ఓవరీస్ నుంచి వాటిని స్టిములేట్ చేసి ఎగ్స్ కరెక్ట్ గా రిలీజ్ అవ్వడానికి మెచ్యూర్ అవడానికి ప్రధాన కారణం ఈస్ట్రోజన్ ఇది లేకపోతే ఎగ్స్ సరిగా తయారు కావు. ఇక రెండవది ఎండోమెట్రియం పొర థిక్నెస్ ని అవసరాన్ని బట్టి పెంచడానికి తగ్గించడానికి ఈస్ట్రోజన్ హార్మోన్ అతి ముఖ్యంగా ఉపయోగపడుతుంది. ఇక మూడవది ఆడవారిలో యోని భాగంలో కాస్త జిగురు ఉత్పత్తి నీ పెంచడానికి. ఆ జిగురు ద్వారా అక్కడే ఉత్పత్తి అయ్యే సెక్రెషన్స్ ద్వారా వైరస్ బ్యాక్టీరియా లేదా ఫంగస్ లాంటి క్రిములను చంపడానికి ఆ వాతావరణాన్ని హెల్దిగా చేయడానికి ఈ సెక్రెషన్స్ అన్ని ఈస్ట్రోజన్ కరెక్ట్ గా ఉన్నప్పుడే ఉత్పత్తి అవుతాయి.
నాలుగవది చూస్తే బోన్స్ స్ట్రెంత్ కి ఈస్ట్రోజన్ చాలా అవసరం. ఆడవారిలో కొలెస్ట్రాల్ ఉత్పత్తి పెరగకుండా ఉండడానికి కారణం కూడా ఈస్ట్రోజన్. అందుకని మగవారికి గుండె జబ్బులు ఎక్కువ వస్తాయి కానీ ఆడవారికి తక్కువ వస్తాయి. కొలెస్ట్రాలజిస్ట్ లేడీస్ కి తక్కువ ఉండడానికి కారణం ఈస్ట్రోజన్. అందుకని ఈ ఈస్ట్రోజన్ బాగా ఉంటే అంత మంచిది. ఇక ఆరవది తీసుకుంటే మూడ్ స్వింగ్స్ రాకుండా కంట్రోల్ చేయడానికి, స్త్రీలకి ఎక్కువ ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండడానికి, ఎక్కువ నవ్వడానికి కూడా కారణం ఈస్ట్రోజన్. అదే మెనోపాస్ స్టేజ్ మూడ్ స్వింగ్స్ వచ్చి మనసు డిస్టర్బ్ అయి ఆనందం తగ్గిపోతుంది.
అందుకని ఇలాంటి వాటికి ఈ ఈస్ట్రోజన్ కారణం. ఇక చిట్ట చివరిది ఏడవది బ్రెస్ట్ లోపల ఉండే టిష్యూస్ నీ ఇంక్రీస్ చేసి సైజు పెంచడానికి, పాలు ఎక్కువ ఉత్పత్తి సరిగా జరగడానికి ఈస్ట్రోజన్ హార్మోన్ అది ముఖ్యంగా స్త్రీలకి ఉపయోగపడుతుంది. మరిన్ని లాభాలు కలిగించే ఈస్ట్రోజన్ హార్మోన్ బాగా ఉండాలి అంటే ప్రోటీన్ డైట్ ఎక్కువగా తినాలి. ఈస్ట్రోజన్ బాగా ఉండే విత్తనాలు సోయాబీన్స్. దీనిలో ఫైటో ఈస్ట్రోజన్ గా ఉంటుంది. ఈ ఫైటో ఈస్ట్రోజన్ మనం తిన్న తర్వాత లోపలికి వెళ్లి ఈస్ట్రోజన్ గా మారడమే లేట్ అన్నమాట అందుకని సోయాబీన్స్ ని నానబెట్టుకుని కూరల్లో వాడుకోవడం మీల్ మేకర్ లాంటివి ఎక్కువగా వాడుకోవడం.
అలాగే స్ప్రౌట్స్, నట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఈస్ట్రోజన్ బాగా తయారై ఆడవారికి హార్మోన్ పుష్కలంగా ఉండి చక్కటి ఆరోగ్యాన్ని, ఏడు రకాల లాభాల్ని ఈస్ట్రోజన్ అందిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ డైట్ ని తీసుకుని స్ట్రెస్ ని తగ్గించుకోవాలి.