మన ప్రభుత్వం ముందుగా పెద్ద వయస్సు వారికి వాక్సిన్ వేయడం జరిగింది. వాక్సిన్ వేసుకున్నాం కదా యాంటీబాడీస్ వచ్చేసి ఉంటాయి మనకి ప్రమాదం ఏమి ఉండదు అనే మనో ధైర్యాన్ని వాక్సిన్ అన్ని వయస్సుల వారికి ఇస్తుంది. వాక్సిన్ వేయించుకుని మనో ధైర్యాన్ని కూడగట్టుకోవడం అనేది చాలా అభినందించదగిన విషయం. వాక్సిన్ వేయించుకున్నాం కదా వైరస్ సోకదు అనుకుంటే పొరపాటే.
వాక్సిన్ వేయించుకున్నా మాస్కు సరిగా పెట్టుకోకపోయిన, సరిగా సానిటైజ్ చేసుకోకపోయిన, డిస్టెన్స్ పాటించకపోయిన వైరస్ సోకుతుంది. వాక్సిన్ వేయించుకోవడం వలన హాస్పిటల్లో చేరడం, ఆక్సిజన్ పెట్టించుకోవడం, స్టెరాయిడ్స్ తీసుకునే అవసరం రాకపోవచ్చు. వాక్సిన్ వేయించుకోవడం వలన వైరస్ వలన ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఈ వైరస్ మనకి సోకదు అని మాత్రం అనుకోవద్దు.
ఇప్పుడు 3rd వేవ్లో డెల్టా ప్లస్ వైరస్ రెండు వాక్సిన్లు వేయిచుకున్నా సరే వస్తుంది. వాక్సిన్ వేసుకున్నవారిలో కరోనా లక్షణాలు సీజనల్ ఫీవర్కి ఉన్నట్లుగానే ఉంటాయి
ప్రమాదకరంగా మారవు. వాక్సిన్ వేసుకున్నవారికి వైరస్ వలన ప్రమాదం ఉండకపోవచ్చు. కానీ వారికి వైరస్ సోకడం వలన ఆ వ్యక్తి కుటుంబంలో వారికి, కలిసి పని చేసేవారికి వైరస్ వ్యాపిస్తుంది. అందుకే వాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా నిబంధనలు పాటించడం తప్పనిసరి.
జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఏమైనా కనిపించిన వెంటనే RTPCR టెస్ట్ చేయించుకుని పాజిటివ్గా నిర్దారణ అయితే హోమ్ క్వారంటైన్ అయ్యి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. పాజిటివ్ వచ్చిన తర్వాత నీళ్లు, తేనె మాత్రమే తీసుకుని పాస్టింగ్ చేయడం ద్వారా వైరస్ నుండి త్వరగా బయట పడొచ్చు. ఈ పాస్టింగ్ ఎలా అంటే గోెరు వెచ్చటి నీళ్లలో నాలుగు లేదా ఐదు చెంచాల తేనె కలిపి తాగిన గంటన్నర తర్వాత నీళ్లు తాగాలి. మరల గంటన్నర తర్వాత తేనె కలిపిన నీళ్లు తాగాలి.
ఇలా 45 రోజులు పాస్టింగ్ చేసినట్లయితే వైరస్ ఇన్ఫెక్షన్ నుండి ఈజీగా బయటపడొచ్చు. వేడి నీళ్లు తాగడం, వేడి నీళ్లలో పసుపు లేదా పెప్పర్మెంట్ ఆయిల్ వేసి ఆవిరి పట్టడం వలన ఇన్ఫెక్షన్ ఎటువంటి మందులు అవసరం లేకుండానే తగ్గిపోతుంది. వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్నపుడు ఉడికించిన ఆహారం తింటే అది వైరస్కి ఆహారం అవుతుంది కాబట్టి దానిమ్మ, పైనాపిల్, బత్తాయి, చెరుకు వంటి జూస్లు తాగి పాస్టింగ్ చేయడం మంచిది. మందులతో పాటు ఈ జూస్లు 4,5 రోజులు తీసుకోవడం మంచిది.