రోజు వారి జీవితంలో పాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఏమైనా వంటకాలు చేసుకోవడానికి, కూరలో, తాగడానికి ఎక్కువగా పాలను ఉపయోగిస్తాం. మనం రోజూ ఇంత ఎక్కువగా వాడే పాలు కల్తీ చేయబడుతున్నాయి. కల్తీ చేసిన పాలు తాగడం వలన తెలియకుండా మనమే అనారోగ్యాలు తెచ్చుకుంటున్నాం. గేదెలు, ఆవులు ఎక్కువ పాలు ఇవ్వడం కోసం స్టెరాయిడ్స్, యాంటిబయాటిక్స్ ఇచ్చి వాటిని కదలకుండా ఒకేచోట ఉంచి పాలను ఉత్పత్తి అయ్యేలా చేస్తారు. ఈ పాలను తీసుకోవడం వల్ల రకరకాల రోగాలు వస్తాయి.
ప్యాకెట్ పాలను అసలు వేటితో తయారు చేస్తారో కూడా మనకు తెలియదు. ఇలాంటి పాలను తాగి ఆరోగ్యం పాడు చేసుకోవడం కంటే సోయాచిక్కుడు పాలని తాగడం వలన ఆరోగ్యం కాపాడుకోవచ్చు. సోయాచిక్కుడు పాలను వాడటం వలన ఆరోగ్యం కాపాడుకోవడం కాకుండా డబ్బులు కూడా ఆదా చేసుకోవచ్చు. సోయాచిక్కుడు కిలో 120 నుండి 150 రూపాయలు లోపు వచ్చేస్తాయి. గుప్పెడు సోయా చిక్కుడు గింజల్ని తీసుకుని 12 గంటల పాటు నానబెట్టాలి.
తర్వాత సోయా చిక్కుడు గింజలు చేతులతో నలిపి మినప్పప్పు పొట్టు తీసినట్లు వీటికి కూడా పొట్టు పోయి పప్పు మాత్రమే మిగులుతుంది. ఈ పప్పును మిక్సీలో వేసి ఒక గ్లాసుడు నీళ్ళు కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఫిల్టర్ చేసి పాలను, పిప్పిని వేరు చేసుకోవాలి. ఈ పాలు స్టవ్ మీద పెట్టి మామూలు పాల వలె మరిగించుకోవాలి సోయా చిక్కుడు పాలు పచ్చిగా తీసుకోకూడదు. పచ్చి గా తీసుకుంటే వగరుగా అనిపిస్తాయి. సోయాచిక్కుడు పాలని తాగడానికి, వంటలలో, పిల్లలకి ఇవ్వడానికి, ఏమైనా వంటలు తయారు చేసుకోవడానికి, పెరుగు చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు.
గేదె పాలలో 100 ml లో 3.5 గ్రామ్స్ ప్రోటీన్స్ ఉంటే 100ml సోయా చిక్కుడు పాలలో 43 గ్రామ్స్ ప్రోటీన్స్ ఉంటాయి. ఈ పాలు తీసుకోవడం వలన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి, గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. సోయాచిక్కుడు పాల వలన ఫాట్ అనేది అస్సలు రాదు. ఈ పాలను తయారు చేసుకునేటప్పుడు ఫిల్టర్ చేసిన పిప్పిని ఫ్రిడ్జ్ లో పెట్టి గట్టిగా అయిన తర్వాత పన్నీర్ లాగా ముక్కలుగా కట్ చేసి వంటలు చేసుకోవచ్చు. స్నాక్స్ , హాట్ ఏం చేసిన చాలా రుచిగా ఉంటాయి. సోయా చిక్కుడు పాలను వంటల్లో కూడా వాడుకోవచ్చు. ఈ పాలు వలన వంటలు కమ్మగా ఉంటాయి. పాలను గోరువెచ్చగా ఉన్నప్పుడు తోడు వేస్తే పెరుగుగా కూడా ఉపయోగించుకోవచ్చు. మామూలు పెరుగులాగానే ఉంటుంది.