power full home remedy for hair growth

పవర్ఫుల్ రెమిడి ఇది తలకు అప్లై చేసినట్లయితే జుట్టు ఆగకుండా పెరుగుతుంది

ప్రస్తుత కాలంలో అందరికి  జుట్టు రాలడం సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. దానితోపాటు చుండ్రు, ఇన్ఫెక్షన్, దురద వంటి సమస్యలు కూడా ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాయి. వీటిని తగ్గించుకోవడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ను ఉపయోగిస్తూ ఉంటారు. వాటిలో కెమికల్స్ ఉండటం వలన అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే ఎటువంటి ఖర్చు లేకుండా జుట్టు రాలడం, చుండ్రు, దురద, ఇన్ఫెక్షన్ వంటి  సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు.  

    దీనికోసం ముందుగా రెండు మీడియం సైజు ఉల్లిపాయలను   తీసుకొని పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఏదైనా స్ట్రైనర్  సహాయంతో దీన్ని వడకట్టుకుని జ్యూస్ ఒక బౌల్లోకి తీసుకోవాలి.  ఉల్లిపాయలు సల్ఫర్, జింక్, ఫాస్ఫరస్, సెలీనియం, ఐరన్, క్యాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈ  అధికంగా కలిగి ఉంటాయి. ఇవి జుట్టు రాలడం  తగ్గిస్తాయి. అంతేకాకుండా చుండ్రు, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను తగ్గించి జుట్టు కుదుళ్లు బలంగా చేస్తాయి. 

       తర్వాత  ఈ జ్యూస్ లో ఒక చెంచా బాదం నూనె వేసుకోవాలి. బాదం నూనె విటమిన్ ఇ కలిగి ఉంటుంది. విటమిన్ ఈ జుట్టు కుదుళ్లకు అవసరమైన బలాన్ని ఇవ్వడంలో సహాయపడుతుంది. ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ వేసుకోవాలి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి  తెల్ల వెంట్రుకలు రాకుండా చేస్తుంది. దీనిలో ఒక ఎగ్ వైట్ కూడా వేసుకోవాలి. ఎగ్ వైట్ జుట్టు పెరుగుదలకు అవసరమైన ప్రోటీన్లు అందించడంలో ఉపయోగపడుతుంది. అన్నిటినీ బాగా కలిపి జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. 

     45 నిమిషాల వరకు ఉండనివ్వాలి. తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూ లేదా హోం మేడ్ షాంపూ తో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా అయ్యి జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. చుండ్రు దురద ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలు తగ్గుతాయి. తెల్ల వెంట్రుకలు తగ్గి నల్ల వెంట్రుకలు వస్తాయి. దీనిని ప్రతిరోజు రాయాల్సిన అవసరం లేదు. వారానికి రెండు సార్లు అప్లై చేస్తే సరిపోతుంది.  ఇంక నాకు జుట్టు పెరగదు అనుకున్న వారు ఒకసారి ఈ చిట్కాను ట్రై చేసి చూడండి. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.

Leave a Comment

error: Content is protected !!