precautions-to-be-taken-after-before-vaccines

కరోనా వాక్సిన్ తీసుకోవడానికి ముందు, తరువాత తీసుకోవలసిన ఆహారం మరియు జాగ్రత్తలు!!

ప్రస్తుతం కరోనా వాక్సిన్ తీసుకుంటున్న వారు ఎక్కువ అయ్యారు. అయితే కేవలం వాక్సిన్ తీసుకుంటే సరిపోదు. వాక్సిన్ తీసుకోవడానికి ముందు మరియు తరువాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవేంటో చూడండి.

మద్యపానం మానేయాలి

కొంతమందికి తక్కువ దుష్ప్రభావాలు ఉండగా, మరికొందరు అలసట, తలనొప్పి, కండరాల నొప్పి, చలి, జ్వరం మరియు వికారం మొదలైన సమస్యలు ఎదుర్కొంటారు.  మద్యపానం  ఈ సమస్యలను పెంచుతుంది. మద్యం తీసుకోవడం రోగనిరోధక శక్తిని మరింత దిగజారుస్తుంది. 

 మంచి నిద్రకోసం రాత్రి పూట తప్పక తినాలి

 బాగా విశ్రాంతి తీసుకోవడం  రోగనిరోధక వ్యవస్థను పెంచుకోవడంలో భాగం.  

జర్నల్ ఆఫ్ క్లినికల్ స్లీప్ మెడిసిన్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం కనుగొంది

 చాలా తక్కువ ఫైబర్ (పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, కాయలు మరియు విత్తనాలు) మరియు ఎక్కువ సంతృప్త కొవ్వు మరియు చక్కెర (కొవ్వు మాంసం, పాల ఉత్పత్తులు, స్వీట్లు) తీసుకుంటే నిద్రలేమి సమస్య వెంటాడుతుంది.  దీనికి విరుద్ధంగా, అధిక ఫైబర్ తీసుకోవడం  అలాగే జీడిపప్పు, పిస్తా, బాదం, వాల్నట్స్ ఇంకా వెల్లుల్లి,  మిరియాలు, అల్లం వంటి రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు భాగం చేసుకోవాలి. 

సాయంత్రం వేళ చిరుతిండి తినాలని అనిపిస్తే, తాజా పండ్లు లేదా మొలకెత్తిన గింజలు తీసుకోవాలి. అలాగే నిద్రపోవడానికి మూడు గంటల ముందే భోజనం చేయాలి.  ఇంకా నిద్రకు ఆరు గంటల ముందు కాఫీ, టీ వంటివి తీసుకోవడం ఆపేయాలి. 

బాగా హైడ్రేటెడ్ గా ఉండండి

 వ్యాక్సిన్ తీసుకున్న తరువాత మరియు తీసుకోవడానికి ముందు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మహిళలు మూడు లీటర్ల నీటిని, పురుషులు 4 లీటర్ల వరకు నీటిని తప్పక తీసుకోవాలి అలాగే ఈ నీటి పరిమాణాన్ని కూడా  ఉదయం లేచిన సమయం నుండి, మధ్యాహ్నం నుండి భోజన సమయం వరకు, మధ్యాహ్నం భోజన సమయం నుండి రాత్రి భోజనం చేయడం వరకు. మధ్యలో కచ్చితమైన కొలతలతో నీటిని తీసుకోవాలి.  

ప్రాసెస్ చేసిన ఆహారాన్ని వదిలేయాలి

 అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలు సాధారణ రోగనిరోధక పనితీరును దెబ్బతీస్తుంది.

 కాబట్టి అలాంటివి వదిలేసి బచ్చలికూర, పాలు, అరటి, బొప్పాయి, దానిమ్మ వంటి వాటిని భాగం చేసుకోవాలి.  అలాగే డ్రై ఫ్రూట్స్ పుష్కలంగా తీసుకోలేకపోయినా రోజుకు ఒక డ్రై ఫ్రూట్ లడ్డు లేదా డ్రైఫ్రూట్ బార్ తీసుకోవాలి.

 వ్యాక్సిన్ తరువాత ఆహారం కోసం ఇబ్బంది పడకుండా ముందుగానే అన్ని సమకూర్చుకోవాలి

 వాక్సిన్ తర్వాత కొంతమందికి వికారం వస్తుంది.  మరికొంత మందికి కండరాల నొప్పులు, జ్వరం లాంటివి కూడా రావచ్చు. అలాంటి పరిస్థితులలో  బయటకు వెళ్లకుండా ముందే అన్ని సమకూర్చుకోవడం ఉత్తమం. అరటి, యాపిల్‌, పుచ్చకాయ, కొబ్బరి నీరు, బ్రౌన్ రైస్ మరియు బంగాళాదుంపలు, డ్రై ఫ్రూట్స్, నిత్యావసర వస్తువులు మొదలైనవి ముందే సమకూర్చుకోవాలి.

చీజీ వంటకాలు, క్రీమ్ , వేయించిన ఆహారాలు మరియు మాంసం వంటి భారీ ఆహారాలతో పాటు స్వీట్లు మరియు బేక్ చేసిన ఆహారంతో సహా చక్కెర ఎక్కువ కలిగిన ఆహారాలకు దూరంగా ఉండాలి.  బాగా ఉడకబెట్టిన మరియు తాజా ఆహారాన్ని తీసుకోవాలి.

 చివరగా….

 వ్యాక్సిన్ దుష్ప్రభావాలు కొద్ది రోజుల్లోనే పోతాయి.  కానీ ఆరోగ్యకరమైన అలవాట్లు, ఎక్కువ నీరు త్రాగటం మరియు పోషకాలు అధికంగా ఉన్న భోజనం తినడం వంటివి శాశ్వత ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి.  కాబట్టి తప్పక పాటించండి.

గమనిక : ఈ వెబ్ సైట్ లో పెడుతున్న వివరాలన్నీ పాఠకుల ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా పాఠకుల అవగాహన పెంచడానికి మాత్రమే ..ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు

Leave a Comment

error: Content is protected !!