Probiotics Benefits Myths in telugu

ప్రోబయోటిక్స్ వలన లాభాలేంటి…

సహజంగా ప్రోబయోటిక్స్ అందాలంటే ఏం చేయాలో ఏ అలవాట్లు మార్చుకోవాలో తెలుసుకుందాం. ప్రోబయోటిక్స్ అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్(IBS), అల్సరేటివ్ కోలిటీస్ అల్సర్లు వచ్చినా అలాగే లూజ్ మోషన్స్ డయేరియా ఉన్నా వాళ్ళకి ప్రోబయోటిక్స్ వాడితే ఆ జబ్బులు తగ్గుతున్నాయి.

 ప్రోబయోటిక్స్ అంటే ప్రేగులలో ఉండే ఫ్రెండ్లీ బాక్టీరియాను పెరిగేలా చేస్తాయి. ఫ్రెండ్లీ బాక్టీరియా వలన లాభాలేంటో తెలుసుకుందాం. ప్రేగులలో ప్రమాదకరమైన బాక్టీరియా, మంచిబాక్టీరియా అని రెండు రకాలు ఉంటాయి. మంచి బాక్టీరియా చిన్న ప్రేగు గోడలమీద, పెద్ద ప్రేగు మలంప్రేగు గోడల పైపొరల్లోనూ ఉంటాయి. ప్రేగులపొరలయొక్క జిగురుకు అంటుకుని ఉంటాయి ప్రోబయోటిక్స్ బాక్టీరియా. 

ఆ బాక్టీరియా ఎంత ఎక్కువ మోతాదులో ప్రేగుల గోడలపై ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటారు. ఈ బాక్టీరియా తగ్గిపోతే రక్షణవ్యవస్థ దెబ్బతింటుంది. మనకు అనేక రకాల లాభాలు ప్రేగులలో నుండి పోతుంది. హానికరమైన బాక్టీరియా ప్రేగులపై పెరిగితే ఆరోగ్యం పాడవుతుంది. మంచి బాక్టీరియా ప్రేగులలో కదులుతూ బి12 విటమిన్ తయారుచేస్తుంది. ప్రతిప్రాణికి బి12 విటమిన్ అవసరం. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి

ఈ బాక్టీరియా ఉత్పత్తి తగ్గడంవలన బి12 విటమిన్ లోపం వస్తుంది. విటమిన్ కె ఉండాలి ఒంట్లో రక్తం గడ్డకట్టడానికి. విటమిన్ కె ప్రేగులలో తయారవుతుంది. ఈ సూక్ష్మ జీవులు ప్రేవులలో అనేకం తయారు చేస్తూ ఉంటాయి. వైరస్లు, ఫంగస్ ఫంగీ క్రిములు శరీరంలోకి వెళ్ళినప్పుడు రక్తంలో కలవకుండా ఈ మంచి బాక్టీరియా అడ్డుకుంటుంది. మంచి బాక్టీరియా ఈ క్రిములతో పోరాడతాయి. 

మనం తినే ఆహారంలో ,తాగేనీటిలో క్రిములు లోపలికి వెళ్ళిపోతాయి. నోట్లోనూ రక్షణ వ్యవస్థ ఉంటుంది. అలాగే పొట్టలోనూ హైడ్రోక్లోరిక్ యాసిడ్ రక్షణగా ఉంటుంది. వీటన్నింటినీ దాటుకుని కొన్ని క్రిములు లోపలికి వెళ్ళిపోతాయి. ఈ బాక్టీరియా ఎందుకు తగ్గిపోతుందంటే మనం తినే ఆహారంలో ఉండే పురుగుమందులు, ఎరువులు కారణం. 

 పంచదారలో ఉండే కెమికల్స్ వలన ప్రేగుల పైపొరలు దెబ్బతింటాయి. బాక్టీరియా బెడ్నంతటినీ ఈ కెమికల్స్ నాశనం చేస్తాయి. ఆల్కహాల్, కూల్ డ్రింక్స్ వలన కూడా బాక్టీరియా దెబ్బతింటాయి. పెయిన్ కిల్లర్స్, యాంటీ బయోటిక్స్ వలన బాక్టీరియా దెబ్బతినొచ్చు. పెయిన్ కిల్లర్స్, యాంటీ బయొటిక్స్ వలన ప్రేగుల పైపొర దెబ్బతింటే అల్సర్లు, పుండ్లు ఏర్పడతాయి.

 మోషన్స్ అవ్వడానికి వేసుకునే మందుల వలన కూడా మంచి బాక్టీరియా దెబ్బతింటుంది. వీటన్నింటిని వలన కూడా మంచిబాక్టీరియాకు హాని కలుగుతుంది. రక్షణ వ్యవస్థతో పాటు విటమిన్లు కూడా తయారవవు. మనం తినే ఆహారంలోని పోషకాలు గ్రహించాలంటే ఈ సూక్ష్మ జీవులు చాలా అవసరం. అందుకే ప్రోబయోటిక్స్ బాగుంటేనే ఆరోగ్యానికి మంచిది. లేకపోతే పోషకాహరలోపం వస్తుంది. అప్పుడప్పుడు పుల్లటిపెరుగు తినాలి. రోజుకి ఒక కప్పు తీసుకోవాలి. 

అలాగే పుల్లబెట్టిన గెంజి, రోజుకి ఒక అరటిపండు, అలాగే బీన్స్  , నట్స్, మొలకలు తినడం వలన మంచి బాక్టీరియా పెరిగి ప్రేగులపై ఉంటున్నట్లు పరిశోధనల్లో తేలింది. అలాగే మలబద్దకం వలన చెడుక్రిములు పెరిగి మంచి బాక్టీరియాను దెబ్బతీస్తాయి. కనుక మంచి ఆహార నియమాలను పాటిస్తు ఉంటే మలబద్దకం తగ్గి మంచి బాక్టీరియా వృద్ధి చెంది ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Leave a Comment

error: Content is protected !!