Probiotics-fermented-butter-milk-good or bad

హోమియోపతి ఆయుర్వేద డాక్టర్లు పుల్లటి మజ్జిగ తాగమని చెబుతున్నారు ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది?

పుల్లటి మజ్జిగ మంచిదేగానీ అంబలి లో ఉన్నంత పౌష్టిక అంశాలు మజ్జిగ లోఉండవు, పుల్లటి మజ్జిగ చాలా మందికి పడదు కానీ అంబలి అందరికి పడుతుంది అంబలి లో అన్ని రకాల సూక్ష్మజీవులు ఉన్నాయి మజ్జిగ పట్టే వాళ్లకి తాగవచ్చు అది కూడా ఒక అద్భుతమైన మంచి చిట్కా.

అంబలి ఎలా తయారు చేసుకోవాలి? ఎప్పుడు తీసులోవాలి?

  • ఒక లోటా సిరి ధాన్యం /రవ్వ / పిండి
  • 12 లోటాలు నీటిలో 7 నుంచి 8 గంటలు నాననివ్వాలి
  • తర్వాత అదే నీళ్లలో చిన్న మట్టి కుండలో ఒక ఇరవై నిమిషాలు బాగా ఉడకబెట్టండి
  • చల్లగా అవుతుండగా ఒక ఖద్దరు బట్ట మట్టి కుండ మూతి కట్టేయండి ఐదారు గంటలు అలాగే ఉంచండి.
  • అంతే అంబలి తయారైపోతుంది.

కావాలంటే ఈ అంబలిలో మీరు పుల్లటి మజ్జిగ గాని ఊరగాయ గాని, పప్పు కానీ, చారు కానీ ఇష్టం వచ్చిన కూరలు తీసుకొని కలుపుకుని తినవచ్చు. ఈ అంబలి ఇంట్లో వాళ్ళందరూ తీసుకోవచ్చు. రోజుకు  రెండు గ్లాసుల చొప్పున అందరు తీసుకోవచ్చు. ఇది రోజు అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. క*రోనా  అయిపోయేంత వరకు రోజు తీసుకోండి. ఎటువంటి ఇబ్బంది ఉండదు, అంబలి ని ఎప్పుడైనా తీసుకోవచ్చు

నా అభిప్రాయం మరియు వైజ్ఞానికంగా అందరూ ఉదయాన్నే కడుపునిండా భోజనం చేయాలి మధ్యాహ్నం అల్పాహారము ఉపహారములు తినకుండా పర్వాలేదు మరియు సాయంకాలం కొద్దిగా తెనాలి ఈ విధంగానే మనము తినాలి.

Leave a Comment

error: Content is protected !!