Post Pregnancy Weight Loss Without Gymming

ప్రసవం తరువాత పొట్టను ఇలా సులువుగా తగ్గించుకోండి.

పెళ్లికి ముందు మహిళలు అందరూ అందంగా ఉంటారు. చక్కని అవయవ సౌష్టవం, ఎత్తుకు తగ్గ బరువు, అందం పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ, ఆహారాన్ని కంట్రోల్ లో ఉంచుకుంటూ అదంతా ఒక వలయం. అయితే పెళ్లితో జీవితం మారిపోతుంది. ముఖ్యంగా గర్భం దాల్చడం అనేది మహిళ జీవితంలో ఒక అద్భుతం. ప్రసవమయ్యాక అదొక కొత్త లోకం. బయటకు అందరికి ఇదే అనిపిస్తుంది. కానీ ప్రసవం తరువాత శారీరక మార్పుల వల్ల కొందరు ఇబ్బందిగానే ఫీలవుతుంటారు. 

 గర్భం దాల్చినవాళ్ళు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9 నెలల పాటు క్రమంగా పెరుగుతూ వచ్చిన కడుపు. బిడ్డ పుట్టగానే వదులు అయిపోతుంది. సాగిన చర్మం తిరిగి యధాస్థితిలోకి వెళ్ళడానికి అదేమి ఎలాస్టిక్ కాదుగా. చర్మము సాగుతూ కడుపులో బిడ్డకు అనుగుణంగా పెరగడానికి ఎలా అయితే 9 నెలల సమయం పెట్టిందో, తిరిగి దాన్ని తగ్గించుకోవడానికి కూడా అంతే సమయం వెచ్చించాలి. వేగంగా పొట్ట తగ్గించుకోవాలని ప్రయత్నాలు చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బ తినే అవకాశం ఎక్కువ ఉంటుంది. 

  ఇప్పటి కాలం అమ్మాయిలు ప్రసవం అవ్వగానే ఎత్తుగా కనిపించే కడుపు చూసుకుని చిరాకు పడుతుంటారు. అయితే పొట్టను తగ్గించుకోడానికి కొన్ని సులువైన చిట్కాలు మీకోసం తప్పక పాటించి నాజూగ్గా తయారైపొండి.

◆ఉదయం లేవగానే పరగడుపున గోరువెచ్చని నీళ్లు తీసుకోవాలి. ఈ నీళ్లలోకి ఒక స్పూన్ తేనె ఒక చెక్క నిమ్మరసం పిండి తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది రోజు మొత్తం చురుగ్గా ఉండేలా చేయడం తో పాటు శరీరంలో కొవ్వులు కరిగించడానికి ఉపయోగపడుతుంది. 

◆బరువు తగ్గడానికి బంగారం లాంటి చిట్కా మీకోసం చూడండి. రెండు లీటర్ల నీటిని ఒక గిన్నెలో వేసి అందులోకి రెండు లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క వేసి బాగా మరిగించాలి. దీనిని చలికాలంలో అయితే గోరు వెచ్చగా, వేసవి కాలంలో అయితే చల్లగా తీసుకోవాలి. దీనివల్ల శరీరంలో పేరుకున్న ఫ్యాట్లు మెల్లిగా కరిగిపోతాయి.

◆బరువు తగ్గటానికి పొట్ట తగ్గించుకోవడానికి యాపిల్ గొప్పగా పనిచేస్తుంది.  యాపిల్ లోని ఫెక్టిన్ లు మనం తీసుకునే ఆహారంలో కొవ్వులు గ్రహించకుండా చేస్తుంది. దానివల్ల మన శరీరంలో చేరే ఫ్యాట్లు విచ్చిన్నమై బరువు పెరగడానికి ఆస్కారం ఉండదు.

◆ముఖ్యంగా బరువు కంట్రోల్ చేసుకోవడానికి  ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆకు కూరలు, కూరగాయలు, సీజనల్ గా లభించే పండ్లు తప్పక తీసుకోవాలి. 

◆ప్రసవం తరువాత బరువు తగ్గాలనే ఆలోచనతో డైటింగ్ చేయడం ఎంతమాత్రం మంచిది కాదు. అది మీరు పిల్లలకు పాలివ్వడంలో చాలా సమస్యలు తెచ్చి పెడుతుంది. కాబట్టి బరువు తగ్గడం అనేది చాలా ఆరోగ్యకరపద్దతి లో ఉండాలి.

◆మొదటిసారి ప్రసవం అయిన వాళ్ళు తమ బరువు తగ్గించుకోవడానికి అవగాహన లోపంతో కఠిన వ్యాయామాలు చేస్తుంటారు. దాని ద్వారా బరువు తగ్గడం అనేది పక్కన బెడితే, ప్రసవం ద్వారా శరీరంలో జరిగిన మార్పులన్నీ అపుడపుడే కుదురుకుంటున్న సమయంలో కఠిన వ్యాయామాలు వల్ల కండరాల పరిస్థితి అస్తవ్యస్తం అవుతుంది. దీనివల్ల అంతర్గత అవయవాలు దెబ్బతినే ప్రమాదముంది.

◆ పిల్లలు ఎపుడూ తల్లిపాలే శ్రేయస్కరం, అది పిల్లలజీ కాదు తల్లికి కూడా బరువు తగ్గడానికి తోడ్పడుతుందంటే ఆశ్చర్యమేస్తుంది. పిల్లలకు పాలివ్వడం ద్వారా దాదాపుగా అయిదు వందల క్యాలరీలు ఖర్చవుతాయి. కాబట్టి పిల్లలకు తల్లిపాలే మంచిది. ఇక పిల్లల్లో రోగనిరోధక శక్తికి కూడా తల్లి పాలు ఉత్తమమైనవి.

◆సాధారణ ప్రసవం అయినా సిజేరియన్ అయినా దాదాపు ఆరు నెలల పాటు కఠిన వ్యాయామాలు, అధిక బరువులు ఎత్తడం వంటి వాటికి దూరంగా ఉండాలి.

◆భోజనం చేయగానే పడుకోవడం అనే అలవాటు మానుకుని కనీసం పది నిమిషాల పాటు నడవడం వల్ల తిన్న ఆహారం తేలికగా జీర్ణమవడానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు కనీసం అరగంట పాటు నడక తప్పనిసరిగా చేసుకోవాలి.

చివరగా…..

ప్రసవం తరువాత వచ్చే పొట్ట  పైన చెప్పినవి పాటిస్తూ ఉంటే సులువుగానే తగ్గిపోతుంది. అయితే అన్ని వేగంగా అయిపోవాలంటే మాత్రం ఆరోగ్యం ఖరాబ్ అవ్వడం ఖాయం కాబట్టి నిదానమే ప్రదానం. ఇంకా డాక్టర్లు సూచించే ప్రెగ్నెన్సీ బెల్ట్ కూడా యూజ్ చేయడం మరవద్దు.

Leave a Comment

error: Content is protected !!