుకోవాలి.
◆దానిమ్మ తొక్క పొడి, సైంధవ లవణం, మింట్ ఎసెంటియల్ ఆయిల్ రెండు చుక్కలు వేసి బాగా కలిపి నిల్వచేసుకోవాలి దీన్ని రోజు వారి పళ్లపొడిగా ఉపయోగించి పళ్ళు తోముతుంటే పళ్ళమీద ఉన్న పాచి, గార తొలగిపోయి పళ్ళు తెల్లగా అవుతాయి మరియు పిప్పి పళ్ళు నివారించబడతాయి. దీన్ని పొడిగా కాకుండా అప్పటికప్పుడు కాసింత నీళ్ళు కలుపుకుని పేస్ట్ లా కూడా వాడచ్చు. సహజమైన ఈ పద్దతి వల్ల పళ్ళు దృఢంగా ఆరోగ్యంగా మారతాయి.
◆కీళ్ల నొప్పులు, వాపులు బాధిస్తునవారు దానిమ్మ తొక్కను నీటిలో ఉడికించి ఆ నీటిని తాగుతూ ఉండాలి. దీనివల్ల సమస్యలు పరిష్కారం అవడం మాత్రమే కాకుండా ఎముకలు కూడా దృఢంగా మారతాయి.
◆మన శరీరం మీద అయిన గాయాలు మొండిగా మారి మనల్ని వేధిస్తుంటే, దానిమ్మ తొక్కను దంచి గాయాల మీద పట్టులాగా వేయాలి. దీనివల్ల దానిమ్మ తొక్కలో యాంటీ బాడీ లక్షణాలు గాయాన్ని తొందరగా మానిపోయేందుకు సహకరిస్తాయి.
◆దానిమ్మ పొడిని ఫేస్ ప్యాక్ గా ఉపయోగించవచ్చు. దానిమ్మ పొడిలో కాసింత రోజ్ వాటర్ కలిపి మొహానికి ప్యాక్ వేసుకుని ఎండిపోయిన తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. దీనివల్ల మొహం మీద మొటిమలు, మచ్చలు సులువుగా పోతాయి. అంతేకాదు మొహం తేమను సంతరించుకుని మృదువుగా తయారవుతుంది.
◆పచ్చిగా ఉన్న దానిమ్మ తొక్కలను ఆవనూనెతో కలిపి దంచి తరువాత దాన్ని పలుచని బట్టలో వడగట్టుకోవాలి. ఈ దానిమ్మ అవానూనె రసాన్ని వాలిపోయిన వక్షోజాలమీద రాత్రిపూట లేపానం వేసి ఉదయం స్నానం చేస్తూ ఉంటే వక్షోజాలు దృఢంగా గట్టి పడతాయి.
◆ముఖం పొడిబారి తేమను కోల్పోయి నిర్జీవంగా ఉన్నపుడు దానిమ్మ తొక్కల పొడి, పెరుగు కలిపి ముఖానికి రాసి ఆరిపోయిన తరువాత ముఖం కడిగేసుకోవాలి. దీనివల్ల చర్మానికి తేమ అంది చర్మం ఆరోగ్యంగా ఉంటుంది
◆దానిమ్మతొక్కలను వేసి మరిగించి నీటితో గార్గిలింగ్ చేస్తే టాన్సిల్స్, నోటి అల్సర్లు తొందరగా తగ్గుతాయి
◆ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు గ్లాసు నీటిలో శుభ్రమైన దానిమ్మ తొక్కపొడిని ఒక స్పూన్ వేసి తాగడం వల్ల చ్ఏడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుందిమ్ శరీరంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుతుంది. రక్తప్రసరణ వ్యవస్థను పటిష్టం చేస్తుంది.
చివరగా
దానిమ్మ కేవలం పండే కాదు తొక్క కూడా పైన చెప్పుకున్నట్టు బోలెడు రకాలు గా ఉపయోగపడుతుంది. అందుకే తొక్కే కదా అని పడేయకండి.