Protein and Fiber Rich Breakfast Healthy Millets Idli

ఒక ప్లేట్ ఇడ్లీ తింటే చాలు రోజు మొత్తానికి శరీరానికి కావలసిన ప్రొటీన్లు అందుతాయి

ప్రస్తుతం అందరికీ ఆరోగ్యం పట్ల అవగాహన చాలా ఎక్కువగా ఉంది. అందరూ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి ఆహారం తీసుకోవడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఈ మధ్యకాలంలో కొర్రలు సామలు వంటి వాటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.  ప్రస్తుతం అందరికీ కొర్రలు  మరియు చిరుధాన్యాలు మీద మక్కువ కూడా పెరిగింది. ఇప్పుడు మనం కూడా అలాంటి శరీరానికి కావలసిన పోషకాలన్నీ తొలగించు కొర్రలతో  ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

కొర్రలుతో చేసిన ఇడ్లీ   ఉప్పుడు రవ్వతో చేసిన ఇడ్లీ తో పోల్చుకుంటే ఫైబర్, ప్రోటీన్, మినరల్స్  యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి.  సామాన్యులకి క్వినోవా రైస్ కొనుక్కోడానికి అందుబాటులో ఉండదు అలాంటి వారు అలాంటి ప్రయోజనాలే ఉన్న కొర్రలు ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనం కొర్రలతో ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీని కోసం మనం ముందుగా ఒక  అరకప్పు అటుకులు, ఒక కప్పు కొర్రలు,  అర కప్పు పొట్టుతీయని మినప్పప్పు అన్నిటిని కలిపి  రెండు సార్లు  కడిగి ఏడు నుంచి  ఎనిమిది  గంటల పాటు నానబెట్టుకోవాలి. 

ఏడు గంటలు నానిన తరువాత వీటిని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసి మూత పెట్టుకొని రాత్రంతా అలా ఉండనివ్వాలి. దీనిలో మంచి సూక్ష్మజీవులు పెరిగి  పిండిని పులిసేలా  ఒదుగు అయ్యేటట్లు చేస్తాయి.  రాత్రంతా పిలిచిన పిండి ఇడ్లీ  చేసుకుంటే బాగుంటుంది. అప్పటికప్పుడు చేసుకున్న పిండితో బాగుండవు.   ప్రయోజనాలు  కూడా తక్కువగా ఉంటాయి. ఉదయాన్నే ఈ  పిండిని ఇడ్లీ  పెట్టుకోవడానికి స్టౌ మీద పాన్ పెట్టి కొని ఒక చెంచా  మీగడ వేసుకోవాలి. 

తర్వాత  దీనిలో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర  అర కప్పు కరివేపాకు అర కప్పు కొబ్బరి తురుము ఒక చెంచా కచ్చాపచ్చాగా దంచిన మిరియాలపొడి,పావు చెంచా ఇంగువ వేసి బాగా కలుపుకోవాలి.  తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొబ్బరి తాలింపుని పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. కొబ్బరి చట్నీతో ఇడ్లీ  తింటాం కానీ కొబ్బరి తాళింపు ఇడ్లీ లో వేసుకుని చేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటాయి. పిల్లలకి కూడా తెలివితేటలకు, మేధాశక్తి కి కొబ్బరి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఇడ్లీ పల్లీ చట్నీ లేదా టమాటో చట్నీ లేదా కొబ్బరి చట్నీ  పుట్నాల చట్నీ, కొత్తిమీర చట్నీ, పుదీనా చట్నీ వంటి వాటిలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.  కాబట్టి ఇలాంటి వాటితో తీసుకుంటే ఇంకా మంచిది.

Leave a Comment

error: Content is protected !!