Pregnancy Tips for women in telugu

ఒక్కసారి కలిసిన వెంటనే గర్భం రావాలి అనుకునేవారికి

ఈ కాలంలో ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు చేస్తున్నారు. దీనికి ఆడ మగా వ్యత్యాసం లేదు. దీని వలన ప్రతి ఒక్కరిలో ఒత్తిడి, అధిక బరువు సమస్య అధికంగా ఉంటుంది. ఇలాంటి వారు ఆలస్యంగా పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలు కావాలి అనుకుంటే అది కష్టంగా మారుతుంది. ఇలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు పాటిస్తూ గర్బం కోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా విజయవంతం అవుతుంది. అధిక బరువు ఉన్నవారు తప్పకుండా బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి. ముఖ్యంగా పిసిఓఎస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, వీర్యకణాల బలహీనత గర్బం నిలవకపోవడానికి ముఖ్య కారణాలుగా ఉంటాయి. 

ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఆహారంలో మంచి పోషకాలున్న ఆహారం తీసుకుంటూ, వ్యాయామం చేస్తూ బరువు తగ్గాలి. వీలైనంత వరకు ఉదయం, సాయంత్రం ఉడికించని ఆహారం అంటే పండ్లు, మొలకలు, నానబెట్టిన ఎండు విత్తనాలు తీసుకుంటూ ఉండాలి. మధ్యాహ్నం ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండే ప్రోటీన్లు, సూక్ష్మ పోషకాలు ఎక్కువగా ఉండే చపాతీలు, పుల్కాలు, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా ఉండే కూరలు తీసుకుంటూ ఉండాలి. దీని వలన తక్కువ సమయంలో బరువు తగ్గుతారు మరియు పిసిఓఎస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య తగ్గి పురుషులలో స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది.

 అంతేకాకుండా ఇలా ఉద్యోగాలు చేసే భార్యాభర్తలు పిల్లలు కావాలి అనుకున్నప్పుడు స్త్రీ లో పీరియడ్స్ వచ్చిన  పదమూడో రోజు నుంచి పద్దెనిమిది రోజుల వరకూ అండం విడుదలవుతుంది. అప్పుడు భార్యాభర్తలు కలవడం వలన అండం వీర్యంతో ఫలదీకరణం చెంది తప్పకుండా గర్భం నిలుస్తుంది. అయితే గర్బం కోసం పయత్నిస్తున్నపుడు ఈ అయిదు రోజులు తప్పకుండా కలవడం మంచిది. భార్యాభర్తలు ఆ సమయంలో తప్పకుండా ఒకే చోట ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ముప్ఫై ఏళ్ళు దాటినప్పటి నుండి అండం మరియు వీర్యం నాణ్యత తగ్గుతుంది. గర్భం దాల్చడం కష్టమవుతుంది. అలాగే ఇద్దరూ అధిక బరువుతో ఉన్నా లేదా స్త్రీలు ఎక్కువ బరువుతో ఉన్నా కూడా అండం ఆరోగ్యంగా ఉండదు. అందుకే పిల్లలు కావాలి అనుకునేవారు మంచి ఆహారం తీసుకుంటూ బరువు తగ్గి పిల్లల కోసం ప్రయత్నించడం మంచిది.

Leave a Comment

error: Content is protected !!