precautions-to-be-taken-during-vaccination

ఇలాంటి వాళ్ళు ఎట్టి పరిస్తుల్లోనూ టీకా వేసుకోకూడదు..

ప్రజల ప్రాణాలను ప్రజల ప్రాణాలను తుడిచి పెట్టేస్తున్నా కరోనా మహమ్మారి రెండవ దశలో మరింత భయంకరంగా తయారైంది. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా టీకా వేయించుకోవడానికి ముందుకొస్తున్నారు. కొంతమంది మొదటి దశ టీకా వ్యాక్సిన్ తీసేసుకున్నారు.ఎవరు తీసుకోకూడదు అనే విషయాలను మనం తెలుసుకుందాం. ఎవరు తీసుకోవాలి ? ఎవరు తీసుకోకూడదు? అన్ని నియమాలు కూడా ఉన్నాయి. కొన్ని విషయాలు మనం ఇప్పుడు చూద్దాం.

కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటారు. కొంతమందికి ఎందుకు ఇవ్వడం లేదు అనే అనుమానం వచ్చింది కదా. బయట పరిస్థితి ఎలా ఉందో డాక్టర్ చెప్తున్నారు. మొదట దశ వేసుకోవాలంటే అమెరికా దేశాల్లో వచ్చినటువంటి వాక్సిన్ అక్కడి పరిస్థితి దృష్ట్యా 75 సంవత్సరాల పైన ఉన్నటువంటి వారు తీసుకోకూడదని తయారీదారులు చెప్పడం జరిగింది. ఏంటంటే అంటే ఎవరైతే చాలా అనారోగ్యంగా ఉన్నారు అలాగే వృద్ధాప్యం యొక్క ఇబ్బందులు ఎక్కువగా ఎవరికైతే ఉన్నాయో వారు తీసుకోకుండా ఉండటమే మంచిదని అంటున్నారు. 

భారతదేశంలో ఇస్తున్న కోవ్యాక్సిన్, కోవిషీల్డ్ విషయం గురించి చెప్పాలంటే అవి ఇంకా చిన్నపిల్లల్లో ట్రై చేయలేదు గనుక అవి చిన్న పిల్లలకి వాడకూడదు కాబట్టి చిన్నపిల్లల్లో దీని ప్రభావం ఎలా ఉంటుంది అనేది పరిశోధించ లేదు. కాబట్టి పిల్లలకి ఇవ్వడం  జరగడం లేదు. ఆటోఇమ్యూన్ వ్యాధులులో వాడే ఎటువంటి ఆటో డిసీజెస్ కానివ్వండి. ఒక్కోసారి క్యాన్సర్ చికిత్స కోసం తీసుకునే కీమోథెరపీ ఎవరైనా కానీ లైవ్ వైరస్ ఉన్న ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల  వాళ్లకి ఇమ్యూనిటీ రాకపోగా ఈ వైరస్ వలన వచ్చే ఇబ్బందులు ఎక్కువగా ఉంటే దీనికి సంబంధించి డాక్టర్లు అనుసరించదగిన మార్గదర్శకాలు వెల్లడించారు. ఎవరికైనా జ్వరం ఉంటే టీక వ్యాక్సిన్ తీసుకోవద్దు అని చెబుతున్నారు.

జ్వరం ఎక్కువగా ఉన్నవారు  తగ్గి కోలుకున్నాకే టీకా తీసుకోవాలి. అలర్జీ ఉన్నవాళ్లు కూడా వీటికి తీసుకోకూడదు. పూర్తిగా తగ్గిన తర్వాత టీకా వేసుకోవాలి. మొదటి డోస్ లో ఏవైనా సైడ్ఎఫెక్ట్స్ ఉంటే సెకండ్డోస్ తీసుకోవద్దని చెబుతున్నారు. అలర్జీ ఉన్న వంటి వారు ఇంతకుముందు తీసుకున్న ఏదైనా వ్యాక్సిన్ పడకపోతే అందులో ఉండే రసాయన సమ్మేళనం ఇందులో ఉండే అవకాశం ఉంది కనుక డాక్టర్ సలహా లేనిదే టీకా తీసుకోకూడదు. రక్తం గడ్డ కట్టని వారు ఈ టీకా తీసుకోకూడదు. రక్తం పల్చపడటానికి మందులు వాడుతున్న వారు, పెయిన్ కిల్లర్, గుండె జబ్బులు, అనేక కార్డియాక్ సంబంధిత సమస్యలు ఉన్నవారు వాటికి సంబంధించిన మందులు వాడేవారు ఈ టీకా తీసుకోకూడదు.

 చిన్న పిల్లలకు పాలిచ్చే తల్లులు , ఒకసారి కరోనాకి గురైనవారు కనీసం పదిహేను రోజుల వరకు ఎవరు అయితే ఇన్ఫెక్షన్ యాక్టివ్ గా ఉందో వారు ఈ టీకా తీసుకోకూడదు. బలహీనంగా ఉన్న వారు, రోగ నిరోధక శక్తికి మందులు వాడుతున్నవారు, గర్భిణీలు , ఎలర్జీలు ఉన్నవారు, డిజార్డర్స్ ఉన్నవాళ్లు ఈ టీకాను డాక్టర్ సలహాతో వాడాలి. కరోనా బారిన పడి ఈ లక్షణాలు ఉన్నవారు ఈ వ్యాక్సిన్ దూరం పెట్టాలి. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారు డాక్టర్ సలహా లేకుండా వ్యాక్సిన్ వేయించుకోవద్దు. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చు.

Leave a Comment

error: Content is protected !!