Preparation of Microgreens at Home Micronutrient Diet

మైక్రో గ్రీన్స్ తయారు చేసుకోవడం ఎలా, వాటి వల్ల ప్రయోజనాలు ఏంటి

మన  వండిన ఆహారాన్ని నాలుగు    పూటలా  తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. కొందరికి ఆరోగ్యం పాడైన  తర్వాత కనువిప్పు కలిగి మైక్రో గ్రీన్స్ తినడానికి  ఇష్టపడుతున్నారు. మనం కూరగాయలు లేదా పప్పులను ఉడికించడం వల్ల వాటి రుచి పోతుంది  చప్పగా అయిపోతాయి. వాటిని రుచిగా చేయడం కోసం నూనెలు, ఉప్పు, కారం, మసాలాలు వేస్తూ ఉంటాం. దీని వల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుంది. 

 ఫ్రూట్స్ తినడం కంటే కూడా   మైక్రో గ్రీన్స్  తినడం వల్ల సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అలా వండిన  ఆహారం తినడం కంటే  మైక్రో గ్రీన్స్ తినడం వల్ల  మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. మైక్రో గ్రీన్స్  తినడం వలన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. మైక్రో  గ్రీన్స్  తినేవాళ్ళకి  ఎప్పటికీ పోషకాహార లోపం అనేది రాదు. మైక్రో గ్రీన్స్ గురించి ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం.  ప్లాస్టిక్ ట్రేలను తెచ్చుకొని  అవి  అడుగు వెడల్పు,  అంగుళం నర పొడవు ఉండేలా తీసుకొని దానికి చిల్లులు పెట్టుకోవాలి. దానిలో కొంచెం మట్టి,  కొబ్బరి పొట్టు వేసుకోవాలి.

పెసలు,  బటాని, సెనగలు, ప్రొద్దుతిరుగుడు, గింజలు గుమ్మడి గింజలు , ఆల్ఫ్ ఆల్ఫా విత్తనాలు వంటి వాటిని 10 నుంచి 12 గంటల వరకు నానబెట్టుకోవాలి. వాటిని నీటిలో నుంచి తీసి  క్లాత్లో మూట కట్టడంవల్ల మొలకలు వస్తాయి. మట్టి మీద మొలకలు చల్లాలి. ఇంకొక పొరలాగా మట్టిని  కప్పాలి. పైన నీళ్ళు కొంచెం కొంచెంగా జల్లుకోవాలి. ట్రే లని  ఎండ,  గాలి తగిలేలా గా వరండాలో, బాల్కనీలో లేదా కిటికీల దగ్గర పెట్టాలి. ఒక వారం రోజుల్లో నాలుగు నుండి ఐదు అంగుళాల వరకూ మొక్కలు పెరుగుతాయి. 

వీటిని కట్ చేసుకొని తినేయాలి. సలాడ్ లో కూడా కలుపుకుని తినవచ్చు. వీటితో పాటు  దోసకాయలు, పుదీనా, క్యారెట్ , బీట్ రూట్, క్యాబేజీ, కాలీఫ్లవర్, ముల్లంగి వంటి వాటిని కూడా పైన ఆకులను కట్ చేసుకుని తినొచ్చు. వీటిని ఇలా తినలేకపోతే క్యారెట్, బీట్రూట్,  యాపిల్, దానిమ్మ జ్యూస్ లలో  మైక్రో గ్రీన్స్ కలిపి జ్యూస్ చేసుకొని ఫ్రెష్ గా తీసుకోవాలి.  వీటిని వేయించుకుని,  వండి మాత్రం అస్సలు తినకూడదు.

అలా తిన్నట్లయితే  ఫలితం కనిపించదు. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రక్తనాళాలు బాగా పనిచేస్తాయి. రక్తం వృద్ధి చెందుతుంది. రక్తనాళాల్లో బ్లాకేజెస్ అనేవి ఏర్పడవు. లివర్ డీటాక్సిఫికేషన్ చాలా బాగా జరుగుతుంది.  మనిషికి కావాల్సిన పోషకాలు, న్యూట్రిషన్స్  మైక్రో గ్రీన్స్  నుండి సమృద్ధిగా లభిస్తాయి.

Leave a Comment

error: Content is protected !!